జనవరి
గురుసాన్నిధ్యమును వదిలి ఉండలేని పరిస్థితి వచ్చేవరకూ సాధన చెయ్యాలి. సాధకుడుకి ఎంత ఆవేదన ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆవేదన గురువుకి ఉంటుంది. సాధన చేసేటప్పుడు నాలోకి గురువు యొక్క సర్వజ్ఞత్వము ప్రవేశిస్తోంది అనే భావనతొ చెయ్యాలి.
060197 దత్త
మీ భాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే మీరు మాయలొ పడరు. భాధ్యతలను విస్మరించి సాధనలొ మునిగారొ మాయలొ పడిపోతారు.
070197 దత్తావతార సాధన
మహానుభావుల దర్శనము మీ సాధనలకు ఎప్పుడూ ఉపయోగం ఉంటుంది. దత్త గురు పరంపర మూడూ భాగాలుగా విభజించబడి ఉంది. దత్తాత్రేయ శ్లోకాల వివరణ అద్భుతమైన రీతిలో ఇవ్వబడింది.
170197 గురు అస్టకము శుర్య కిరణ సోషణ విద్య
1.ఈశాన్యము - ఓం బుధాయ నమ: గణాధిపతయే నమహ:,2. తూర్పు ఓం శుక్రయనమహ: -ఓం దేవధిపతయే నమహ:,3. ఆగ్నేయము - ఓం చంద్రాయ నమహ: - ఓం తేజోధిపతయే నమహ:, 4. దక్షిణము ఓం కుజాయ నమహ - ఓం ప్రేతాధిపతయే నమహ:, 5.నైఋతి - ఓం రాహవే నమహ: - ఓం రక్షోధిపతయే నమహ:, 6. పశ్చిమము - ఓం శన్సైశ్చరాయ నమహ: - ఓం జలాధిపతయే నమహ:, 7. వాయువ్యము - ఓం కేతవే నమహ: - ఓం ప్రాణాధిపతయే నమహ:, 8. ఉత్తరము ఓం గురవేనమహ ఓం ధనాధిపతయే నమహ, పృధ్వి - " పృధ్విత్వయా ధృతాలోకా....పవితం కురుచాశనమ". "
170197 గురు తత్వము
సర్వ వ్యాపి, సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి గురువుకు సమర్పణ చేసుకోవటం నేర్చుకునేవరకు మీరు మీ సాధనలో ఉన్నతిని సాధించలేరు.
మార్చి
"ములాధార చక్రము క్రింద భాగములొ - రాహువు
ములాధార చక్రము - శని
స్వాధిష్ఠాన చక్రము- చంద్రుడు
మణిపూరక చక్రము - బుధుడు
అనాహత చక్రము- సూర్యుడు
విశుధ్ధి చక్రము - శుక్ర గ్రహము
ఆజ్ఞా చక్రము - బృహస్పతి - గురు గ్రహము
సహస్రార చక్రము - కుజ
సహస్రార చక్రము పై భాగములొ - కేతువు"
060397 మౌన సాధన
మౌన సాధన ద్వారా మనము సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపి గురువును పట్టుకోగలము, అద్భుతమైన శక్తిని పొందగలుగుతాము.
గురువు చేసే పనులను ప్రశ్నించటము అనే దుర అలవాటు మానుకోవాలి. గురువులని ఏమి అడగాలి, ఏమి కోరుకోవాలి అనేది ప్రతి సాధకుడు తప్పనిసరిగా నేర్చుకొనవలెను
090397 సాయి తత్వం
పిల్లల్ని వాళ్ళు చదువుకోదలచిన చదువుల్ని చదవనివ్వాలి, పెద్దల కోరికలని తీర్చుకునేందుకు పిల్లల నెత్తిన మన అభిప్రాయాలని రుద్దకూడదు.
కాల సర్ప దోషాన్ని అధిగమించటము అనగా మనము చేసే ఏ పనిని వాయిదా వెయ్యకుండా తక్షణము చెయ్యటము. సూర్యుడి నుంచి వచ్చే కిరణములు వాటి పేర్లు, మన శరీరములోని చక్రములు మధ్య గల సంబంధము అధ్భుతంగా వివరించారు. Manipuraka chakra - 10 petals, 5 gyanendriyas, 5 karmendriyas- viswakarma rays.
గాయత్రీ మంత్రజపము వలన సత్యమును పొందవచ్చు. గాయత్రీ జపమువలన సర్వ సమర్ధత, సర్వ వ్యాపకత, సర్వాంతర్యామిత్వము లభిస్తుంది.
అనాహత చక్రములొని గురువుని పట్టుకోవటానికి ప్రయత్నించాలి. హృదయములోని ఆ స్పర్శని పట్టుకోవాలి.
