About the Page
సమర్థ సద్గురు శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవులు శ్రీ మద్భాగవతముపై ఇచ్చిన ప్రవచనములు
శ్రీ మద్భాగవతం
పద్మ పురాణాంతర్గతమైన భాగవతాన్ని మనం ఈ రోజునుండి తెలుసుకోబోతున్నాము. పద్మము దృష్టి ఎప్పుడూ సూర్యుడిపైనే ఉంటుంది, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటూ మీ జీవిత దృష్టి కోణాన్ని మార్చుకోవాలి. ఆ సూర్య కిరణాలవల్ల మన జీవితాలలో వచ్చే మార్పులను మనం పట్టుకోవాలి. ఈ భాగవత కధను వింటే చాలు. .దేవతలు అమృత భాండాన్ని తెచ్చి మాకు భాగవతాన్ని చెప్పండి అని సుకమహర్షులవారిని అడిగారు. దానికి క్వసుధా, క్వ కధా లోకే క్వకాచ క్వమణిర్మహాన్....అమృత భాండం ఎక్కడ- భాగవతం ఎక్కడ ? అని చెప్పారట. జగద్గురువు దత్తాత్రేయుని బీజ మంత్రము " ఓం ద్రాం, ఓం ద్రాం, ఓం,ద్రాం". ఈ మంత్రాన్ని మీరు నిరంతరం ఉచ్చారణ చెయ్యటం వలన జగద్గురువు అనుగ్రహం లభిస్తుంది. భాగవతం యొక్క మొత్తం సారం ఈ మంత్రములో ఉంది. దానము, దయ, దమము అంటే ఇంద్రియ నిగ్రహము కూడా అలవరచుకుంటే అత్యున్నత స్థాయికి మీరు చేరగలుగుతారు.
భారతీయుడు ఆధ్యాత్మికతలో పురోగతిని సాధించినంత తొందరగా మరి ఏ ఇతర దేశాలవాళ్ళు సాధించలేరు, ఆ జ్ఞానం భారతీయుల "జీన్స్" లొ మాత్రమే ఉన్నది. ముందు మనకి ఉన్న విశేషాలను మనం అర్ధం చేసుకుంటే వాటిని సవ్యంగా ఎలా అబివృధ్ధి చేసుకోవాలో తెలుస్తుంది. ఆధ్యాత్మికతలో నిష్ణాతను సాధించటానికి మీ భౌతిక జీవితం ఎలా ఉంది అనేదానికి సంబంధం లేదు, మీరు ఏ స్థితిలో ఉన్నా మీరు ఆ నిష్ణాతను సాధించవచ్చు. ఓం ద్వారా ఏ స్థితికి మీరు వెళ్తున్నారో అది గమనించుకోండి. ఆ పరమేవ్యోమన్ అనే శాంత స్ధితికి చేరాలి, ఈ స్ధితే సంపూర్ణ సృష్టికి కారణం. నవధా భక్తిని ఎలా సాధించాలి? వివరించారు. నారదుడు ఎలాగైతే ప్రహ్లాదులను, ధృవులను, వాల్మీకివంటి పరివ్రాజకులుగా అనేకమంది తయారుచేసాడో నేను కూడా అలాంటి పరివ్రాజకులను తయారుచేసేందుకు పనిచేస్తున్నాను.
భారతీయుడు ఆధ్యాత్మికతలో పురోగతిని సాధించినంత తొందరగా మరి ఏ ఇతర దేశాలవాళ్ళు సాధించలేరు, ఆ జ్ఞానం భారతీయుల "జీన్స్" లొ మాత్రమే ఉన్నది. ముందు మనకి ఉన్న విశేషాలను మనం అర్ధం చేసుకుంటే వాటిని సవ్యంగా ఎలా అబివృధ్ధి చేసుకోవాలో తెలుస్తుంది. ఓం ద్వారా ఆ పరమేవ్యోమన్ అనే శాంత స్ధితికి చేరాలి, ఈ స్ధితే సంపూర్ణ సృష్టికి కారణం. నారదుడు ఎలాగైతే ప్రహ్లాదులను, ధృవులను, వాల్మీకివంటి పరివ్రాజకులుగా అనేకమందిని తయారుచేసాడో నేను కూడా అలాంటి పరివ్రాజకులను తయారుచేసేందుకు పనిచేస్తున్నాను. "పానీయంబులు త్రాగుతున్, గుడుచుచున్,భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీ మన్నారాయణ పాద పద్మయుగళీ చింతామృతరాసాస్వాద సంధానుండై మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా" , అనే స్ధితిలో సాధకుడు ఉండాలి. నవధా భక్తిని ఎలా సాధించాలి? వివరించారు.
మహా భాగవత శబ్ధము వినిపించగానే భక్తి, జ్ఞాన వైరాగ్యాలు శక్తిని పొంది మీకు ఉన్న ఎలాంటి కష్టములైనా తొలగింపబడతాయి. నవధా భక్తి విశ్లేషణలో భక్తికి జ్ఞానం, వైరాగ్యం అను ఇద్దరు పుత్రులు ఉన్నారు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం కావాలి.భక్తికి దాసి ముక్తి, జగద్గురువు శ్రీ కృష్ణుడు భూమి మీద ఉన్నంతవరకు ముక్తి జ్ఞానవైరాగ్యములతో ద్వాపరం వరకు ఆనందంగా ఉంది. కలియుగంలో ముక్తి పాషండ రోగముతో (ఎనీమియాతో) పీడింపబడి క్షీణిస్తోంది. నారదులవారు ప్రతి ఇంట ప్రతి మానవుని హృదయంలో తిరిగి భక్తిని పున: ప్రతిష్ఠిస్తానని మాటిచ్చెను. బాహ్య ఆచరణ అంతరంగ స్మరణ రెండూ ఉంటేనే మనిషికి ఉన్నతి లభిస్తుంది. శంకరాచార్యులవారు జ్ఞాన వైరాగ్యాలను తనతోనే ఎల్లప్పుడూ ఉంచుకున్నారు. మీ అకాశ తత్వం విశుధ్ధి, అందులోకి మీరు ప్రవేశించగలిగితే మీకు కూడా నారదుడికి వినిపించినట్టు వినిపిస్తుంది. దానికి మీరు చెయ్యవలసింది మౌనంలోకి ప్రవేశించటం అలవాటు చేసుకోవాటమే.
