జనవరి

110199 భాగవత పరిచయం

భారతీయ ఆధ్యాత్మిక విధానములో గురువు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది గురువు లేనిదే మన జీవితాని ఎటువైపుకి తిప్పుకోవలో మనకి తెలియదు. కానీ గురువు ఎవరు గురుబ్రహ్మ: ,గురువిష్ణు: గురు దేవో మహేశ్వర: అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం ఆచరణలో పెట్టలేని శ్లోకము ఎందుకు పనికిరాదు .అంచేత ఆ గురువు యొక్క త్రిమూర్తి స్వరూపము (సర్వసమర్ధత,సర్వవ్యాపకత్వము,సర్వశక్తి) గుర్తించటం నేర్చుకోవాలి . గో అంటే ఇంద్రియాలు అని కూడా అర్ధము వున్నది. ఇంద్రియాలను ప్రకృతి ఏం నేర్పుతోందో అది నేర్చుకోవట్టానికి ప్రయత్నించాలి. మీరు కనుక భాగవతాని అర్ధం చేసుకుంటే ఒకొక్క రోజు ఒక్కొక కనిక పగులుతుంది.

120199 భాగవతము చదివే విధానము

రామాయణము, భగవద్గీత, భాగవత జీవిత విధానాన్ని వైజ్ఞానికంగా ప్రపంచానికి అందచేసారు. ఈ దేవతశాక్తులన్ని ఎలా అయితే ఋషులు చెప్పారో అలానే మన శరీరం లో వుంటారు. జీవితము యొక్క ఆధారము 7, మనము ఏది చేసిన ఈ 7 లోనే తిరుగుతూ వుంటాయి 7 రోజులు. ఈ సంఖ్య సూర్యుడి దగ్గరి నుంచి వచ్చింది, ఈ 7 యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటూ 12 స్కందాలు వుంటాయి అవి జీవిత సత్యాలు అదే భాగవతము చెప్తుంది. 12 గ్రహాలు కనుక భాగవతాని అర్ధం చేసుకుంటే జీవన్ముక్తులు అవుతారు అంటారు.

170199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము-సంజీవని

సూర్యుడియొక్క వెలుగు సూర్యుడు దగ్గరే ఉండదు, ప్రపంచము అంతా విస్తరిస్తుంది. మీరు కళ్ళు మూస్కొని చీకటిలో ఉంటారో కళ్ళు తెరుచుకుని ఆ ప్రజ్ఞను మీలోకి దింపుకుంటారో అది మీ చేతిలోనే ఉంది.

110199 అనుగ్రహ మాలా మంత్రము- పరివ్రాజక శిబిరము

అనుగ్రహ మాలామంత్రమును అర్ధం చేసుకోవాలి, హ్రీం భువనేశ్వరీ దేవి బీజాక్షరము, విశాలత్వము మన ఆలోచనలలో రావాలి. వంద్రుడు నుంచి వచ్చే నిత్యకళలకు 16 పేర్లు ఉన్నాయి, సూర్య్డునుండి వచ్చే కిరణాలు అవి. మీ శరీరము సంపూర్ణముగా అనుగ్రహ మాలా మంత్ర స్వరూపమే. అనుగ్రహమాలా మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడూ మీ చేతనత్వములో ఎక్కడ ఏమి మార్పులు వస్తున్నాయో గమనించాలి, మీలోని కొత్త శక్తి కేంద్రాలు జాగృతము అవ్వటము మీరు గమనిస్తారు.

200199 జగత్ గురు వాణి

మనము చదువుకునే వదువులు డాక్టర్ ఐతే ఆ ప్రత్యేక విషయముపై, ఇంజనీరింగ్ చదివితే వారు ఒక ప్రత్యేక విషయము పైన మాత్రమే జ్ఞనాన్ని కలిగి ఉంటారు, కానీ యోగ విద్యద్వారా పరిపూర్ణ జ్ఞనాన్ని సాధించవచ్చు. ఒక జన్మకు మాత్రమే కాదు, కొన్ని జన్మలకు కావలసిన జ్ఞనాన్నిపొందుతారు.

