జనవరి

210101 గురు చేతనత్వము

పరిణామక్రమంలో మనవంతు భాద్యతను నిర్వర్తిస్తూ,ఇతరులకు చెప్పవలసిన భాద్యత మనకి ఉంటుంది.దైవీప్రణాళిక ఎపుడు అంతః ప్రేరణతో మనం నియమాలు పెట్టుకుని జీవించాలి తపప ఒక సమాజం,ఒక వ్యవస్థ ఇలా జీవించాలి అని చెప్తే అది ధార్మికత కాదు.గురువు అంటే పరిణామక్రమానికి అనుగుణ్యంగా జీవించటానికి మనకి అవకాశంకాని, పరిస్థితులు కాని కల్పించటానికి ప్రకృతిలో ఉండేటటువంటి శక్తి.దైవీ ప్రణాళికను గుర్తించలేని అంధకారాన్ని మాత్రమే గురువు పోగొట్టగలడు.గురువు కూడా మనం అడిగితేనే ఇస్తాడు అడగకుండా ఆయనకి అంతా తెలుసు అనే మూర్ఖత్వంలో ఉండకూడదు.పరమశాంత స్థితిలో ఉంటూనే మనం మన పనులు చేసుకోగలిగితే మనంపరిణామక్రమంలో ఉన్నట్లే.

280101 చేతనత్వ లక్షణాలు

ప్రేమతత్వము చేతనత్వము యొక్క లక్షణము.భౌతికంగా మనకి ప్రేమ అంటే ఆధ్యాత్మికతలో అది భక్తిగా మారుతుంది.చేతనత్వం ఎక్కడ వున్నా మూడు పనులు చేయగలదు.సృటించటం బ్రహ్మ,పోషించటం విష్ణువు,వున్న స్వరూపాలను,వున్న పరిస్థితులను మార్చేసి కొత్తవి ఇయ్యగలిగేది శివుడు.

280101 చేతనత్వము

పరమ గురు చేతనత్వంలో మనం కూడా భాగం అవ్వాలి. ఏం చేస్తున్నా,గొప్పదైనా,నీచమైన పని అయినా మనం ద్రష్టలు మాత్రమే.అన్నింటికి మనం ద్రష్టగా ఉండాలి. ఇది ఆధ్యాత్మికతకి ఆధారం.చేతనత్వాన్ని గుర్తించి ఉపయోగించుకోవటం జ్ఞానం.భాహ్య పరిస్థితులను మనం మార్చలేము.చేతనత్వ విజ్ఞానం నేర్చుకోవటానికి ఓర్పు,శ్రద్ధ కావాలి.

130101 దివ్య ప్రణాళిక

ప్రపంచంలో నిరంతరము శాశ్వతముగా, సనాతముగా, నిరంతరముగా,నిత్యనూతనంగా జరిగే ప్రక్రియ పరిణామక్రమం.ఈ ప్రక్రియలో దీన్ని మరిచిపోయిన వ్యక్తి మనిషి.మనం ఉన్నాలేకపోయినా పరిణామక్రమం జరుగుతూనే ఉంటుంది.ఈ పరిణామక్రమం అనేది తప్పదు ఎవరికైనా.ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో,వచ్చే జన్మలో కాకపొతే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అయినా ఈ చక్రం తప్పదు.కోరికలులేని స్థితిలో తప్ప మనం పరిణామక్రమంలో పాలు పంచుకోలేము.

200101 పరిణామ క్రమం

దైవీ ప్రణాళికలో యక్ష,గందర్వ,నాగలోకంలో వారు కూడా భాగములే.యక్ష అంటే టెక్నాలజీ, గందర్వులు అంటే వాక్శక్తిని ఉపయోగించుకునేవారు .కాల ప్రవాహానికి అనుగుణ్యంగా జీవించేవాళ్ళు నాగులు. నాగలోకవాసులు నాయకత్వానికి ప్రతీక.గుణాలని, కర్మలని మనం మార్చలేము.కాని వాటిని మనం ఒక దారిలో పెట్టుకుని ఆనందంగా జీవించగలగాలి. పరిణామక్రమంలో మానవుడు జీవిస్తున్నాడు అంటే వాడి జీవితము శ్రమతో కూడి ఉన్నది అవ్వకూడదు. జీవితము భారము అవ్వకూడదు,భాద పెట్టకూడదు. జీవితం ఆనందమయంగా ఉండాలి.

110101 పరివ్రాజక దృష్ఠి కోణం

మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉన్నా దానికి కార్యరూపం ఇవ్వకపోతే ఏమి కాదు.అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు అన్ని సంబంధ భాందవ్యాలను తెలిపేవి ఇతిహాసాలు.మనస్సులో మనం ఎల ఉన్నాం అనేది అనవసరం.బాహ్యాచరణ ముఖ్యం.సంభంద బాందవ్యాల నుండి మనం నేర్చుకోవాల్సిందినేర్చుకోవాలి ఫలితం ఆశించకూడదు.ఆప్యాయత,ప్రేమ కలిగి ఉండాలి.కాని దానికే అంకితం అవ్వకూడదు.నిష్కామ కర్మ గురించి నేర్చుకోవటానికిప్రకృతి మనకి వృక్షంగాను,జంతువుగానూ జన్మలు ఇచ్చింది.