భాగవతంలో 18,000 శ్లోకాలు 12 స్కందములుగా విభజింపబడి ఉన్నాయి. ఏ గురుచరిత్ర ఐనా భాగవత కధా శ్రవణంతో సమానమే. ఒక సంవత్సర కాలము సత్య శౌచ దయ దానములు కలిగి ఒక్క పూట భోజనం చేస్తే పిల్లలు లేనివారికి పిల్లలు పుడతారు అని భాగవతంలో చెప్పబడింది. ఎలాంటి భోజన నియమాలు పాటించనివాడు దుష్టుడు, అందువల్ల భోజనానికి సరైన నియమాలు పాటిస్తే ఇంట్లో ఉన్న దుష్టత్వం పోతుంది.
శివాభిషేకం వలన అనేక పాపాలు పోతాయి, జలమును శివలింగం మీద మనం పొయ్యటం వలన శాంతికరమైన పరిస్ధితులు ఏర్పడతాయి. మంత్రాలను పెట్టుకుని మన చేత్తో మనం శివునికి అభిషేకం చెయ్యటం వలన మనకు ఉన్న గ్రహ బాధలు, పిశాచ బాధల వంటి భయంకరమైన బాధలు కూడా పోతాయి. భాగవత పారాయణ వినటం అనగా శ్రవణం ఎంత బాగా చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. శ్రవణం బేధం వలన దుంధుకారికి మాత్రమే అత్యంత గొప్ప ముక్తి లభించింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం అనే శాంతి మంత్రార్ధాన్ని వివరించారు.
భాగవతము భవరోగములను రూపుమాపుతుంది. భాగవతము సాక్షాత్తు భగవానుని రూపము. శ్రీ కృష్ణుని పాదములనుండి ఝానువులవరకు ప్రధమ స్కంధమై ఉన్నది. గ్రహించు పాత్రనుబట్టి జలము లభించునట్ట్లు శిష్యుని పాత్రతను బట్టి జగద్గురువు అనుగ్రహము లభిస్తుంది. నారదునికి సనకాదులు, దుంధుకారికి గోకర్ణుడు, పరీక్షిత్తుకి శుకుడు భాగవతమును వినిపించెను. భాగవత శ్రవణంలో పరీక్షిత్తు ఉత్తమ శ్రోత, పరీక్షిత్తు మహారాజు యొక్క హృదయములో శ్రీహరి ఆశీనుడై ఉండటమే భాగవత ఫలం. భాగవత శ్రవణం చేసినవారి హృదయంలో శ్రీహరి ఆశీనుడవుతాడు కాబట్టి అంత శ్రధ్ధగా వినాలి.
ఆధ్యాత్మికత అంతా ఆకాశంలో నాటుకోవటం, ఆకాశంలో సేద్యం చెయ్యటం, కృషి చెయ్యటం నేర్పుతుంది. ఊర్ధ్వమూల మధ: శాఖం - చెట్టు వేళ్ళు పైన, శాఖలు కిందకి ఉన్నాయి అన్న భగవద్గీత శ్లొకం. చిత్రముగా గుపతమై ఉన్న జీన్స్ నే మనం చొత్రగుప్తుని చిట్టా అంటాం, విత్తనంలో చెట్టు ఎలా నిబిడీకృతం ఐ ఉంటుందో అలా ఆకాశంలో మనది అంటూ ఒక స్థలం ఉంటుంది. అక్కడ మన ప్రతి ఆలోచనా స్టొర్ చెయ్యబడుతుంది, అక్కడ మనం సదాలోచనలు, మనకు కావలసిన ఫలితానికి అనుగుణమైన ఆలోచనలు ఎలా నాటుకోవాలి అనే విద్యే అధ్యాత్మిక విద్య.
ప్రకృతియొక్క బాహ్య స్పర్శకు కాకుండా అంతర స్పర్శకు మనం అలవాటుపడాలి. శుకామహర్షి తల్లి గర్భంలో 16 సంవత్సరాలు బయటికి రాకుండా ఉండటానికి సింబాలిస్మ్ అది. బయటికి వస్తూనే శ్రీపాద సేవనంలో ఇమిడిపోయాడు, ప్రకృతిలో ఉంటూ దానితో బాహ్య సాంగత్యంలేకుండా జీవించగలిగాడు. పాపాచరణకు భయపడి, పుణ్యాచరణకొరకు ప్రతి క్షణం తాపత్రయపడేవాడు భాగవతుడు. సద్భక్తితోపాటు సమర్పణా భావం కూడా ఉండాలి. ప్రేమకు స్పందించలేని వస్తువు ప్రపంచములో గోచరించదు. ప్రీతి ఐనవానిని పరమాత్మకు సమర్పించాలి. దయ, దానము, దయ అను మూడూ ఆత్మారామ తత్వంలో కలిసిపోవాలి.