200199 శ్వాస ధ్యానము 1

శ్వాసను గమనించటము అనేది మన నిత్యజీవితములో భాగముగా మారినప్పుడే యోగవిద్య మీద మీకు పట్టు వస్తుంది, భూత భవిష్యత్, వర్తమానాలు మనకు తెలుస్తాయి. మీరు శ్వాసను పట్టుకోవటము

200199 శ్వాస ధ్యానము 2

శ్వాస ధ్యానము ద్వారా అద్భుతమైన వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. ఒకప్పుడు సినిమా హీరోలు కష్టపడి చదువుకోవటము, సమాజానికి ఒక రోల్ మోడల్ లాగా ఉండేవారు. ఇప్పుడు హేరోలు రౌడీలు. ఒకప్పుడు సినిమాలో ఎవరినన్న తీసెయ్యాలి అంటే వాళ్ళకి టి.బి.వచ్చి పోయినట్టు చూపించేవారు. ఇప్పుడు క్యాన్సర్, మనం అర్ధము చేసుకోవలసింది ఏమిటి అంటే చాలా పెద్ద పెద్ద రోగాలను మనుషులు ఎదుర్కోవలసిన పరిస్ధితులు వస్తున్నాయి. మనము ధ్యాన మార్గముద్వారా మన రోగాలే కాక, మన చుట్టుపక్కల వాళ్ళ రోగాలను కూడా తగ్గించవచ్చు.

240199 ప్రేమ ధ్యానము

పరస్పరం కలిసి పనిచేయటం నేర్చుకోవాలి అందుకోసం ప్రేమతత్వము ధ్యానము చేయాలి. ఈ ధ్యానములో మనం నిరంతరం మట్లాడుకుంటూ వుంటాం. ప్రేమతత్వములో దు:ఖమే తప్ప సుఖము వుండదు. కాని ఆ దు:ఖమే సుఖములా అనిపిస్తుంది.

310199 పౌర్ణమి యజ్ఞము

భారతీయ ఆధ్యాత్మికత అంటే సనాతనమైనటువంటి నిత్యనూతనమైనటువంటి శాశ్వతమైనటువంటి సత్యాలను అర్ధం చేసుకొని దానికి అనుగుణంగా జీవించుట. ఈ పౌర్ణమి అమావాస్య ఒక పండుగగా మారాలి. సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క విద్యను నేర్చుకోబోతున్నాము. ఈ యజ్ఞములో ప్రకృతిలో లీనమైపోయి దానికి తగినట్లు వుండే విధి విధానాన్ని నేర్చుకోబోతున్నాము .

ఫిబ్రవరి

280299 క్లీం బీజ సాధన

ప్రపంచంలో మొట్టమొదట్టి సారిగా చేసినటువంటి ప్రయోగం, ఇది కలిసి చేసేటటువంటి సాధన, ఒకే భాష అంటే పరిపుర్ణమైనటువంటి మౌనము పాటించాలి.మౌనాన్ని ఒక భాష గా అలవాటుచేసుకోవటం .

280299 క్లీం బీజ సాధన 2

24 గంటలని సద్వినియోగ పరచుకోవటం ఎలా అన్నది క్లీం భీజ సాధన చెప్తుంది. అశరీర ధారులైనవంటి ఈ 3 శక్తులు (భు:,భువ:,స్వ:) ఈ ముండింటిని అర్ధం చేసుకోవాలి.

100299 సావిత్రి 1

సావిత్రి లో మనం చదువుకునేటటువంటిది సనాతనంగా ఆధ్యాత్మికత లో చదువుకునేటటువంటి విషయాలే కొత్త ఏముంటుంది అంటే అందులో ప్రెసెంట్ చేసేటటువంటి విషయము ఆధునిక కాలములో చేసేటటువంటి విధి విధానము. ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో లాభాలు రావడం కాదు తక్షణం లాభాలు పొందడం అది నేర్చుకుంటాం ఈ సావిత్రి లో. సావిత్రి అనేది వేదమే.

మార్చి

030399 అనుగ్రహ మాలా మంత్ర సాధన

ప్రతి శబ్దాన్ని ఉచ్ఛారణ చేసేటపుడు ప్రతి అక్షరాన్ని ఉచ్ఛారణ చేయాలనే సంకల్పం వస్తుంది. అది ఎక్కడ నుంచి వస్తోందో దాన్ని పట్టుకోవాలి . పట్టుకున్నాక ఈ సంకల్పం ఉచ్ఛారణ చేయటానికి ఆ వాక్కు ఉచ్చరింపబడటానికి శ్వాస వుండాలి. ఆ శ్వాస మీ లోపలి వెళ్ళి అక్కడ నుంచి ఈ సంకల్పం శబ్దావలళి గా మారేటటువంటి ప్రక్రియ మనలో ఎలా జరుగుతోందో దాన్ని మనం గమనించబోతున్నాము