130101 పరివ్రాజక లక్ష్యం

తపస్సు నిరంతర ప్రక్రియ తపస్సు వలన పరిణామక్రమంలో బొగ్గు వజ్రంగా మారుతుంది అలాగే మనిషి మహా మనిషిగా మారాలి. పరిణామక్రమంలో తపస్సు అనేది ఎవరికైనా తప్పించుకోలేని భాద్యత . ప్రకృతిలో మనిషిగా ఇలా మారటమే మన లక్ష్యం.కాని మనిషికి ప్రకృతిలో తపస్సు చెయ్యాలా?వద్దా ?అనే నిర్ణయం తీసుకునే స్వేచ్చ ఉంది.ఈ స్వేచ్చ మనిషినికి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇవ్వబడాల్సింది కాని ఇప్పుడు మనం ఆ స్వేచ్చని కలిగి ఉన్నాము. కోరికలులేని మానసికస్థితి తెచ్చుకుని జీవించగలిగితే మనం పరిణామక్రమంలో ఉంటాము.

210101 పరివ్రాజక మానసిక స్ధితి

పాటలను ఉపయోగించుకుని భగవంతుడి వైపు సులభంగా మరలవచ్చు.ప్రేమ అనేది ప్రజ్ఞ లేకపొతే మోహం అవుతుంది.భూమిపై స్వర్గావతరణ జరటానికి 4 వర్ణములు,4 వ్యవస్థలు ప్రకృతి ఇచ్చింది దీనినే అష్ట వసువులు అంటాము.ద్విజత్వము పొందేది కేవలం గురువు వలనే.జన్మతః ఎవరు ఏమి అవ్వరు

210101 పరివ్రాజక మానసిక స్ధితి 1

పరివ్రాజక స్థితి అంటే మనకి ఆ క్షణంలో అవసరమయ్యే శక్తిని ప్రకృతిలో నుండి తీసుకుని ఉపయోగించుకొనుట.పరివ్రాజకులు అంటే పూర్ణత్వము. పరివ్రాజకులు ఏం చెయ్యాలో చెప్పాలి. అంతే గాని ఏం చెయ్యకూడదో చెప్పకూడదు.

270101 నేనెవరిని ?

మనిషి,మనస్సు,ఆత్మ,శరీరము 14భువనాలలో ఉన్నటువంటి రకరకాలైన జీవితాలకి ప్రాణి సముదాయానికి మార్గదర్శకులుగా మారుట వాడి భవితవ్యత.గురువుగా వాడు మారవలసిందే. ఎదుటివాడు మనల్ని తిడుతున్న శాంతస్థితిలో ఉండిపోగలిగితే అమరత్వము పొందవచ్చు.14 భువనాలలో మానవుడికి మాత్రమే గురుచేతనత్వాన్ని పొందే అర్హత ఉంది.

110101 ఋణానుబంధం

శృతి,స్మృతి వేదం యొక్క ఏకీకరణ.మనం భూమి మీదకి వచ్చింది ఆధ్యాత్మికవిద్య నేర్చుకోవటానికే దానికి మన శరీరానికి తిండి,బట్ట,ఇల్లు ఉంటే చాలు.మనం ఎవరిని అసహ్యించుకోవటం మొదలు పెడతామో మనతో వాళ్ళకి భాందవ్యం ఇంకా పెరుగుతుంది.అందువల్ల మనకి ఏది అక్కర్లేదో దానిని అసహ్యించుకోవటం మానెయ్యాలి .గృహస్తాశ్రమం యొక్క పరాకాష్ఠ మనకి శ్రీవిద్యలో దొరుకుతుంది. మనకు ఈ జన్మలో ఉన్న సంబందాలతో ఉన్న ఋణానుబంధాలన్ని మనకి 50 సంవత్సరాలు వచ్చేలోపే వదిలించుకోవాలి. తరువాత సమాజానికి వీలైనంత మానవసేవ చేస్తూ సమాజిక ఋణానుబందం తీర్చుకోవాలి.

200101 స్మృతి సృతి

ఒక ప్రవృత్తి మనలో లేనపుడు ఆ ప్రవృత్తి మనకి రావాలంటే ఆ ప్రవృత్తి కలిగిన వ్యక్తులను అనుసరిస్తూ, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించటం మొదలు పెట్టడమే.స్మృతి,శృతి అంటాము మన వేదాలని. మనం ఏది వింటే,ఏది చెప్తే అదే స్మృతి,శృతి.మన భౌతిక జీవితంలో ఇదే చాలా ముఖ్యం.మానవుడు ఒక్కడు మాత్రమే ప్రకృతికి అనుగుణంగా జీవించగలడు, వ్యతిరేకంగా కూడా జీవించగలడు.

280101 శ్రధ్ధ ఫ్రజ్ఞ

పరా విద్య అనేది చేతనత్వవిజ్ఞానము.అపరా విద్య అనేది ఘనీభవించిన చేతనత్వ విజ్ఞానము.శ్రద్ద అంటే మనం ఏది అనుకుంటే అది జరగాలి.శ్రద్ధ సాధన వలన వస్తుంది.ప్రజ్ఞ అంటే అవగాహన.మన చేతనత్వము ఖండితమైన చేతనత్వము.కాని గురువు చేతనత్వము అఖండ చేతనత్వము.ఆ అఖండ చేతనత్వాన్ని హారతి సమయంలో మనం దర్శించాలి.