ప్రతిఫలం ఆశించకుండా పనిచెయ్యటం అంటే బాహ్య జగత్తులో ఏమీ అడగకుండా పనిచెయ్యటం, దానికి కారణం సర్వత్రా ఆ గురువే ఉన్నాడు అన్న జాగురూకత . ఎక్కడ గురుచరిత్ర నిరంతర పారాయణ జరుగుతున్దో అదే దత్తక్షేత్రం . భగవంతుని అవతారానికి జీవుని అవతారానికి తేడా సంచిత , ప్రారబ్ధ కర్మలు మాత్రమే, మానవులకు ఇవి ఉంటాయి, భగవంతుని అవతారానికి ఉండవు . సృష్టిలో భగవంతుని అవతరణ 24 రకాలుగా జరుగుతుంది . భాగవతములోని జగద్గురుని అవతారములు వివరించారు .
తల్లి గర్భంలో ఉన్న శిశువు 9 నెలలలో తను ఈ పరిణామక్రమములో మానవజాతి నేర్చుకున్న మొత్తము విద్యను నేర్చేసుకుంటాడు. భౌతికమైన శరీరానికే ఇంత శక్తి నిబిడీకృతం ఐతే ఆ శరీరాన్ని నిర్మించుకున్న చేతనత్వానికి చాలా శక్తి ఉంటుంది. దశావతారాలలో 9 అవతారాలు పూర్తి అయ్యాయి కాబట్టి ఈ 9 అవతారాలు మీలో చాల తొందరగా జరిగిపోవాలి. సనక సనందన సనాతన సనత్కుమారులు దత్తావతారం. వీరు నలుగురు అని కాదు, నాలుగు స్ధితులు కలిగిన చేతనత్వము అని అర్ధం. దిగంబరులు అనగా పదముతో పదార్ధములు చెయ్యగిలిగినవారు, ఈ శక్తి కలిగినవారందరూ దత్తావతారములే. దత్త ప్రదక్షిణలకు అవతారాలకు ఉన్న సంబంధాన్ని వివరించారు.
భాగవత పారాయణ చెయ్యటం అంటే జగద్గురు మానసిక స్ధితి మనలో అవతరించాలి, అది నిజమైన యజ్ఞ కర్మ. రామ నామం జరుగుచున్నచోటికి హనుమంతులవారు వస్తారు అని మన అందరికీ తెలుసు కదా, భాగవత పారాయణ జరుగుతున్నచోటుకి ఉపనిషత్తులు, వేదాలు, సప్తఋషులు, షడ్దర్శనాలు మూర్తీభవించి వస్తారు. ఎవరు వస్తారో మీకు అవగాహన ఉంటేనే కదా, లేకపోతే వచ్చినా గుర్తించలేరు. నీ యొక్క శ్వాస నీవుగా ఎలా మారుతుందో తెలిసే స్ధితి హంస స్ధితి, ఈ స్ధితిలో మీ ఇదివరకటి జన్మలగురుంచి మీకు తెలుస్తుంది. ఇదివరకటి జన్మలు తెలిస్తే మీ శ్వాస హంస స్ధితినుండి మహా హంస స్ధితికి వెళ్తుంది, ఇతర మానవుల స్ధితి కూడా అర్ధం అవుతుంది. జంతువులు, పక్షులు ఇతర జీవరాశుల శ్వాసను తెలుస్కోవటం పరమ హంస స్ధితి. నీ శ్వాస ద్వారా పూర్వ జన్మలు - హంస స్ధితి, నీ తోటివారిని గురించి తెలియటం - మహా హంస స్ధితి, ఇతర ప్రాణులను గురించి తెలియటం - పరమ హంస స్ధితి. దుష్ట శిక్షణ- తప్పు మార్గంలో వెళ్తున్న ఇంద్రియాలను దమించటం, శిష్ట రక్షణ - మంచి మార్గంలో వెళ్తున్న ఇంద్రియాలను ప్రోది చెయ్యటం, ధర్మ రక్షణ - ఈ విధముగా తయారైన ఇంద్రియాలతో దివ్య ప్రణాళికకు అనుగుణంగా జీవించటం - ఈ మూడు మనలో జరిగితే మనలో అవతార ప్రాకట్యం జరిగినట్లే. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అస్త్ర ప్రయోగాన్ని వివరించారు.
సప్తర్షి ఆశ్రమములోని సాయినాధుని దర్శన మహిమ: సప్తర్షి ఆశ్రమంలో సాయినాధుడ్ని పెట్టటానికి నేను చాలా విశేషమైన శ్రమ చేసాను. శ్రీ శ్రీ రామ కృష్ణ సమర్ధ సద్గురుదేవులు స్థాపించిన సప్తర్షి ఆశ్రమములోని సాయినాధుని దర్శన విధి విధానమును వివరించారు. భాగవత ప్రవచనంలో భాగంగా ఒక శిష్యుడికి ఉండాల్సిన మానసిక స్ధితిని వివరించారు. షిరిడీ సాయినాధునుకి ఆరతి ఇచ్చాక దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము చదవండి. సాయి షట్చక్రాలు ఆ అక్షరాలతో ఓపెన్ అయి ఉన్నాయి, మీరు ఆయన ఎదురుగా నిల్చొని చదివినప్పుడు మీ చక్రాలు కూడా ఓపెన్ అవుతాయి. షిరిడీ సాయినాధును మందిరములో నేను 4 కాల భైరవులను పెట్టాను. కాలాన్ని ఉపయోగించుకునే శక్తి మీకు ఇక్కడినుండి వస్తుంది. గురువు కాలాన్ని ఉపయోగించుకుంటే సృష్టి మొత్తం మారుతుంది. కాలాన్ని నాలుగు స్ధితులలో ఉపయోగించుకోవచ్చు. ఈ నాలుగు కుక్కల యొక్క సంకేతం అది, పైన పెట్టిన అశ్వమేధం గుర్రం - మనస్సుని ఉపయోగించుకోవటం, దానిపైన ఆవు 100 శాతం పవిత్రత. ఆ పవిత్రత అటు దత్తాత్రేయ చేతనత్వం మీకు రావాలన్నా కృష్ణ చేతనత్వం రావాలన్నా ఆవులు కావాలి, మీ మనస్సులో పవిత్రత తగ్గిపోవటం వలన ఆవులు అంతరించిపోతున్నాయి. మీ మనస్సులు పవిత్రంగా ఉంచుకుంటే ఆవులు క్షేమంగా ఉంటాయి. మీ అహంకారాన్ని మర్చిపోతేనే - మరిచెన్ సురారిసుతుడే తద్విస్వమున్ భూవరా అనే స్ధితికి మీరు వస్తారు. ఇంత అద్భుతమైన చేతనత్వం మీకు రావటానికి చెయ్యవలసినది కేవలం ఈ సాయినాధుని వద్ద ఆశ్రమంలో మౌనంగా ఉండటమే. నేను ఎంతో శ్రమతో ఏర్పరచిన ఈ శక్తులను మీరు ఉపయోగించుకోండి.