020399 ఎంట్రీ టు స్పిరిట్ ( ఆత్మలోనికి ప్రవేశము)

ఆధ్యాత్మికత అనేది ఒక జీవిత విధానము. రెండు సత్యాలు మన జీవితం లోకి అనుభవం లో కి వస్తే ఈ ఆధ్యాత్మికత యొక్క ప్రవేశము మన జీవితం లో కి వస్తుంది. మొదటిది జన్మ జన్మల యొక్క అవగాహన అనుభూతి లోకి రావాలి. రెండవది కర్మ సిద్దాంతము. సేవ చేయడం ద్వారా మన జీవితాలలో వున్నా కర్మను పోగొట్టుకోగలము. కర్మ సంబంధం అర్ధం కావాలి అంటే క్లీం బీజం కావాలి.

010399 క్లీం బీజ సాధన

క్లీం బీజ సాధకుడు సాధన చేసేప్పుడు ఆ శబ్ధాన్ని క్లీం బీజము నా శరీరములో ఎక్కడ ధ్వనిస్తోంది అనేది గమనించుకోవాలి. ఆ స్పందనలను పట్టుకోవాలి. కంప్యూటర్ కర్సర్ నొక్కితే ఏది కావాలో అది మనము సెలెచ్ట్ చేస్కోగలము, చేసుకున్నాక మనకు కావల్సిన మార్పులు మనము చేసుకోవచ్చు. అదే విధముగా ఆ శబ్ధము ఎక్కడ నొక్కబడుతుందో అర్ధం చేసుకోవటము చాలా అవసరము.

010399 క్లీం బీజ సాధన

వేళ్ళకు భూమినుండి శక్తి వస్తే అది ప్రతి ఆకుకు చేరుతుంది, అలాగే నిద్రా స్ధితిలో మీకు శక్తి లభిస్తే భౌతిక జగత్తులో మీకు కావల్సిన శక్తి మీ శరీరానికి సహజంగా వస్తుంది. పరిణామ క్రమాన్ని అర్ధము చేసుకొని మీ జీవిత విధానాన్ని మీదైన రీతిలో మల్చుకోవటము నేర్చుకోవాలి. జాగృతావస్థలో మన జీవితము 5 ఇంద్రియాలకు లొంగిపోయి ఉంటుంది. క్లీం బీజ సాధన ద్వారా మీరు వీటిని మీ అదుపులోకి తెచ్చుకోవచ్చు.

010399 క్లీం బీజ సాధన

డైనమిక్ సైలెన్స్ నుండి వేదాలు ఉద్భవిస్తాము, ఋచో అక్షరే పరమే వ్యోమన్ అను మంత్రాన్ని ఉపయోగించుకోండి. మనలో ఉన్న చేడూ బయటికి పూర్తిగా పోతే తప్ప మనకి ఈ స్ధితులు అర్ధం కావు.

010399 క్లీం బీజ సాధన

నా శరీరము కూడా ఒక కణమే, దీని లోపల బయట కొన్ని రసాలు ఉన్నాయి, రసోవైసహ:. సముద్రంలో మునిగితే మన లోపల అనేక జివరసాలు ఉన్నాయి, సముద్రము బయట నీరు ఉన్నది. మనం అలాంటి ఒక ప్రాణ సమద్రములో నిండి ఉన్నాము. ఈ క్లీం బీజ ధ్యానాన్ని బాగ అర్ధం చేస్కొని ఆచరించండి. మన శరీరములో సమత్వాన్ని ఈ క్లీం బీజము వలన వస్తుంది

010399 క్లీం బీజ సాధన

క్లీం పరమాణువులు, శ్రీం పదార్ధము హ్రీం కణాలు. కణాలు స్వయంపోషక ప్రవృత్తిని ఇచ్చే శక్తి, కణాలు ఈ శక్తిని పరమాణువులకు, పదార్ధానికి కల్గిస్తాయి.

010399 క్లీం బీజ సాధన

ప్రకృతి ఎప్పుడూ మీకు కొత్త విషయాలను నేర్పించటానికి కావలసిన పరిస్ధితులను కల్పిస్తుంది, మీరు ఎక్కడ ఉంటే అక్కడే నేర్పిస్తుంది, ఎక్కడికీ వెళ్ళక్ఖర్లేదు. ప్రతీ సంఘఠన వెనకాల ఒక దిశా నిర్దేశము ఉంటుంది, అది పట్టుకునే ప్రయత్నము చెయ్యండి.

