భగవద్గీత
"The Bhagavad Gita in the light of Yoga - Arjuna Vishadayogam - భగవద్గీతను యోగ విద్య పరంగా మనం అర్థం చేస్కొనే ప్రయత్నం చేస్తున్నాము. గీతలోని 18 అధ్యాయాలను మనం అర్థం చేస్కొని, 18 రకాల యొగములను గూర్చి నేర్చుకుని చివరికి మోక్ష సన్యాస యోగమును నేర్చుకుంటాము. మానవ శరీరము మనకు లభించటమే గురువు యొక్క వరదానం. లక్షల సంవత్సరాలుగా మనం ఆ గురువు యొక్క అనుగ్రహంలోనే ఉన్నాము. పాండవులకు కోరికలు లేవు, అడవిలో ఉండమంటే అడవిలో ఉన్నారు, విరాట్ పర్వంలో వాళ్ళు చేసిన పన్లు చూస్తే ఇవి రాజులు చేసే పన్లేనా అనిపిస్తుంది, వాళ్ళను ప్రకృతి ఎక్కడ ఉంచితే అక్కడ ఉన్నారు. మన హృదయంలో ఉన్న గురువు ఏది నిర్దేశిస్తే అది మనం ఆచరించటమే.
The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - యోగము అనేది సాధన చేసేది కాదు, ఆ విశ్వరూపాన్ని నీ ప్రయత్నాలవల్ల చూడలేవు. మీ సాధనలతో ఆ భగవంతుని పొందుతాము అని అనుకుంటే వెంట్రుకని కట్టి కొండను లాగినట్లే. "దివ్యం దాదమి తేచక్షు:" నీకు కావలసినటువంటి ఆ దివ్యమైన చక్షువు నేను ఇస్తాను. ఆయన ఇవ్వకపోతే మీరు చూడలేరు. ఇవ్వవలసింది ఆయన, చెయ్యవలసింది ఆయన, ఉపనిషత్తులలో కూడా ఆ మాట చాలా స్పష్టంగా చెప్పబడింది. "ఆయన వరించాలి, మనం కాదు."
The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - భగవద్గీత యొక్క చాలా అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే, ఈ పృధ్విమీద ఉన్నటువంటి ప్రతి జీవికి ఈ సాధకుడియొక్క ఫలితం లభిస్తుంది. గీత యొక్క అధ్యాత్మిక శక్తి సంపన్నత ఎంత గొప్పది అంటే, అధ్యాయంలోని నాల్గవ భాగాన్ని ఆచరించినా, ఈ మన్వంతర కాలమంతా మీరు మానవ జన్మని పొందుతూ, ఋషుల స్థాయిలోనే జీవిస్తారు. గీతలోని 18 అధ్యాయాలలోని 10 శ్లోకాలు చాలు మిమ్మల్ని ఆ స్థితికి తీస్కొని వెళ్ళటానికి.
The Bhagavad Gita in the light of Yoga- Arjuna Vishadayogam - బాహ్య పరిస్థితులకు రియాక్ట్ కాకుండా ఉండగలిగే మానసిక స్థితి జీవన్ముక్త స్థితి. ఆ స్థితిలో సర్వరోగాలు నివారింపబడతాయి. సర్వ బాధలు. సకల సమస్యలు నివారింపబడతాయి. మన విషాదానికి కారణం ఏమిటి అంటె మనలో ఉన్నటువంటి "మార్గదర్శకుడు", మనలో ఉన్నటువంటి "గురువు", మనలో ఉన్నటువంటి "స్నేహితుడు", మనలో ఉన్నటువంటి "బంధువుని" వదిలేసి మనం ఎక్కడెక్కడో తిరుగుతాం. అదే విషాదానికి కారణం. మన సూక్ష్మ శరీరంలోని 5 చక్రాలు వేరు వేరు మార్గాలలోకి వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని ఆజ్ఞాచక్రంలోని గురువు ఆజ్ఞలకి అనుగుణంగా నడిపించగలగాలి, ఏది తప్పో, ఏది సరైన మార్గమో మనకి ఈ మొదటి దీక్షలో అర్జున విషాదయోగంలో నేర్పబడింది.