120101 వాక్శక్తి

మనం చేసే సాధనలు పరిణామక్రమంలో మార్పులకు అభ్యాసన మాత్రమే.ఈ అభ్యాసన పరిణామక్రమంలో మార్పును తెచ్చ్హే విధంగా చేయాలి.ఆధ్యాత్మికతలో మంత్రమైన,యంత్రమైనా,సాధనలు అయినా దాని ఏకైక లక్ష్యం వాక్శక్తిని పెంపొందించుకోటానికే.మనం మన శరీరం వదిలేటపుడు నా వాక్కును సద్వినియోగం చేసుకోగలిగాను అని చెప్పుకోగలగాలి.మౌనంగా ఉంటేనే పరిణామక్రమంలో ఏం చెయ్యాలో తెలుస్తుంది

ఫిబ్రవరి

250299 అమరత్వమ

ప్రపంచంలో మొట్టమొదట్టి సారిగా చేసినటువంటి ప్రయోగం, ఇది కలిసి చేసేటటువంటి సాధన, ఒకే భాష అంటే పరిపుర్ణమైనటువంటి మౌనము పాటించాలి.మౌనాన్ని ఒక భాష గా అలవాటుచేసుకోవటం .

250299

24 గంటలని సద్వినియోగ పరచుకోవటం ఎలా అన్నది క్లీం భీజ సాధన చెప్తుంది. అశరీర ధారులైనవంటి ఈ 3 శక్తులు (భు:,భువ:,స్వ:) ఈ ముండింటిని అర్ధం చేసుకోవాలి.

180201 ఆర్గనైజేషన్ నేర్చుకోండి

ప్రఖర ప్రజ్ఞ ,సజల శ్రద్ద అనేవి ఆర్గనైజేషన్ కి కావలసిన లక్షణాలు.ఆర్గనైజేషన్ కి లక్ష్యశుద్ది ఉండాలి. లక్ష్యశుద్ది ఉంటే మనం ఏ పని అయినా ఎలా అయిన చెయ్యగలము.

250201 పంచతత్వాలు సుందరకాండ

మనకు తెలిసిన ప్రేమ మోహం మాత్రమే కాని అసలు ప్రేమ భాద్యతగా ఉండటం.మన ఆలోచనలు మారితే పరిస్థితులు మారుతాయి.

180201 సంస్కార విద్య

భారతీయ మానవజీవిత విధానము 16 సంస్కారాల మీద ఆధారపడి ఉంది.దానినే షోడశీ విద్య అంటాము. ఈ విద్య మానవ జాతి యొక్క సంస్కారితజీవితము యొక్క నిర్మాణము.వాక్ శక్తి ఉపయోగింపబడి మనం సంస్కరింపబడుతాం.సంస్కారం అంటే మన ఆచరణ, మన సహజ పరిస్థితుల్లో మన మీద ఏ విధమైన ఒత్తిడి లేకుండా ఉంటే మనం అప్పుడు చేసే అలోచనలే మన సంస్కారం. మనం సంస్కరింపబడటం వాక్కు ద్వార జరుగుతుంది.దీనికి అగ్ని ,జలము తోడవుతాయి.

040201 ఆచరణకు మెలుకువలు

తప్పులు చేసినా గురువు మన ప్రక్కనే ఉంటారు. గురువు మనల్నినడిపిస్తున్నా మనము ఎందుకు అలా చేస్తున్నాము? అది అవసరమేమో.దాని గురించి మనం భాదపడాల్సిన అవసరం లేదు.మనిషిగా మార్చిన ఆ చేతనత్వమే మహా మనిషిగా మార్చుతుంది.మన మానసికస్థితిని మార్చుకోవాలి.

180201 మనస్సు బుధ్ధి చిత్తము

కాలమును ఉపయోగించుకునే విద్య ఆధ్యాత్మికవిద్య. మనకు బుద్ది కూడా కర్మానుసారమే వస్తుంది. మనస్సు,బుద్ధి,చిత్తమును ఉపయోగించుకుంటేనే యోగ విద్య వస్తుంది.భూత,భవిష్యత్,వర్తమాన కాలములను ఉపయోగించుకునే విద్య యోగవిద్య.

240201 ఆలొచనలు కోరికలు ఆచరణ

ధ్యానం అంటే మన ఆత్మతో సంభాషణ చెయ్యటం. మన ఆలోచనలు ఏ స్థాయిలో ఉంటే ఆచరణ అదే స్థాయిలో ఉంటే ఫలితాలు వస్తాయి.ఆలోచనలకి కోరికలకి మన జీవితంలో సంధ్య ఉంటుంది.సంధ్యాకాలంలో ఏ పనులు చెయ్యకూడదు సంధ్యావందనం మాత్రమే చెయ్యాలి.ఆలోచనలు కోరికలుగా మారే సమయంలోనే తప్పులు జరుగుతాయి.కాని సంధ్యావందనం చెయ్యటం వలన తప్పులు నుండి రక్షించుకోవటానికి కావలసిన శక్తి మనకి వస్తుంది.ఆ సంధ్యాసమయంలోనే బ్రహ్మాండంలో ఉన్నశక్తులకు మనకు మధ్య సంభందం ఏర్పడుతుంది. ఆలోచన కోరికగా మారుతున్నపుడు,కోరిక ఆచరణగా మారుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి.