010399 క్లీం బీజ సాధన

క్లీం బీజ సాధన శిబిరములో పాటించవలసిన నియమాలు. దీక్షా విజ్ఞానికి నాంది ప్రస్తావన.

030399 నవ్య యుగ ప్రణాళిక- కార్యకర్తలకు మార్గదర్శనము

సంఘీ భావము కలిసి పని చెయ్యటము అనేది మొదటి సూత్రము, పండూగలు సామూహికముగా జరుపుకోవాలి. రామ నవరాత్రులలో 11 సార్లు ప్రతి రోజూ రామ రక్షా స్తోత్రము పారాయణ చేస్తే ఆ స్తోత్రము సిధ్ధిస్తుంది. ఆదిత్య హృదయము 108 సార్లు పూర్తిచేసుకోవాలి.

170399 శ్రీ రామ నవరాత్రి- సూర్య కిరణ విజ్ఞానము

రామ అనే మంత్రము మనలో ఎక్కడ ఉద్భవిస్తోందో పట్టుకోండి. రాముడు, హనుమంతుడు, వాలి ఒకళ్ళని ఒకళ్ళూ గుర్తించుకున్నతరువాత సూగ్రీవుడు దగ్గరకి తీస్కొని వెళ్తాడు. ఒకే బాణముతో 7 తాటి చెట్లను సంహరించగలిగితే వాలి సంహారము చెయ్యగలవు. తార, అంగదుడు వాలి సంహారము తరువాత సుగ్రీవుడూ దగ్గరకు వస్తారు. ఇది సాధన, ఇది మన శరీరములో జరుగుతోది. శ్రీ రామ నవరాత్రులలో మీరు ఈ సూర్య విజ్ఞానాన్ని. సుగ్రీవుడు విశుధ్ధి చక్రము, వాలి మీ అలవాట్లు, తార మీరు పుట్టిన నక్షత్రము మీ పేరులో, రాముడూ హృదయ చక్రము. మూలాధారము నూండి సహస్రారమువరకు ఆ నమము

030399సమంకాయ శిరోగ్రీవం

సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్ధిర: సంప్రేక్ష నాసికా గ్రం సం దిసశ్చా నవలోకయన్

040399 అనుగ్రహమాలా మంత్ర సాధన - మౌనము

అనుగ్రహమాలా మంత్ర సాధన - సాధకుడు శబ్ధాల మాయలో మంత్రాల మాయలో పడకుండా మంత్రాన్ని ఉపయోగించుకుని పశ్యంతీ స్ధితిని పట్టుకోవాలి .

040399 అనుగ్రహమాలా మంత్ర సాధన - మౌనము

అనుగ్రహమాలా మంత్ర సాధన - సాధకుడు శబ్ధాల మాయలో మంత్రాల మాయలో పడకుండా మంత్రాన్ని ఉపయోగించుకుని పశ్యంతీ స్ధితిని పట్టుకోవాలి .

050399 అర్జున విషాదయోగ గీతా సాధన

సాధకుడు ద్వంద్వాతీత స్ధితికి వెళ్ళి విషాదమునుండి ఎలా బయటపడవచ్చు- వివరణ

060399 క్లీం బీజ సాధన

భారతీయ ఆధ్యాత్మికత అనే మాటలో భారతేయత అనేది అదొక దేశానికి సంభందించిన జ్ఞానం అని కాదు మొట్టమొదట్ట అది భారతీయులు గమించారు అని అర్ధం. వేద విజ్ఞానం లో ఋషుల యొక్క అర్ధము ఏంటి అంటే వాళ్ళు ద్రష్టలు మాత్రమే అందుకని వాళ్ళని మంత్ర ద్రష్ట ఋషులు అంటాము.మంత్రం అంటే పరా స్థితి నుంచి ఒక్క విశేషమైన ప్రాకృతిక శక్తిని మీ వద్దకు తిసుకువచేటటువంటి అక్షర సముదాయము.

170399 నవ్య యుగ ప్రణాళిక

ఈ జీవిత విధానం రాబోయే 2౦౦ కోట్ల సంవత్సరాల వరుకు మీకు పనిచేస్తుంది. ఈ కొత్త జీవితానికి సంకేతంగా ఈ క్లీం బీజ సాధన ఇవ్వబడింది, ఇది తల్లి నుంచి బయటికి వచ్చేటటువంటి 9 నెలలలో చేసుకుంటాము. బయటికి వచ్చిన దగ్గర నుంచి 2౦ సంవత్సరాల వరకు శ్రీం సాధన, ఆ తర్వాత నుంచి చనిపోయే అంత వరుకు హ్రీం సాధన జరుగుతుంది ప్రతి మనిషిలో.