The Bhagavad Gita in the light of Yoga- SankhyaYoga - న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12 ।। నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః । ఉభయోరపి దృష్టోఽన్తః త్వనయోస్తత్త్వదర్శిభిః ।। 16 ।। అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ । తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి ।। 38 ।। సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన । బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।। ఈ 41 వ శ్లోకం సాధకులకు ఒక కమాండ్ లాంటిది. ఇంద్రియాతీతమైన స్థితి, పంచేంద్రియాలద్వారా వచ్చేవాటిని దేనినీ నేను పట్టించుకోను అనే నిశ్చయాత్మక బుధ్ధిలో సాధకుడు నిలబడాలి.
Bhagavat Gita- Sankhya Yogam - ఎంత విపరీతమైన, బరువైనటువంటి బాధ్యత నెత్తిమీద ఉంటుందో, అంత ఎక్కువగా మనం గుణాతీత స్థితికి వెళ్తామేమో ! దేవతలకు కావలసిన ఆహారం ఇవ్వకపోతే ఆ దేవతలు ప్రోదిచెందరు, ప్రోదిచెందని దేవతలు శక్తిహీనులైపోయి మీకు ఉపయోగపడరు. ఒక విగ్రహంలోంచి దేవత నడిచి మీ వద్దకు వచ్చింది అంటే మీరు ఏం చేశారు? మీ యొక్క ప్రాణ శక్తిని, మీ యొక్క భక్తిని, మీ యొక్క భావాన్ని ఆ దేవతకు మీరు అర్పించారు. ఆ దేవత రూపుదాల్చింది. దేవత ఆ విగ్రహంలో లేదు, దేవత సాధకుడి భావాలలో ఉంది.
Bhagavat Gita- Sankhya Yogam - వాక్కు నాలుగు స్థితులలో ఉంటుంది, అది పరా, పశ్యంతి, మధ్యమ & వైఖరి. పరా స్థితి నుండి వైఖరి స్థితి వైఖరి నుండి పరా మొత్తం 8 స్థితులు అవుతాయి. ఏ శ్లోకం ఐనా అనుష్టుప్ ఛందస్సులో ఉంటే మొదటి 8 అక్షరాలు వైఖరీ జగత్తు, భౌతిక జగత్తుగురుంచి మాత్రమే చెప్తాయి. తరువాత 8 అక్షరాలు మధ్యమా జగత్తుగురుంచి చెప్తాయి, ఇంకాస్త సూక్ష్మమవుతాయి. తరువాత 8 పశ్యంతి, ఆ తరువాత 8 పరాస్థితి గురుంచి, రిజల్ట్ గురుంచి చెప్తాయి. మొదటి 3 మీరు చెయ్యగలిగితే ఆటోమాటిక్ గా మీరు పరాస్థితికి వెళ్ళిపోతారు, ఆఫలితం వస్తుంది. భగవద్గీత యొక్క ప్రతి శ్లోకము మంత్రమే, ఏ సహస్రనమాలైన కూడా ఇదే వర్తిస్తుంది.
Bhagavat Gita- Sankhya Yogam - యుక్తాహార విహారశ్య - యుక్తమైనటువంటి ఆహారం తినాలి. అంతే తప్ప ఏది తినచ్చో ఏది తినకూడదో చెప్పలేదు. మీకు ఏ ఆహారం పడితే అది తినండి అన్నాడంతే. యుక్త చేష్టశ్య కర్మసు - మీరు రెగ్యులర్ గా చేసే పనులు, రిలాక్సేషన్ కోసం చేసేవి యుక్తముగా చెయ్యండి. యుక్త స్వప్నావబోధశ్య - మీ స్వప్నంలో కూడా మీకు కంటిన్యుటీ ఆఫ్ కాన్షియస్ నెస్ ఉండాలి.
Bhagavat Gita- Sankhya Yogam - రామకృష్ణ పరమహంస దేవతా శక్తులను సూక్ష్మ లోకాలలో మనకు అందుబాటులోకి తెస్తే, సూక్ష్మ లోకాలలో ఉన్న దేవతా శక్తులకు ఆహారం, మెసేజ్ ఎలా అందించాలి అనే విధానాన్ని శ్రీ రామ శర్మ ఆచార్య యజ్ఞవిధానం ద్వారా అందించారు. ఐదారు నెలలు ఆ ఉద్దేశ్యంతో మీరు యజ్ఞం చేస్తే మీకు దేవతలతో మాట్లాడే భాష వచ్చేస్తుంది.