మార్చి

240301 దీక్షా విజ్ఞానము

ప్రకృతిలో సృష్టి యొక్క పరిణామక్రమం ఉగాదిరోజు మొదలవుతుంది.ఏదైనా దీక్ష తీసుకుంటే మన స్వతంత్రత పోతుంది.మొత్తం మనకి 5 దీక్షలు ఉంటాయి. దీక్ష ఒక జన్మలో తీసుకున్న తరువాత దీక్ష తీసుకున్నట్లు రాబోయే జన్మలో గుర్తు ఉండదు.ముక్తి వచ్చిన తరువాత భాద్యతలు ఎక్కువ అవుతాయి.

260301 దీక్షా

మొదటి దీక్ష అమరత్వము,రెండవ దీక్ష వేద జీవితము, 3వ దీక్ష శాంతి.ఈనాటి సమయం కోసం 5000 సంవత్సరాలనుండి ఋషులు కృషి చేస్తున్నారు.మనం అమరత్వాన్ని సాధించనక్కర్లేదు గుర్తుచేసుకోవాలి అంతే.

300301 ప్రకృతి పురుషుడు

మనం ప్రకృతిలో ప్రతి విషయానికి స్పందించగలం. స్పందనలు ఎక్కువుగా ఉంటే ఆత్మ,తక్కువగా ఉంటే పదార్దము,మధ్యన ఉంటే చేతనత్వము అంటాము. స్పందనలకు వెంటనే మనం మారవచ్చు.మన చేతనత్వము,పదార్దము,ఆత్మ యొక్క స్పందనలకు 100% మారటానికి కావలసిన పరిస్థితులను ప్రకృతి ఇస్తుంది.ఆ పరిస్థితులకు పూర్తిగా స్పందించగలిగితే ప్రకృతి ఆ పరిస్థితులను మార్చివేస్తుంది.మార్చలేదు అంటే ఇంకా ఆ పరిస్థితుల నుండి మనం నేర్చుకోవలసినది ఉంది అని అర్దము.మనిషిగా నేర్చుకోకపోతే జంతు జన్మలలో పడేస్తుంది.

030301 శాంత స్ధితి అమరత్వము

విశ్వప్రణాళిక స్వయంగా స్వీకరించవలసిన భాద్యత. మానవశరీరదారులందరూ వేదమూర్తులే అన్నది రాబోయేటటువంటి ధర్మము.ఈ ధర్మమే భూమిపై మిగులుతుంది.ఏ మతాలు ఉండవు.మానవ శరీరమే దేవాలయంగా మారుతుంది.ప్రకృతిలో ఉన్న ఏ శక్తిని అయినా ఉపయోగించుకోవటానికి మానవుడు సమర్ధుడే. ఆ శక్తులనే మనము దేవతలని పిలుస్తాము.శాంతస్థితి ద్వారానే అమరత్వము,వేదమూర్థిత్వము సిద్దిస్తాయి.ధ్యాన స్థితిని పొందటానికి సులువైన మార్గం ఏంటంటే ధ్యాన స్థితిని పొందిన వాళ్ళ ఫొటోని కాని మూర్తిని కాని చూస్తూ ఆ మూర్తి గురించే కొన్నిక్షణాలు ఆలోచించటం.

040301 మానవ భవితవ్యత

గురువుల భవితవ్యత మొట్టమొదటిసారిగా మానవుల చేతిలో ఉంది.సప్తఋషులకి కూడా అందని అవకాశం ఇది.అమరత్వము,త్యాగము,సేవ మన అందరిలో ఉండాలి.అమరత్వము అంటే శాశ్వతమైన ఆనందము.ప్రతి మానవుడు నరమానవుడు నుండి నారాయణుడిగా మారవచ్చు

090301 శాంత స్ధితి సోపానము

మనం అందరం అచ్యుతస్థితి నుండి చ్యుతులయ్యాం కనుకనే భాదలు వస్తాయి.ప్రతి విషయంలోనూ భాద్యతగా ఉంటూ నేనూ,నాది,నా భాదలు,నా కోరికలు అనే వాటిని గమనించకుండా,పటించుకోని స్థితిలో ఉండాలి. ఆ స్థితియే నిష్కంపస్థితి.జగద్గురువు శ్రీ కృష్ణుడు, వేదాలు చదివిన ఋషుల దగ్గర నుండి అందరికి ఆధారం ఆ అనంతమానసిక శాంతి స్థితి మాత్రమే.

