భారతీయ అధ్యాత్మికత నిత్య నూతనమైనది. ఋషుల పరంపరాగతంగా వస్తున్న జ్ఞాన సంపద ఈ పుణ్యభూమిని మరింత శొభాయమానము చేసింది. అలాంటి ఒక ఋషి సాందీపుడు. సాక్షాత్తు జగద్గురు శ్రీ కృష్ణునికి గురువు. తన గురువు ఐన సాందీపునికి గురుదక్షిణగా చనిపోయిన వారి పుత్రుడ్ని పునర్జీవింపచేసి పునర్దత్తుడిగా అందించాడు శ్రి కృష్ణుడు. అటువంటి అమృతత్వ విద్యను మరల మానవజాతికి అందించాలి అనే సంకల్పముతో సమర్ధ సద్గురు శ్రి శ్రీరామ కృష్ణ గురుదేవులు సాందీపనీ గురుకులమును అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వెబ్ ద్వారా తరగతులను మొదలుపెట్టారు. నూతన యుగ సాహిత్యమును, తమ జీవితమునే పణముగా పెట్టి మానవజాతిని పరిణామక్రమములో ముందుకు తీస్కొని వెల్లేందుకు కావలసిన సాహిత్యమును అందించిన వివిధ గురువులు అనుభవపూర్వకముగా రాసిన పుస్తకములపై విద్యా తరగతులు జరుగును. దాదాపు 20 సంవత్సరముల అనుభవము కల్గిన ఉపాధ్యాయులద్వారా తరగతులు జరుగును. ఈ గురుకులము ద్వారా రోగ రహిత జివితాన్ని, వృధ్ధాప్యరహిత జీవితాన్ని మరియు అమృతత్వ జీవితాన్ని మానవజాతికి అందించటమే మా లక్ష్యము.