సర్క్యూట్ డయాగ్రాం లో చూసి మీరు టీ వి బాగుచెయ్యగలరు. అలానే మీ జాతకచక్రం చూసి మీ లో ఉన్న లోపాలను సెట్ చెయ్యవచ్చు, అది తెలియనప్పుడు నిత్యం సంధ్యావందనం చేసుకున్నా మీకు మీ జీవితం సాఫీగా జరిగిపోతుంది. భాగవతం అందరికీ అర్ధం కాదు, భౌతిక జగత్తులో పానియంబులు తాగుచున్ అను మానసిక స్ధితిలో ఉంటేనే మీకు అర్ధం అవుతుంది.
కుంతీ దేవి శ్రీ కృష్ణుడిని కష్టాలు ఇవ్వు అని అడిగింది, ఎలాంటి కష్టాలు ? ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చెయ్యగలిగిన పరిస్ధితులను అడిగింది, అందులో ఉన్న మర్మాన్ని అర్ధం చేసుకోండి. మనం నిత్యం చేసుకునే పన్ల మధ్యలో మనం నామము ద్వారా రూపమును, రూపము ద్వారా రూపరహిత కృష్ణ చైతన్యమును పట్టుకోవాలి. కుంతీ దేవి శ్రీ కృష్ణుడిని కష్టాలు ఇవ్వు అని అడిగింది, ఎలాంటి కష్టాలు ? ఎల్లప్పుడూ భగవంతుని ధ్యానం చెయ్యగలిగిన పరిస్ధితులను అడిగింది, అందులో ఉన్న మర్మాన్ని అర్ధం చేసుకోండి. మనం నిత్యం చేసుకునే పన్ల మధ్యలో మనం నామము ద్వారా రూపమును, రూపము ద్వారా రూపరహిత కృష్ణ చైతన్యమును పట్టుకోవాలి. కురు వంశం నాశనము అంటె మొత్తం ఆ జీన్స్ ని నాశనం చెయ్యటానికి ప్రయత్నం చేసారు, దానిని కాపాడటానికి ధర్మ రాజు, భీష్ముడు చాలా ప్రయత్నం చేసారు. పితృదేవతలతో మాట్లాడగలిగిన శక్తి అందరికీ ఉండేది, శ్రాధ్ధం పెట్టినప్పుడు మాట్లాడేవారు. అలా ముందే ఆ వంశాన్ని రక్షించుకునే ప్రయత్నం ధర్మరాజు చేసాడు. మీలో ఉన్న భీష్ముడు, ధర్మ రాజు, శ్రీ కృష్ణుడు ఎవరు ? ద్వారకకు వెళ్తున్న శ్రీ కృష్ణుడు హస్తినకు ఎలా వచ్చాడు, ఇది మీ శరీరంలో ఎక్కడ జరుగుతోంది ?
భాగవతం ప్రకృతిలో 12 రాశుల కధలుగా ప్రతిరోజూ జరుగుతుంది, అందువలన భాగవతన్ని ప్రతి ఒక్కరూ పారాయణ చెయ్యాలి. భాగవత కధలు తెలియనివాళ్ళు ఎవ్వరూ ఉండరు, కానీ దీనిని పారాయణ చెయ్యటం వలన జగద్గురు శ్రీ కృష్ణుడు ఆయన ఆచరించి జీవించిన జీవిత విధానాన్ని సంపొర్ర్ణముగా అర్ధము చేసుకుని మనం కూడా ఆ చేతనత్వన్ని పట్టుకుకోగలుగుతాము. కాలాన్ని ఎవరైతే ప్రతి క్షణం జాగ్రత్తగా వాడుకుంటారో వాళ్ళు వాళ్ళ క్షేత్రంలో అత్యున్నత స్థానానికి చేరి తీరుతారు. భీష్ముడు పెళ్ళి చేసుకోనని ప్రతిజ్ఞ చేసాడు, కృష్ణుడు ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసాడు. కానీ కృష్ణుడికి అహంకారం లేదు, అవ్యాజమైన ప్రేమ ఉన్నది, తన శిష్యుడిని గెలిపించటానికి కృష్ణుడు ఆయుధం పట్టాడు, సాక్షాత్తు తల్లి సత్యవతి వచ్చి భీష్ముడిని బ్రతిమలాడినా వంశం నాశనం అవుతుంది, పెళ్ళి చేసుకోకపోతే అని చెప్పినా తన ప్రతిజ్ఞ మానుకోలేదు. మీరు నేర్చుకోవలసింది ఏమిటి ? అందరికీ ఉపయోగపడే పని చెయ్యటం ముఖ్యం, మీ ప్రతిజ్ఞలు కాదు. ఇలా ప్రతి కధ నుండి నేర్చుకోవలసిన జీవిత సత్యాలు మీకు భాగవతంలో ఉన్నాయి.