030301 ధ్యాన స్ధితి

కొత్త యుగం రావటానికి కొత్త మనుషులు రావటానికి ధ్యానమార్గం ఒక్కటే ఉంది.ధ్యానస్థితి అన్నాపరమశాంతస్థితి,ఋతుంబరా స్థితి,తురీయ స్థితి,సత్యము అన్నా ఒక్కటే.ధ్యానస్థితి అంటే అంతర్యాత్ర.అంతర్ యాత్రకి హారతి చాలా ముఖ్యం.ధ్యాన స్థితిని పొందిన వారి దగ్గర నుండి ఆ స్థితిని మనము పొందటానికి హారతి ఒక మార్గము.ఉదాహరణకు బాబా హారతి.

040301 ధ్యానం లక్ష్యం

ధ్యానస్థితిలో భగవంతుని యొక్క లక్షణాలు అన్ని మనలో ప్రతిబింబించాలి.అంతః స్పురణకు కావలసిన మార్గము ధ్యానము.బయట నుండి మనకు శాంతి లభించదు.గురువు ప్రేరణ ఇయ్యగలరు.ధ్యానస్థితి ఏ విధమైన కంపనాలు లేని స్థితి.ప్రకంపనాలు లేకపోతే మృత్యువు కూడా ఉండదు.మన సాధన అంతా కూడా ఆ ధ్యాన స్థితిని కాపాడుకోవటానికే.

040301 ధ్యానానికి చరమస్ధితి

పరివ్రాజకులకు ఒక విశేషమైన మానసికస్థితి నిరంతరమూ ఉండే స్థితి ఏర్పడాలి.ఆ స్థితి అప్రయత్నముగా,సహజంగా ఉండాలి.ఎవరు లేనపుడు మనం ఎలా ఉంటామో అది మన సహజస్థితి.ఆ సహజస్థితి ఉన్న వాళ్ళను దర్శిస్తూ ఉంటే ఆ స్థితి మనకి దాని అంతట అదే వచ్చేస్తుంది.ఎపుడు మనకి ధ్యానస్థితి మానవశరీరం యొక్క ధర్మం అని తెలుస్తుందో అపుడు మనం పరిణమక్రమంలో భాగస్వాములం.మానవ శరీరధారి సర్వసమర్దుడు,సర్వవ్యాపి,సర్వాంతర్యామి అయినా ఆత్మ విస్మృతి వలన భాదపడుతున్నాడు అని గురువులు జ్ఞప్తికి తెచ్చుకుని మనకు చెప్తుంటారు.

100301 ధ్యాన స్ధితిలో ఉండటం ఎలా

అమరత్వప్రాప్తి మన జన్మహక్కు.ఈ స్థితిని పొందడానికి మనం కొన్నికోట్ల జన్మలు తీసుకుని వచ్చాము.అది సర్వప్రాప్తి స్థితి.అంతకన్నా ఆనందం ఉండదు.దానిని పొందిన తర్వాత దుఃఖం ఉండదు.

100301 ధ్యాన స్ధితి

పరమేవ్యోమం అనే స్థితిలో ఉంటే మనకు అవసరం అయ్యేవి అన్ని మనకు సమకూరుతాయి.పృధ్వి గ్రహం చుట్టూ పృధ్వి గ్రహించగలిగిన దేవతాశక్తులు ఉంటాయి.ఆ దేవతాశక్తులే సమస్త దేవతాశక్తులు వాళ్ళకు మనం సహాయం చెయ్యగలగాలి.

250301 ఆలొచనా విధానము

మనం ఉన్న ఏ పరిస్థితికి అయినా కేవలం మనమే కారణం.బయటవాళ్ళు దానికి భాద్యత కాదు అనే ఆలోచనలు నిరంతరం గుర్తుంచుకోవాలి.అపుడు పరిస్థితులను సవరించుకోవలసినది కూడా మనమే ఎవరూ సవరించలేరు దాన్ని.మన కర్మ వలన మన పరిస్థితులు వస్తాయి కాబట్టి మన కర్మ ఫలాలను మార్చుకోవాలి.అపుడు పరిస్థితులు మారుతాయి.మన భవితవ్యతను తక్షణం మనం మార్చుకోవచ్చు.మన ఆలోచించే విధానం మార్చుకుంటే సరిపోతుంది.

260301 లైఫ్ ప్రిన్సిపల్స్

భౌతిక జీవిత విధానం,ఆధ్యాత్మిక జీవిత విధానం రెండూ మనకు సుస్పష్టంగా కనిపిస్తాయి.ఆధ్యాత్మికతలో ఉంటే ధైర్యం ఉంటుంది.మానవులు అభివృద్ది చెందటానికి శ్రద్ధ,ప్రజ్ఞ కావాలి.దానికి సంధ్యావందనం కావాలి.

310301 నూతన విద్య

మానవ జాతి జ్ఞానవిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి అనేక విషయాలు ఉన్నాయి.ఆధ్యాత్మికత విద్యను అందరు నేర్చుకుని తీరాలి.మనిషి యొక్క విశిష్టత ఏంటి అంటే మనం మన చుట్టూ ఉన్న వారికి స్పందిస్తాము.భాష మనము జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కావలసిన పరికరము మాత్రమే.