మౌన సాధన ద్వారా మనము సర్వ సమర్ధుడు, సర్వాంతర్యామి, సర్వ వ్యాపి గురువును పట్టుకోగలము, అద్భుతమైన శక్తిని పొందగలుగుతాము.
ఏప్రిల్
12 ఇటుకలు ద్వారా షిరిడీ సాయి ఏమి సాధన చేసారో ఆ సాధనని ఈ ద్వాదశి యజ్ఞము ద్వారా సాధించవచ్చు. గురువుని భగవంతిడిని ఒక నౌకరులాగ చూడకండి.
మే
సి.వి.వి. ధ్యాన వివరణ, మరియు దాని ప్రాముఖ్యత వివరించారు. దీని ద్వారా సకల రోగములు నివారింపబడతాయి. సూర్య కిరణములు 7 మహా వ్యాధులు నివారింపబడతానికి సూర్యకిరణ విజ్ఞానము ఉపయోగింంచుకోవాచ్చు.
నమస్తే యోగి రాజేంద్రా దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్షా భక్తితే దేహిమే ధృఢాం
110597 దత్త ప్రదక్షిణలు శంకర జయంతి
గురువుకి సంపూర్ణ సమర్పణ ఎలా చేసుకోవచ్చు? మనస్సు, వాక్కు, కర్మలు గురువుకి సమర్పించే విధానాన్ని వివరించారు. ఆది శంకరాచార్యులవారు వ్రాసిన గురు అష్ఠకమునకు వివరణ. యజ్ఞోపవీతములోని 5 పోగులు - బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, యజ్ఞపురుషుడు మరియు సూర్యుడు.
120597 గురు పాదుకాస్థవము
గురుపాదుకాస్ఠవము యొక్క అధ్భుత వివరణ. మన శరీరంలోని రాశులకు, గ్రహాలకు, శ్లోకమునకు గల సంబంధమును విశదీకరించారు. భౌతిక అధ్యాత్మిక ఫలితాలను శంకర విరచిత శ్లోకాలవలన పొందవచ్చు అన్న ప్రతిపాదన చేసారు.
120597 సూర్య నమస్కారాలు
ఉదావశు, విశ్వవ్యచ, విశ్వకర్మ సూర్య కిరణాలు సూర్యనమస్కారములద్వారా ఒక్కొక్క చక్రములోనికి ప్రవేసిస్తున్నాయి. సుర్యనమస్కారములు చెయ్యదల్చుకున్న సాధకులు తప్పనిసరిగా ఈ ప్రవచనాన్ని వినవలెను.
వేదాలు
సాధకులు సాధనా సమయములో వచ్చిన అన్ని ఆకర్షణలను అధిగమించి లక్ష్యం మీదే దృష్ఠి పెట్టాలి.మన మనస్సులు, ఆచరణ, శ్రధ్ఢా నిర్మలంగా ఉంటే విష్ణు సహస్రనామముకానీ లలితా సహస్రనామ పారాయణ చేస్తే వాటి ఫలసృతిలో చెప్పబడిన ఫలితాలను చక్కగా పొందవచ్చు.
సూర్య నమస్కారములలోని ఒక్కొక్క నమస్కారము ఒక్కొక్క రాశికి సంబంధిచినది. ఈ నమస్కారములను సరిగ్గా ఉపయోగించుకొనగలిగితే అష్ఠసిధ్ధులు మీ సొంతము అవుతాయి.
140597 అఖండ గురుసత్తా కాన్సెప్ట్
గురుప్రణాళికలో అందరు గురువులూ కలిసి పని చేస్తున్నారు. కానీ వారి శిష్యుల అజ్ఞానం వలన ఆ గురుప్రణాళికకి ఎంత భగం కలుగుతోందో తెలుసుకుంటె మానవజతి ఎదుర్కోబోఏ కర్మకి గురువులు కూడా బాధ్యతవహింఛలేరు. దయచేసి అందరూ ఈ విషయాన్ని సంపూర్ణంగా అర్ధము చేసుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి.
జులై
ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నామ యజ్ఞము యొక్క వైజ్ఞానిక అధ్యాత్మిక రహస్యములను పూర్తిగా వివరించారు. ఒక అధ్భుతమైన సంఘటనకు ఈ యజ్ఞములో పాల్గొన్న పరిజనులు ప్రత్యక్ష సాక్షులు.
ఆగస్ట్
దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము సామూహిక పారయణ.
త్రిపురాంతకములో జరిగిన సాధనా శిబిరములో శ్రీవిద్య మీద ప్రవచనము. శ్రీవిద్య బీజాక్షర మంత్రదీక్ష.