తీర్ధ యాత్రలు అంటే గురుస్థానాలు, వీటి వద్దకు మీరు ఎంత ఎక్కువ వెళ్తే అంత మంచిది, కానీ అక్కడికి వెళ్ళి తిని, తాగే తప్పు చేస్తే చాలా నష్టపోతారు. అక్కడ మీరు కనీసం 3 రోజులు నిద్ర చేసి, పానీయంబుల్ తాగుతున్ ...సంత శ్రీమన్నారయణ పాదయుగళీ స్వాదసంధానులుగా మీరు ఆ 3 రోజులు జీవించగలిగినీ మీ జీవితాలు ధన్యం ఐపోతాయి. తీర్ధ యాత్రలకు వెళ్ళి ఇడ్లీ, సంంబార్ దొరుకుతుందో లేదో చూస్కునే ఇంద్రియలోలత్వం నుండి బయటపడి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెలకి 3 రోజులన్నా కనీసం మీరు ఇలా జీవించగలిగితే మీ జీవితాలు అత్యద్భుతంగా మారతాయి.
ప్రకృతి ఏదన్నా విశేషమైన శక్తి మానవజాతికి అందిస్తే అది మొత్తం ప్రకృతిలోని సమస్తమైన వాటికి బ్రహ్మ నుండి కీటకములవరకు ఉపయోగపడాలి. ఆ విధమైన దృష్టికోణము తేవటానికి కావలసినటువంటి మంత్రము " ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే ద్వాదశాక్షరీ మంత్రము. ఇది ఒక వ్యక్తి తన ముక్తి కోసం మాత్రమే చేస్కొనే మంత్రము కాదు.భాగవతము అంటే సద్గురువుల చరిత్ర. వాసుదేవం సర్వమితి సమ్హాత్మా సుదుర్లభా: - వాసుదేవుడు తప్ప నాకు ఇంక ఏమీ వద్దు అన్నవాడికి ఈ విద్య బోధపడుతుంది. పూతన వధ కధా రహస్యాన్ని, కృష్ణుని జీవితములోని ఎన్నో సంఘఠనలను మనం గురుపరంపరతో కలిపి ఎలా అధ్యయనం చెయ్యాలో వివరించారు. భాగవత జీవిత విధనాన్ని 12 పాయింట్స్ గా రాస్కోండి, అది మీ జీవిత విధానం అవుతుంది.
భారతీయ అధ్యాత్మికత ప్రతి క్షణం జీవితం అనే యుధ్ధరంగంలో పోరాడే వారికి కావలసిన విద్య, ఆదిత్య హృదయం , భగవద్గీత ఇవి యుధ్ధరంగంలో నేర్పబడిన విద్యలు. హనుమంతుడు, మేషరాశి మనస్సుకి ప్రతీక. భాగవతం మొదటి స్కందము కూడా మనస్సుకి ప్రతీకే. తక్షణమే పని చెయ్యటం అనేది మేషరాశి లక్షణం. ప్రాణము, అపానం కలిసిన ఒక భాగము ( నకుల -సహదేవులు) వ్యానము, ఉదానము, సమానము, (ధర్మరాజు, అర్జునుడు, భీముడు) ఒక వేపు, మహా భారతం మొత్తము దీనిమీదే ఆధారపడి నడిచింది. ఆ విద్య వృషభరాశిలో చెప్పబడింది కనుక అందులో చంద్రుడు చాల ఉఛ్చ స్ధితిలో ఉంటాడు కనుక జగద్గురువు శ్రీ కృష్ణుడు ఆ రాశిలో పుడతాడు. మహా భారతం చంద్రవంశీయుల చరిత్ర. శ్వాసను ఉపయోగించుకునేవారికి ఎలాంటి విఘ్నాలు ఉండవు. సులభంగా శ్వాసను మార్చుకునే విద్య స్వర విజ్ఞానం. ఏనుగు లక్షణం అది. సమయం, మనస్సు, ఇంద్రియాలు, శ్వాస మీద అదుపుతెచ్చుకున్నవారికే శుకమహర్షి చెప్పిన భాగవతం అర్ధం అవుతుంది. ఇవన్నీ రాకపోయినా అందరూ బాగుండాలి అని" స్వస్తి ప్రజాభ్య " శ్లోకాన్ని మన: స్పూర్తిగా భావయుక్తంగా భగవంతుడిని అర్ధిస్తే మీరు ఈ అన్ని స్ధితులు అతి తేలికగా సాధించగలరు.
నారద గాయత్రీ దీక్ష : గత 19 రోజులుగా సమర్ధ సద్గురు శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవులు అందించిన భాగవతామృతాన్ని స్వీకరించామలిసి మాస్టారు అందించిన " అత్యంత దుర్లభమైన నారద గాయత్రీ దీక్ష" ను స్వీకరించి నారదమహర్షుల అనుగ్రహ ఆశీస్సులను, గురుసత్తా అనుగ్రహ ఆశీస్సులను అందుకొని నిజమైన "భాగవతులుగా" మన చేతనత్వాలను ఆ కృష్ణ చేతనత్వంతో నింపుకొందాం.ॐ भूर्भुवः स्वःतत्सवितुर्वरेण्यंभर्गो देवस्य धीमहिधियो यो नः प्रचोदयात् ॥ Om Bhuur-Bhuvah SvahTat-Savitur-VareNyamBhargo Devasya DheemahiDhiyo Yo Nah Pracodayaat || 1: Om, Pervading the Bhu Loka (Earth, Consciousness of the Physical Plane), Bhuvar Loka (Antariksha, The Intermediate Space, Consciousness of Prana) and Swar Loka (Sky, Heaven, Consciousness of the Divine Mind),2: That Savitur (Savitri, Divine Essence of the Sun) which is the most Adorable,3: I Meditate on that Divine Effulgence,4: May that Awaken our Intelligence (Spiritual Consciousness)
Naradamargadarsanam : సమన్వయ భాగవతములో నారద మార్గదర్శనము : మొత్తము సృష్టి యొక్క రహస్యము మనం జీవించి ఉండటానికి కారణం మీ చేతనత్వం అబివృధ్ధి చెందటం. జగత్తు అనేది గతి కలిగినది, మీరు ప్రకృతితో కలిసి జీవించగలిగితే మీకు స్ధిరత్వం అనిపిస్తుంది. మీరు చేసే వ్రతాలు, పూజలు సాధనలు మీ చేతన్వాన్ని అస్సలు టచ్ చెయ్యట్లేదు, మీ భౌతిక తలాన్నే పూర్తిగా టచ్ చెయ్యట్లేదు. అది అర్ధం అయితే ఫలితాలు ఎందుకు రావట్లేదో తెలుస్తుంది. చేతనత్వంలో మార్పు రావటానికి చెయ్యవలసిన ఈ భాగవతం లోని శ్లోకాన్ని అర్ధం చేసుకోండి. 1. కృష్ణ నారాయణం వందే కృష్ణం వందే వ్రజ ప్రియం కృష్ణ ద్వైపాయనం వందే కృష్ణం వందే పృధాసుతం. నాలుగు రకాలైన చేతనత్వాలను తెలుపుతోంది ఈ శ్లోకం.