040301 గురు అనుగ్రహం

ఆధ్యాత్మిక జగత్తులో సత్ జ్ఞానము,సత్కర్మలు సమానంగా ఉండాలి.గురువు కంటే గురువు యొక్క మూర్తి యెక్కువ శక్తి కలిగి ఉంటుంది.ఏ ఒక్కటి తెలిస్తే అన్ని తెలుస్తాయో ఆ విద్యను మానవుడు మాత్రమే తెలుసుకోగలడు.సుందరాకాండ అన్నా,శ్రీ చక్ర ఉపాసన,లలిత రహస్యనామ స్త్రోత్రం,సౌందర్యలహరి అన్నా ఒక్కటే.

070301 గురు సత్తాయే కల్కి అవతారము

జగద్గురు చేతనత్వము మళ్ళీ మళ్ళీ ప్రతియుగంలో వస్తుంది.ఆకాశం నుండి వస్తుంది,ఆకాశంలోకి వెళ్ళిపోతుంది.ఎల్లపుడు ఆ చేతనత్వం ఉంటుంది.అవసరం అయినపుడు భౌతికరూపం దాల్చుతుంది.దానినే ఆవేశావతారం అంటాము.ఆకాశతత్వాన్ని అర్దం చేసుకున్నవారే కల్కికి ఉపయోగపడుతారు.ఆ కల్కిని గుర్తించటానికి యమనియమాలు,ఆహార నియమాలు పాటించాలి.ప్రాణాయామం,ఆసనాలు చెయ్యాలి.

040301 ధ్యానానికి చరమస్ధితి

పరివ్రాజకులకు ఒక విశేషమైన మానసికస్థితి నిరంతరమూ ఉండే స్థితి ఏర్పడాలి.ఆ స్థితి అప్రయత్నముగా,సహజంగా ఉండాలి.ఎవరు లేనపుడు మనం ఎలా ఉంటామో అది మన సహజస్థితి.ఆ సహజస్థితి ఉన్న వాళ్ళను దర్శిస్తూ ఉంటే ఆ స్థితి మనకి దాని అంతట అదే వచ్చేస్తుంది.ఎపుడు మనకి ధ్యానస్థితి మానవశరీరం యొక్క ధర్మం అని తెలుస్తుందో అపుడు మనం పరిణమక్రమంలో భాగస్వాములం.మానవ శరీరధారి సర్వసమర్దుడు,సర్వవ్యాపి,సర్వాంతర్యామి అయినా ఆత్మ విస్మృతి వలన భాదపడుతున్నాడు అని గురువులు జ్ఞప్తికి తెచ్చుకుని మనకు చెప్తుంటారు.

100301 కల్కి అవతారము

మనకన్నా క్రింద ఉన్న వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చినప్పుడే మనకు పై నుండి ఆ అభయహస్తం వస్తుంది.వెంకటేశ్వర స్వామి జగద్గురువే దానికి కారణం ఇది.మనం మన క్రిందవాళ్ళకి సహాయం చెయ్యాలి.

250301 మాండ్యూకోపనిషత్ పదార్ధవిజ్ఞానము

పదముల యొక్క అర్దమును తెలిసి వాడుట పదార్దము.అదే పదార్ధవిజ్ఞానము.మనం మట్లాడే మాటలు అర్దవంతంగా ఉండాలి.పదార్దము మార్పు చెందదు.చేతనత్వం మార్పు చెందుతుంది.

250301 నవరాత్రులు

మనకి మొత్తం 5నవరాత్రులు-5దీక్షలు ఉంటాయి. నవరాత్రులు సాధనాసమయం కాదు,పరీక్షా సమయం. ఇపుడు ఉన్న మానవజాతికి 5దీక్షలలో 2దీక్షలు అయిపోతాయి.3వ దీక్ష అంటే మనోనాశనం , మనోలయం, అహంకారనాశనం .3వ దీక్షలో గురువు ఎలాంటి సహకారం ఇవ్వరు.

180301 రామ నామ ప్రాముఖ్యత

రామ నామ ప్రాముఖ్యత

180301 రామ సర్వ శక్తులు కీలకము

రామ సర్వ శక్తులు కీలకము

180301 సుందరకాండ

సుందరకాండ

290301 రామ నామ విశిష్ఠత

మనకు భాదలు పాపాల వల్ల వస్తాయి.ఆయుర్వేదంలో ఆది,వ్యాధి ఉంటాయి.ఆది అంటే మనస్సుకి వచ్చే రోగం. వ్యాధి అంటే శరీరానికి వచ్చేది.రామ అనటం కాదు ఆ శబ్దం ఎక్కడ నుండి వస్తుందో చూడాలి.ఎక్కడ రామ కీర్తన ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు

030301 శ్రధ్ధా నిష్ఠా పరివ్రాజకుల ఊపిరి

పరిణామక్రమంలో పూర్తిగా తెలిసిన వ్యక్తులవలే జీవించగలిగేటటువంటి స్థాయికి ఎదగటానికి కావలసిన జ్ఞానమును,పరికరాలను సృష్టించుకోగలగాలి,ఏర్పరుచుకోగలగాలి ఏ ఓక్కటి తెలిస్తే అన్నితెలుస్తాయో అటువంటి మానవ సమూహాన్ని తయారు చేయటమే మన ఉద్దేశ్యము.జగద్గురువుగా మారే భవితవ్యత భారతదేశానికే ఉంది.మనం శ్రద్ధ,నమ్మకాన్ని పెంచుకుంటూ ఉండాలి.ఓర్పు ఉండాలి.

