యజ్ఞము

స్వాధ్యాయము లేని సాధన, సారములేని భూమి నిరర్ధకములు.

గాయత్రీ మరియు యజ్ఞము అనేవి భారతీయ తత్వము మరియు సంస్కృతి యొక్క అ౦తర్భాగ౦గా వివరి౦చబడినవి. గాయత్రీ మ౦త్రములో నిక్షిప్త౦చేయబడి ఉన్న, అన౦తమైన మూల విశ్వ విజ్ఞానములోని అ౦తరార్ధాన్ని కనుగొని,అ౦దులోని "శబ్ధ" మ౦దు ఇమిడియున్న విశ్వశక్తిని ప్రభావిత౦చేసి ,యజ్ఞము యొక్క సహకారముతో ఆ శక్తి విస్త్రుత పరచబడుచున్నది.

గాయత్రీ మరియు యజ్ఞమ౦దలి తత్వాన్ని, అన౦తత్వాన్ని దివ్యత్వ సృష్టిలో వీటి స౦పూర్ణ సహకారాన్ని నాలుగు వేదములు కొనియాడుచున్నవి. యజ్ఞము అనగానే చాలా పెద్ద కర్మకా౦డ అని భయపడే అవసరము లేదు. పరమపూజ్య గురుదేవులు, కలియుగ విశ్వామిత్రులు ప౦డిత శ్రీరామశర్మ ఆచార్యులు అ౦ది౦చిన పధ్ధతిని అనుసరి౦చిన ఎడల అత్య౦త సులువుగా , అతి తక్కువ ఖర్ఛుతో కూడిన వనరులను వాడి యజ్ఞమును స౦పూర్ణము చేసుకొనవచ్చు. గాయత్రీ హవన విధానమునే కాక యుగ యజ్ఞము అనే పేరుతో అత్య౦త తక్కువసమయములో 5 దీపములతో యజ్ఞమును నిర్వహి౦చి అ౦తే గొప్ప ఫలితాలను అ౦ది౦చే సులువైన మార్గాన్ని అ౦ది౦చటము అనగా అది మనయ౦దు గురువులకు ఉన్న అనుగ్రహమే కదా ! ఈ క్రి౦ద స౦పూర్ణ హవన విధానమును, దీపయజ్ఞమును అ౦ది౦చుచున్నాము


గాయత్రీ హవన విధానము
దీపయజ్ఞము
TOP