Naradamargadarsanam : భాగవతంలోని భక్తిని యువతితో పోలుస్తారు, నారదుడు యువతిగా ఉన్న భక్తిని కలిసాడట. మీ భక్తి దేనిమీదున్నదో అది లభించకపోతే ఈ జీవితం వృధా అనే మానసిక స్ధితి ఉండాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే అలాంటి మనస్సే ఏర్పడుతుంది.కనుక భాగవతంలో చెప్పినట్లుగా భక్తి మీలో యువతిగా ఉండాలంటే మీ ఆహారంలో కచ్చితంగా మార్పు వచ్చి తీరాల్సిందే. ఆహారం మారితే చేతనత్వం మారుతుంది, శరీరంలోని నాడులు మారతాయి. రక్త ప్రసరణ మారుతుంది. దానితో ప్రాణ శక్తి ప్రాభవితమవుతుంది. అప్పుడు మీ చేతనత్వములో మార్పు సంభవిస్తుంది. ఇవన్నీ సరిగ్గా ఉంటే కేవలం ఒక చిన్న మాట చాలు. ఉదా: నారదుడు చెప్పిన ఒక చిన్న మాట ధృవుడిని ధృవతారగా నిలిపింది, ఈనాటికీ దిశా నిర్దేశం చేస్తూ ఆకాశంలో శొభాయమానంగా వెలుగుతున్నాడు.
మన రోగాలను డాక్టర్లు నయం చెయ్యలేకపోతే అప్పుడు మనం సాయి దగ్గరకు వెళ్తాం. ఉద్యోగం పోయినా, ఉద్యోగం కావాలన్నా, మంత్రి పదవి రావాలన్నా, పిల్లలకి మంచి కాలేజ్ లో సీట్ రావాలన్నా ఎవరి దగ్గరకి వెళ్తాం ? గురువు దగ్గరకి, అప్పుడు మనకు గురువులు కావలసి వస్తారు. అందరికీ అన్నీ చెయ్యగల ఆ గురుచేతనత్వం గురుంచి మనం కూడా నేర్చుకుందాం అన్న ఆలోచన లేకుండా అస్సలు ఆ చేతనత్వానికి సంబంధించిన విద్యే మాకు అవసరం లేదు అనే విద్యా వ్యవస్థ వల్ల, నీచమైన మానసిక స్ధితికి భారతీయులు జారటం వల్ల మనం ఈనాడూ ఇలా ఉన్నాం. ఆలోచనలు భ్రష్టు పట్టి ఉన్నాయి. ఇహ ఘోరే కలౌ ప్రాయో జీవశ్చాతురతాం గత: క్లేశా క్రాంతశ్చ తశ్చైవ శొధనే కిం పరాయణం. చేతనత్వ విజ్ఞానము మీ నిత్య విద్యా విధానంలో భాగం ఐతేనే భారతదేశం తిరిగి జగద్గురు పీఠం అధిరోహిస్తుంది.
ఋషులు ఏది సత్యమో దానికోసం జీవిస్తూ, సత్యవంతులుగా వాళ్ళు ఇదే సమాజంలో జీవిస్తారు. అందరూ ఏది అనుకుంటారో అది చెయ్యరు వాళ్ళు, ఏది సరైనదో అదే చేస్తారు. నిర్వీర్యమైన వ్యక్తులు భాగవతానికి పనికిరారు, సాహసం కావాలి. మీలో ఉన్న చెడు అలవాట్లను, అసత్యపు జీవితాలన్ని తెలిసి కూడా మార్చుకోలేకపోతే అదే ఆసురీ ప్రవృత్తి. చింతామణిర్లోకసుఖం సురదృ స్వర్గసంపదాం II ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం II8II చింతామణి లౌకిక సుఖాలను ఇస్తుంది, కల్పవృక్షము స్వర్గీయ సుఖాలను ఇస్తుంది, కానె గురుదేవులు ప్రసన్నులవుతే యోగులకు కూడా దుర్లభమైన నిత్యమైన వైకుంఠ ధామం ఇస్తారు.