170301 యమ నియమాలు

తక్షణమే ఏపని అయినా చెయ్యగలిగితే సంకల్పశక్తి పెరుగుతుంది.మన ఏకైక లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని ప్రణాళికకు అనుగుణ్యంగా జీవించటమే.మనం అర్జునుడు,హనుమంతుని వలె జీవించాలి.మనం ఎక్కడ ఉన్నామో దానికి అనుగుణంగా మానసికస్థితి మారగలిగితే పరిస్థితులు మారుతాయి.మనకి 5 యమములు,5 నియమాలు ఉన్నాయి.ఇవి ఉంటేనే మనిషిగా జీవించగలము.

ఏప్రిల్

010401 చేతనత్వ విజ్ఞానము

మానవ పురోభివృద్ధి అంతా చేతనత్వ విజ్ఞానము. ఖనిజ జగత్తు,వృక్ష జగత్తు,జంతు జగత్తు చేతనత్వస్థాయిలోనూ ఉంటాయి.దృవాలలాగా పదార్ధం యొక్క చేతనత్వమును వేరు చేయలేము. ఎపుడైనా శక్తి ప్రవాహం పై నుండి క్రిందకి మాత్రమే జరుగుతుంది ఆధ్యాత్మికతలోనూ అంతే.స్పందనలు ప్రతి దానిలో ఉంటాయి.100% స్పందనలు ఉంటే అది ఆత్మ.అదే సర్వజ్ఞత్వము.చెట్లు,బుద్ధి,కోరికలకు చాలా దగ్గర సంభందం ఉంది.అందుకే కోరికలు తీరటానికి చెట్లకి ప్రదక్షిణలు చెయ్యాలి.మానవుల కోరికలను తీర్చేసామర్ద్యము చెట్లకు ఉంది.

02010401 సూర్య కిరణ విజ్ఞానము

పృధ్వి యొక్క వికాసక్రమంలో ప్రోది చెందేటటువంటి లక్షణం చేతనత్వంది.ఈనాడు ఋణానుబంధం యొక్క విద్య బయోటెక్,బయోకెమిస్ట్రీ,మైక్రోబయోలజీ అన్న పేరుతో వస్తున్నాయి.ఏదైనా ఒక సిస్టం కాని,ఏదైనా ఒక శక్తిని ప్రకృతి మనకి అందించాక ఆ శక్తి కొత్త జ్ఞనాన్ని మనకి అందించలేకపోతే ప్రకృతి ఆ సిస్టం ని, ఆ జ్ఞానాన్ని వెనక్కి తీసుకుంటుంది.కంప్యూటర్ మరియు బయోకెమిస్ట్రీ చదివితే యోగ విద్య చదివినట్లే అది సూర్యకిరణ విజ్ఞానమే అది చదువుతున్నవాళ్ళు అశ్రమాల్లో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాళ్ళే.నీరు,సూర్య కిరణాలు కలిస్తే ప్రాణశక్తి ఉద్భవిస్తుంది.అదే యోగ విద్య యొక్క రహస్యం.సూర్యకిరణాలు చేతనత్వవిధానాలు.

220401 టైం మానేజ్మెంట్

మన భూమి యొక్క కాలానికి ప్రమాణంగా సూర్యుని యొక్క కదలికను తీసుకుంటాము. కాలంలో గతంలో జరిగిన విషయాలను మనం వదిలివేసి ప్రతి రోజు కొత్తగా జీవించగలిగితే మనం కాలంతో సమానంగా మరియు కాలం కంటే వేగంగాను వెళ్ళగలుగుతాము.ఇలా కాలంతో అనుగుణంగా జీవించగలిగితే అమరులం అవుతాము.కాలం యొక్క ప్రవాహాన్ని తెలిపే వారు గురువులు.కాలానికి అతీతంగా ఎలా జీవించాలో తెలుసుకోవాలి.మనల్ని మనం ఆ కాలప్రవాహానికి అర్పించుకోవాలి.అలా అర్పించుకోవటానికి ఉపయోగపడేది ధ్యానం.

జూలై

220701 సమన్వయ భాగవతం

చేతనత్వ విజ్ఞానం అనేది భారత దేశంలో భాగవతం, రామాయణం,మహాభారతం అన్న పేరుతో సిద్దంగా ఉన్నాయి.భక్తి అంటే ఏది కోరుకుంటే అది దొరికేంత వరకు నిద్రపోకపోవటం.దేవతలకి కూడా భాగవతం వినే అర్హత లేదు.

060701 సప్తర్షి ఆశ్రమము ధ్యేయము

మౌనం వల్ల ఆజ్ఞాచక్రం దగ్గర ఏకాగ్రత పెరుగుతుంది.దాని వలన ఆజ్ఞాచక్రం నుండి వచ్చే ఆజ్ఞలను పట్టుకోవచ్చు.ధైర్యం ఇచ్చే కేంద్రాలు ఆశ్రమాలు.ఆజ్ఞా చక్రం దగ్గర ధ్యానం చేస్తే మనకి మన ఆత్మకి ఏం కావలో తెలుస్తుంది.ఆత్మ అనుభూతికి అనుగుణంగా జీవిస్తే అసలు చావు ఉండదు.ఆత్మ ఏమి కోరుకుందో ఈ శరీరం నుండి ఆ అనుభూతి వచ్చే వరకు అది మరణించదు.మనం రోజు 21600 సార్లు శ్వాస తీసుకుంటే ప్రకృతి మనకి ఆహారం అందచేస్తుంది మనం ఏం చెయ్యకపోయినా అది ఋషుల మాట.