షోడశి కళలు చంద్రుడికి మాత్రమే ఉన్నాయి. లలితా సహస్రనామములోని మొదటి 16 శ్లోకములు చంద్రుడియొక్క 16 కళలకు సంబంధించినవి.
అన్ని శస్త్రాలకు, వేదాలకు, భౌతిక జగత్తుకు, అన్ని మొత్తం సృష్ఠి అంతటికీ కారణము గాయత్రీ మంత్రము. గాయ త్రీ మంత్రాన్ని జపించటమేకాదు ఉపయోగించుకోవటము కూడా రావాలి. గాయత్రీ మంత్రముతో శ్రీ విద్యను కలుపుకుంటే జడజగత్తుని అధిగమించవచ్చు.
090897 త్రిపురాంతకం
షోడశీ మంత్ర వివరణ . బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఆవిష్కరించింది సిధ్ధాశ్రమానికి చెందిన అన్నిబిసెంట్, గురుదేవులకు దీక్ష ఇచిన మదనమోహన మాలవ్యాగారికి సిధ్ధాశ్రమంతో సంబంధము కలవారు, ఈ విద్యాలయము ప్రపంచంఉలోని అతి విశాల విద్యాలయాల్లో మూడో స్థానంలో ఉంది. మరి ఈ నాటి విద్యాలయాలు దేవాలయాలు ఎంతగా దిగజారిపోయాయి? ఇందులో మన బాధ్యత ఏమిటి?
150897 కృష్ణాష్ఠమి మన లక్షము
ఏ సాధనలు చేసిన మన లక్షము ఏమిటి అని గుర్తు ఉంచుకోవాలి, ప్రేమ తత్వము పెంచుకోవటము ప్రతి సాధకుడికి తప్పనిసరి.
సెప్టెంబర్
బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున..భగవద్గీతలోని ఈ శ్లోకమునకు సంపూర్ణ వివరణను ఇచ్చారు. ఎప్పుడెప్పుడు శిష్యుడు జన్మనెత్తితే అప్పుడు గురువుకూడా జన్మను తీసుకుంటాడు. సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని తెలియచెప్పారు
190997 థియోసఫి
మూడు లోకాలలో మీరు వెతికితే విష్ణువు కనిపించడు, మరి అలాంటప్పుడు బ్రహ్మ, మహేశ్వరులను ఎలా పట్టుకోగలరు? మూడు లోకాలను దాటిన మానసిక స్ధితికి వెళ్ళటేకాని సర్వవ్యాపు భగవంతుడ్ని పట్టుకోగలరు.
190997 థియోసఫి
సూర్య కిరణములు- గ్రహముల వివరణ: ఉదావసు- బృహస్పతి, విశ్వవ్యచ - శుక్రుడు, సన్నధ్ధ - సూర్యుడు, విశ్వకర్మ- బుధుడు, సుషుమ్న, సురాదన- చంద్రుడు, విశ్వవ్యచ- శని
190997 థియోసఫి
సూర్య కిరణాల నుంది వచ్చే హరీకేశ కిరణములద్వారా నక్షత్రములు ఏర్పడతాయి.అప్పక జాగ్రత్తగా విని అర్ధము చేసుకొనవలసిన " పాస్ నాట్" ను అత్యద్భుతముగా వివరించారు.
210997 థియోసాఫికల్ సొసైటీ - సీక్రేట్ డాక్త్రీన్ 1
పంచకోశముల వివరణ, ఆత్మ బుధ్ధి మనస్సుల వివరణ . సీక్రేట్ డాక్త్రీన్ కానీ ఆత్మవిద్య కానీ మనము సూర్యుడునుంచి ప్రపంచము ఎలా ఉద్భవించింది అనేది అత్యంత వివరంగా తెలుపుతుంది .
210997 థియోసాఫికల్ సొసైటీ - సీక్రేట్ డాక్త్రీన్ 2
రాత్రి పడుకునే ముందు పొద్దున లేచినప్పటినుండి, పడుకునేవరకు ఏమి చేసాము అనేది వెనక్కి వెళ్ళి రోజూ అలోచించి పడుకుంటే కొంతకాలానికి మనకి మన పూర్వజన్మలు అన్నీ గుర్తుకువస్తాయి.
అక్టోబర్
ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద గాయత్రీ మహా యజ్ఞము - వివరణ సహితముగా.
కాకివాయిలోని స్మర్తుగామీ సిధ్ధ క్షేత్ర ప్రాశస్థ్యమును వివరించారు. మీ సమస్యలను వ్రాసి అక్కడ ఉన్న ధునిలో వేస్తే తప్పక తీరుతాయి.