ప్రీతి: శౌనక చిత్తే తే హ్యతో వాచ్మి విచార్య చ సర్వ సిధ్ధాంతనిష్పన్నం సంసారభయ నాశనం హే శౌనకా ! నీ హృదయంలో భగవత్ ప్రేమ ఉన్నది, అందువల్ల నేను బాగా ఆలోచించి, సంసార భయనాశకము, సర్వ సిధ్ధాంత నిష్పన్నం, నిష్కర్షము, లేక సమస్త సిధ్ధాంత సారము ఆయిన దానిని నేకు చెప్తాను. - అంటే ప్రపంచములో మీకు ఏ విధమైన భయం ఉన్నా ఆ భయం పోవడానికి నేను మార్గం చెప్తాను అని సూత మహర్షి చెప్తున్నారు. భాగవతం వినటం మొదలుపెట్టగానే మీలో ఆ కృష్ణ చేతనత్వం వృధ్ధి చెందుతుంది. సావధానంగా - అంటే జాగ్రత్తగా వింటే మీలో ఉన్న కృష్ణ చేతనత్వం సంతోషించి, వృధ్ధి చెందుతుంది. మీరు భగవత్స్వరూపులే !!!
సప్తర్షి ఆశ్రమంలో ఉన్న దేవతామూర్తులు రాతి విగ్రహాలు కాదు, వాళ్ళంతట వాళ్ళు నడిచివచ్చిన దేవతా శక్తులు, నేను ఇక్కడ చాలా శక్తిని పెట్టాను, ఇవి పూర్తి చైతన్యంతో ఉన్న మూర్తులు. భాగవతం అర్ధం కావాలి అంటే మీరు ముందు మౌన స్ధితిలో, ఆజ్ఞాచక్రంలో ఉండండి. మీరు మౌనములో ఉంటూ, ఆజ్ఞాచక్రములో ఉండటం నేర్చుకోవటంతోపాటు నాటూ కోసుకో అనే సిధ్ధాంతాన్ని అర్ధం చేసుకుని ఆచరించాలి. గురువు, శిష్యుడు, ఆధ్యాత్మిక విద్యపై ఉండాల్సిన శ్రధ్ధను, ఏ ఆశ్రమ వ్యవస్థలో అయినా పాటించాల్సిన నియమాలను, మానసిక స్ధితిని, ఒక గురువుగా శ్రీ శ్రీ రామ కృష్ణ గురుదేవులు శిష్యుల ఎదుగుదలను కోరుతూ పడుతున్న బాధను ఈ ప్రవచనంలో వినవచ్చు. భారతీయులమైన మనమే ఆధ్యాత్మిక విద్యకు ప్రాముఖ్యతను ఇచ్చి నేర్చుకోకపోతే మనలను ఏ గురువులు కాపాడలేరు.
మనలో ఉన్న దేవతలు - పృధ్వీ తత్వము - వాసనలు, జలతత్వము - రుచి, అగ్ని తత్వము - రూపము, వాయు తత్వము - స్పర్శ, ఆకాశ తత్వము - శబ్ధము గా మనలో ఉన్న ఆ దేవతా శక్తులు ఈ భాగవతాన్ని వినాలని కోరుకుంటాయి, వింటాయి కూడా. కానీ మీరు శ్రధ్ధగా వినట్లేదు, సామూహికంగా వినటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అందుకే సామూహిక పారాయణలకు అంత ప్రాముఖ్యతనిస్తాం.మీకు తెలిసినా తెలియకపోయినా మీరు భాగవతాన్ని విన్నప్పుడు ఆ చేతనత్వము ఈ దేవతా శక్తులు ద్వారా మీలో వృధ్ధి చెందుతూ ఉంటుంది. ఈ భాగవతము అనే మణిని మీరు తీస్కోగలిగితే మీరు ఈ సంపూర్ణ సృష్టికి మూలం అవ్వచ్చు.
Asuree Sampathi
మనస్సు అంటే అనిశ్చియాత్మక స్ధితి అదే అర్జున స్ధితి, నిర్ణయించుకోలేని స్ధితి. కానీ ఇది చేస్తే మంచి లాభాలు ఉన్నయి అని, అది చేస్తే ఇంకా లభాలు ఉన్నాయి అని తెలిసి ఏది చెయ్యాలో తేల్చుకోలేని స్ధితి. నిద్రపోయే స్ధితి మాత్రం కాదు. వ్యాస స్ధితి నిర్ణయించుకోగలిగిన స్ధితి. ఏది ఎక్కువ మంచిదో తెలుసుకుని అది చెయ్యగలిగే స్ధితి, నిర్ణయాత్మక శక్తి కలిగిన స్ధితి "బుధ్ధి". నిర్ణయించుకున్నాక ఆచరణలో పెట్టగలిగే స్ధితి " వ్రజప్రియం" - కృష్ణుడి యొక్క స్ధితి, గోపాలుని యొక్క స్ధితి, అంటే ఏమిటి? ఇంద్రియాలు కూడా నీ అధీనంలో ఉన్నాయి.
భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే తప్ప భాగవతాన్ని చెప్పలేం అని గురువులు చాలా ప్రయత్నం చేసి, సమయానికి ముందే స్వాతంత్య్రాన్ని తీస్కొనివచ్చారు. సత్యము - రచయితలు, శౌచము - శాస్త్రవేత్త, దానము - వ్యాపారవేత్త, దయ- రాజకీయవేత్తలలో ఉండవలసిన లక్షణాలు. నారదులవారు భూమి మీద తిరిగినప్పుడు తపస్సు, సత్యం, దానము, దయ, శౌచము వంటి లక్షణాలు ఎక్కడా కనిపించలేదు. పరమ పూజ్య గురుదేవులు పిల్లలు లేనివాళ్ళకి, లేదు ఏ సమస్య ఉన్నా వారిని ప్రతి రోజూ వీలైనంత ఎక్కువ గాయత్రీ చాలీసా పారాయణ మరియు సామూహిక కార్యక్రమాలలో పాల్గొనమని చెప్పేవారట.