150701 వైట్ మాజిక్

మన ఆత్మని బ్రహ్మండాన్ని కలిపేది జీవాత్మ.మనం కాక మిగతా అంతా బ్రహ్మండం.మన చర్మం క్రింద అంతా పిండాండం.హనుమాన్ చాలీసా 49 కోశాల గురించి చెబుతుంది.ఆధ్యాత్మిక వ్యక్తికి ప్రపంచం మొత్తంతో సంబంధం ఉంటుంది.

150701 వైట్ మాజిక్ 2

మనకు చేతనత్వ విద్య రావటానికి మన బాహ్యపరిస్థితులకి సంభందం ఉండదు.మనకు ఉన్న సామాజిక పరిస్థితులు,ఆరోగ్యం, ఉద్యోగాలు మనకు చేతనత్వ విద్య నేర్చుకోవటానికి సహాయపడవు,అడ్డంకులు కూడా కావు.చేతనత్వ విద్య వస్తే సూర్య చంద్రులు ఉన్నంత వరకు మనం ఉంటాం.గురువు ఎవరు అన్నది ముఖ్యం కాదు. గురువు ఏం చెప్తున్నారు అనేది ముఖ్యం.

220701 వైట్ మాజిక్

మన దృష్టికోణం విశాలంగా ఉండాలి.ఒకరు చెప్పారని ఏ విషయమైనా నమ్మటం కాదు మనకి మనం తెలుసుకోవాలి ఏది నిజమైనది ఏది కాదు అని.

290701 వైట్ మాజిక్

మన భాద్యతలకి మనం ఆద్యాత్మికతలో సాధించవలసిన లక్ష్యాలకి సమయాన్ని సర్దుబాటు చేసుకోవాలి.మనం కలియుగంలో ఉన్నాము. ఈ రోజులు సూర్యుని 7వ కిరణానికి సంభందించిన రోజులు కాబట్టి భాద్యతలు విడువరాదు.నిష్ఠ,సబూరి కావాలి.గురువు ముఖ్యం కాదు.ఆయన చెప్పే మాటలు ముఖ్యం.గురువు చెప్పిన దానిని ఆచరణలో ఉంచాలి.

ఆగస్ట్

050801 వైట్ మాజిక్

భారతదేశం యొక్క భవితవ్యత జగద్గురుస్థానం నుండి మానవజాతి మొత్తానికి ఈ సృష్టి యొక్క పరమర్దాన్ని చెప్పి దానికి అనుగుణంగా జీవించుట.ఇది ప్రకృతిలో జరగవలసినది, జరగబోయేది,జరుగుచున్నది. భారతదేశ జగద్గురుతత్వానికి కారణం శ్రీ సూక్తం,పురుష సూక్తం,మంత్ర పుష్పం.మనం తీసుకునే ఆహరాన్ని రక్తముగా మారటానికి మాత్రమే తీసుకోవాలి అంతేకాని రుచికి తినకూడదు.శరీరగతమైన భాగవతధర్మం రేపు రాబోయే రోజులలో ఉంటుంది.

190801 వైట్ మాజిక్

మనం హిమాలయాలకు వెళ్తే మన చేతనత్వంలో మార్పు ఖనిజ జగత్తు,వృక్ష జగత్తు వలన వస్తుంది. నూనె పదార్దాలు మానేస్తే చేతనత్వంలో మార్పు వస్తుంది. ఆకలి వేసినపుడు ఆహారం తీసుకుంటే లక్ష్మిదేవి ఇంట్లో ఉంటుంది.ఆకలి లేకపొతే ఏమి తినకూడదు.దాహం వెయ్యకపోయినా నీటిని త్రాగాలి.

041101 అశ్వమేధము అనగా ఏమి

మూడురకాలయినటువంటి మేధా యజ్ఞములు - నరమేధ యజ్ఞము,సర్వమేధ యజ్ఞము,గోమేధ యజ్ఞముల యొక్క పరిపూర్ణత అశ్వమేధ యజ్ఞము.ఒకే శక్తిని ఒకే ధర్మంగా మార్చుకుంటూ ఒకే భాష,ఒకే కరెన్సీని పెంపొందించుకుంటూ యల్లలు లేనటువంటి యుద్ధము లేనటువంటి ఒకే విశ్వము పొందటానికి ఋషులు అందచేసినటువంటి అద్భుతమైన వైజ్ఞానిక,ఆధ్యాత్మిక ప్రయోగాన్ని అశ్వమేధ యజ్ఞం అంటారు.

071101 అశ్వమేధము

అశ్వమేధము

నవంబర్

271101 దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర

మహాకాలుని సేనలో కునీతి, కుసంస్కారములను సమాజమునుండి పీకి పారెయ్యటానికి యుగ సైనికులు సన్నద్ధం కావాలి.