Bhagavat Gita- Sankhya Yogam - ఎప్పుడైతే మీ ఇంద్రియాలను అంతర్ముఖం చేస్కోగలుగుతారో అప్పుడు నిజమైన విద్య ప్రాదుర్భవిస్తుంది. బాహ్య జగత్తులో మనం పొందుతున్న జ్ఞానం అంతా 5 ఇంద్రియాలవల్లే మనం పొందుతూవుంటే, అంతర్ జగత్తులో ఉన్న జ్ఞాన్ని కూడా ఈ 5 ఇంద్రియాలవల్లనే పొందాలి, ఇంకొక దారి లేదు. ఏ ఇంద్రియాలద్వారా మీరు బాహ్యజగత్తు యొక్క జ్ఞానాన్ని పొందగలుగుతున్నరో దాన్ని మీరు ఆపేయగలిగితే ఆ ఇంద్రియాలు ఖాళీగా ఉండలేవు. ప్రకృతి శూన్య స్థితిని ఇష్టపడదు, అందువలన ఆ ఇంద్రియాలు అంతర్గతం అవుతాయి.
Bhagavat Gita- Sankhya Yogam - యోగ సాధన ఏం చెపుతుంది అంటే మనస్సనే ఇంద్రియానికి మీరొక నూతన రూపకల్పన చేసి దాన్ని ఉపయోగించుకోగలిగితే దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య స్పర్శ లభిస్తాయి. సాధకుడికి సాంఖ్య యోగం, కర్మయోగం ఈ రెండు అత్యంత ముఖ్యమైనవి. సాంఖ్య యోగం - ఏ మానసిక స్థితిలో ఉండాలి ? , కర్మ యోగం - ఆ మానసిక స్థితిలో ఉండి ఎలాంటి పన్లు మాత్రమే చెయ్యాలి అనేది తెలుస్తుంది.
Bhagavat Gita- Karma Yogam - దేవాన్ భావయతానేన - యజ్ఞములద్వారా మీరు దేవతలను సంతృప్తి పరచండి. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు మీకు కమాండ్ లాగా పని చేస్తాయి. కమాండ్ అంటే వాటి అర్ధం చేసి తీరాల్సిందే. యజ్ఞ కర్మ ఏస్తున్నామంటే మీరు చేసిన పని ప్రకృతిలో ఉన్న ఎదో ఒక దేవతా శక్తికి ఆహారంగా మారితే సరిపోదు, "తృప్తి చెందటం కూడా జరగాలి".
Bhagavat Gita- Karma Yogam - Food - జగద్గురువు ఆ కృష్ణ పరమాత్మ మానవజాతికి అందించిన ఒక బృహత్తర దీక్షావిధానము భగవద్గీత. కర్మ యోగంలో నేర్చుకోవలసింది ఏమిటంటే చెప్పింది చేస్తాను, చేసిందే చెప్తాను, మిగతావి ఏం నేర్చుకున్న నేర్చుకోకపోయినా ఈ ఒక్కటి తప్పక నేర్చుకోవాలి. మీ దగ్గరకి సుఖం వచ్చినా, దు:ఖం వచ్చినా, మీరు ఏ అక్షర సముదాయాన్ని వాడారో గుర్తుచేసుకోండి. కచ్చితంగా ఆ అక్షర సముదాయమే వృధ్ధిచెంది మీ వద్దకు వస్తుంది.
Bhagavat Gita- Karma Yogam
Bhagavat Gita- Karma Yogam
Bhagavat Gita- Karma Yogam - Aatmabodha
Bhagavat Gita- Karma Yogam - Thathvabodha
Bhagavat Gita- Karma Yogam
Bhagavat Gita- Karma Yogam
Bhagavat Gita- Karma Yogam - Yoga Sthithi
Bhagavat Gita- Karma Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam - SIVA Samyamas explained.
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam
Bhagavat Gita- Gyana Yogam