భాగవతం అమరత్వాన్ని ప్రసాదించే విద్య. మీరు ఎవ్వరూ దయచేసి గురువు యొక్క గొప్పతనాన్ని అంచనా వేసే ప్రయత్నం చెయ్యకండి. ఏకలవ్యుడిలా శిష్యుడు విద్య నేర్చుకునేందుకు సంసిధ్ధతతో ఉండి, శిష్యుడు గొప్పవాడిగా ఉండాలి. సర్వ వ్యాపి ఐన గురువుని ప్రశ్నిస్తే ఆయన మన సమస్యకు ఎలాగో అలా సమాధానం ఇస్తాడు. గురువుని ప్రశ్నించాలి, అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నించకపోతే గీత లేదు. పరీక్షిత్తు, దుంధుకారి, నారదుడు లేకపోతే భాగవతం లేదు. నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ సమస్యను ఎలా దాటాలి అనే ప్రశ్న శిష్యుడు దానికి సమాధానం దొరికేవరకు గురువుని ప్రశ్నించాల్సిందే.
రధం స్థాపయమేచ్యుత : అచ్యుత స్ధితిలో ఉంటే మీ రధాన్ని సరైన స్ధితిలో పెడతాడు. మనకున్న రధం మన శరీరమే."ఆత్మానం రధితం విధ్ధి" అని ఉపనిషత్తులో చెప్తాడు. ఈ శరీరమనే రధమును నడిపించేవాడు ఆత్మ. ఆ రధాన్ని నడిపించేవాడు ఆత్మ కనుక కృష్ణుడు అర్జునుడికి సారథి అయ్యాడు. ఇప్పుడు మన రధాన్ని నడిపిస్తున్నది కృష్ణుడు కాదు, మన కోరికలు.
Samanvaya Bhagavatham
కోరికలు యవ్వనంలో ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టటానికి కావల్సిన, జ్ఞానం వైరాగ్యం లేవు. అందుకే మీకు అందరికీ బి.పి. షుగర్, క్యాన్సర్ అనే రోగాలు పట్టుకున్నాయి. దేవర్షి నారదుడు దేవర్షి స్థాయిలో ఉండి అటు దేవతలకి, ఇటు రాక్షసులకి మధ్య తిరుగుతూ వాళ్ళని మార్చటానికి కావలసిన పన్లు చేసారు. చదువు మీద వైరాగ్యం ఉంది, కానీ డిగ్రీ ఇచ్చే లాభాల మీద కోరిక ఉంది. పిల్లల్ని మీరు పిరికిపందలలాగా చేసి చంపుతున్నారు, వాళ్ళ ఆలోచనా విధానాన్ని పాడుచేస్తున్నారు. మీ పిల్లల్కి ఇంజనీరింగ్ లో సీటు రాకపోతే మీకు బి.పి. పెరుగుతోంది. ఏ కోరిక కోరకూడదో, ఏ కోరిక కంట్రోల్ లో ఉండాలో అది కంట్రోల్ లో లేకపోయేసరికి ఆ కోరకకి సంబంధించిన శరీరంలోని కణాలు మల్టిప్లై అవుతూ ఉంటాయి. అవి ట్యూమర్ గా ఫాం అవుతాయి. అవి మల్టిప్లై అయి మాలిగ్నెన్సీ గా మారతాయి. బి.పి లు షుగర్ లు ఇవన్నీ స్ట్రెస్ తో కూడిన రోగాలు ఇంత అధికంగా ఇప్పుడు ఉండటానికి కారణం మీ భ్రష్టు పట్టిన ఆలోచనలే. ఆనందంగా జీవించటానికి కావలసిన ఆలోచనా విధానం భాగవత పారాయణ ద్వారా వస్తుంది.
గురువుల సమాధులను "బృందావనం" అంటాం, బృందము అంటే సమూహము. కోరికలు తీరాలి అంటే బృందావనంలో తీరుతాయి. సమాజము ఒక బృందావనంగా మారాలి, కుటుంబాలు కలిసి జీవించాలి. ఆ మార్పు రావాలని కోరుకోవాలి. ఆధునిక బాషలో కంప్యూటర్ అంతా అనుష్టుప్ ఛంధస్సే, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారో మనం చెప్పలేం కానీ, అనుష్టుప్ ఛందస్సు మొట్టమొదట కనిపెట్టినది " వాల్మీకి" ఋషి. పర్వతాసనం మీరు రోజూ వేస్కొంటే ఎలాంటి పరిస్ధితులనైనా అధిగమించే శక్తి వస్తుంది.
కలియుగం అంటే గురు పదాలనుండి "చ్యుతి" చెందిన స్ధితి. క్ష్మాం త్వక్త్యా స్వపదం గత: - ఈ భగవంతుడు పృధ్విని వదిలేసి తన పథములోకి వెళ్ళినప్పుడు తద్దినా కలిరాయత: - ఆ రోజునుండి కలి ప్రవేశించింది. సర్వ సాధన బాధక: - అన్ని సాధనలకు అది అడ్డుడుతుంది. ఎప్పుడైతే మీ కనెక్షన్ పిట్యూటరీ గ్లాండ్ తో అనగా అజ్ఞాచక్రంతో పోయిందో ఏది చూస్తున్నా కూడా ఈ శరీరం ఆ భగవంతుని వైబ్రేషన్స్ తో ఉండదు. నదులు - శరీరంలోని రక్తప్రసరణ : సరయూ నది మీ మస్థిష్కాన్ని సరిగ్గా రెండుభాగాలుగా విభజిస్తుంది. గంగా నది మీ వెన్నుపూసలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇడా, పింగళా, సుషుమ్నలు - కృష్ణా, కావేరీ, సర్వస్వతీ నదులు. భారతదేశంలో ఉన్న ఏడు నదులు మన శరీరంలో ఉన్న ఏడు అద్భుతమైన ప్రజ్ఞలకి సంకేతాలుగా పనిచేస్తున్నాయి. వైకుంఠము అంటే పరిపూర్ణమైన మనో నిగ్రహము కలిగిన మస్థిష్కము.