191097 ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞము
***ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద గాయత్రీ మహా యజ్ఞము - వివరణ సహితముగా.
061097 మహాష్టమి దీక్ష
కాకివాయిలో జరిగిన సాధనా శిబిరములో దీక్షను ఇచ్చారు. - Audio quality not good, but content is imp.
నవంబర్
నమస్తే యోగి రాజేంద్రా దత్తాత్రేయ దయానిధే స్మృతి దేహి మాం రక్షా భక్తితే దేహిమే ధృఢాం. స్మృతి దేహి అనగా ఆత్మ స్మృతిని కల్గించమని ఆ దత్తుడిని వేడుకుంటున్నాము. దానితోపాటు మార్గవిచలితులు కాకుండా రక్షించమని ప్రార్ధిస్తున్నాము. ఆర్తితో కోరిన ఏ కోరిక ఐన తప్పక నెరవేరుతుంది.
051197 దత్త ప్రదక్షిణలు 1
గురువుల్ని ఏమి కోరుకోవాలో తెలుసుకోండి. దత్త ప్రదక్షిణలు జన్మ జన్మలుగా చేసిన పాపాలను కడుగుకునేందుకు ఉపయోగపడుతుంది. సూర్యనమస్కారములు, దత్త ప్రదక్షిణలకు గల అధ్యాత్మిక వైజ్ఞానికతను వివరించారు.
051197 ద్వాదశ రాశులు
మీరు అధ్యాత్మికలో ఒక విశేష స్థాయికి చేరాలి అంటే అ-ఉ-మ అనే అక్షరాలకు వెనకాల ఉన్న జ్ఞానాన్ని పట్టుకోగలగాలి. ద్వాదశరాసి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద మహా యజ్ఞములో పెట్టే 12 ఇటుకల రహస్యలను తెలియచేసారు.
డిశంబర్
కుండలినీ జాగరణ అనేది మన శరీరంలో ఉన్న గుప్తశక్తులను వెలికితీయటం.క్రియాశీలత,కుండలిని ద్వారా మన మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది.
141297గురుసత్తా అనుగ్రహం 2
అంగన్యాస కరన్యాసాలు మనల్ని గురువుతో సంబంధం ఏర్పడేలా చేస్తాయి.
ఋషులు దర్శించిన అద్భుతమైన శక్తి వేదాలు. వేదాలులో శక్తిని దాచారు. ఏ మహనీయుడు అయినా సూర్యశక్తిని, చంద్రశక్తిని, అగ్నిశక్తిని ఉపయోగించుకోవాలి. ప్రేమ అంటే అవతలి వారికి కావల్సింది ఇవ్వటం.
141297 కుండలినీ విద్య
సూర్య,చంద్ర,అగ్నివిద్య సమ్మిళిత స్వరూపం శ్రీచక్రం. ప్రకృతిలో సూర్యవిద్య రామాయణం ద్వారా అందివ్వబడుతుంది. చంద్ర విజ్ఞానం తెలియాలంటే మహాభారతం చదవాలి. అగ్నివిద్య అంటే ధుని.గురువుల చరిత్రలలొనే అన్ని సాధనలు మనకి కనిపిస్తాయి. సావిత్రి,కుండలిని సాధనలు కలిపి చెస్తే విశేష ఫలితాలు ఉంటాయి.
మనము మన కుటుంబాలలో ప్రతి వ్యక్తికి భాద్యతలు నిర్వర్తించిన తరువాత మాత్రమే మనం మన సాధనలు చేసుకోవాలి.
మనం ఇపుడు యుగసంధి కాలంలో ఉన్నాము. శరీరానికి అమరత్వము ఉండదు. శాంత స్థితిలో ఉన్నటువంటి చేతనత్వము అద్వైత స్థితి.మన శరీరంలో సప్తాంగాలు ఉంటాయి. మనకు 5 పంచేద్రియాలు,5 కర్మేంద్రియాలు,5 పంచ ప్రాణాలు వీటితో పాటు మనస్సు, బుద్ది, అహంకారం, చిత్తము ఉంటాయి. ఇవి మొత్తము 19 ముఖాలుగా చెప్పబడుతాయి. మనకిలానే స్థూల జగత్తులో ఉన్న ప్రతి చిన్న కణముకి ఈ 19 ముఖాలు ఉన్నాయి.
వెంకయ్య స్వామి, సొరకాయ స్వామి, షిర్డి సాయిబాబా వేరే లోకాల నుండి భూలోకానికి వచ్చినవారు.
031297మన లక్ష్యము 1
స్మర్తు గామి సిద్ధ క్షేత్రం సమస్యలను నివారిస్తుంది.ఇక్కడ సమస్యలను నివారించుకోలేకపోతే ఎక్కడా ఆ సమస్యలను నివారించుకోలేము.