190399 నవ్య యుగ ప్రణాళిక

శరీరమే దేవతల నిలయము. ఈ దేవాలయాలు కేవలము దాని గుర్తుచేయడానికి ఒక్క స్థితి మాత్రమే. దేవతల స్పర్శ అందించేటటువంటి దేవాలయాలు మనము నిర్మించాలి. యముడులోంచి నచికేతాగ్ని నుంచి ఉపయోగించుకుంటూ సావిత్రి యొక్క అనుగ్రహముతో ఆ దేవాలయాల నిర్మాణము.కాని ఇది జరగడానికి మీలో నిద్రాణమైనటువంటి ఈ దేవతా శక్తులు మేల్కోవాలి

210399 నవ్య యుగ ప్రణాళిక -1

5 విశేషమైన దేవతాశక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతునాయి. ఆ శక్తి ధారలని ప్రుద్వి గ్రహంపై జీవించేటటువంటి 5 రకాలైనటువంటి ప్రాణికోటికి యొక్క ఉపాసనకు బీజాలు. సమస్త మానవజాతి బదులు రామకృష్ణ పరమహంస ఉపాసన చేసి దేవతలని నిలిపాడు.

200399 నవ్య యుగ ప్రణాళిక

రామ నవరాత్రులలో మీతో హనుమాన్ చాలీసా పారాయణ, రామరక్షా స్తోత్ర పారాయణ చేయించటానికి కారణము మీ అందరిలోకి సూర్యుని 3 వ కిరణము దిగాలని. సర్వ ధర్మాన్ పరిత్యంజ్ మామేక శరణ వ్రజ..అనే మానసిక స్ధితి తెచ్చుకోవటము, అది ఒక చివటం అమ్మలాగా, ఒక సాయులాగా మీరు తత్క్షణమే ఆ సర్వ సమ్ర్ధత, సర్వ వ్యాపకత, సర్వాంత్ర్యామిత మీకు తెలుస్తుంది. మరి ఈ మార్గము మీకు చేతకావట్లేదు కాబట్టి సాధనలు చెయ్యటం చదవటం తప్పదు, షార్ట్ కట్స్ లేవు.

200399భగవత్ గీత

భగవత్ గీత ని అర్ధము చేసుకునేందుకు మనము అలవరచుకోవలసిన లక్షణాలు అష్తాంగ యోగ విద్యలో చెప్పబడిన యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు.

210399 ఆత్మ సంయమన యోగము

ధీర మనస్సు, ధైర్యము ఉన్న మనస్సు అధ్యాత్మికతకి చాలా అవసరము. ధైర్యము ఉంటే తప్ప మనము ఏ సాధనా చెయ్యము. అద్భుతమైన సుఖము, దీనిని మించిన ఆనందము ఇంకొకటి లేదు అని ఋషులు చెప్తున్నా చెయ్యలేని దుర్బలత మానవులది. అందుకు ధైర్యము కావాలి, ఎలాంటీ ఫలితము వెచ్చిన పరవలేదు నేను సాధన చెయ్యాలి అన్న ధైర్యము కావాలి.

270399 సాధకుని మానసిక స్ధితి

నూతన యుగావతరణ వల్ల కొన్ని విశేషమైనటువంటి భాద్యతలని మనం స్వీకరించవలసి వచ్చింది. ఏ విద్య తెలుస్తే మిగతా అన్ని విద్యలు తెలుస్తాయో అదే ఆధ్యాత్మిక విద్య. క్రైస్ట్ కి కృష్ణుడికి మొహమద్ కి వున్న సమన్వయాన్ని అర్ధం చేసుకోవటము. రాముడే మళ్లీ కృష్ణుడి గా పుట్టొచ్చు కాన్ని ఇద్దరు ఒక్కటే చెప్పలేదు. అలానే క్రిష్టియానిటి ప్రపంచానికి ఎం చెప్పింది. ఈ మూడు విద్యలు మీకు తెలియాలి. సాధకుని మానసికస్థితి కదలకూడదు స్థిరంగా వుండాలి అలా అని రాయిలా మారడం కాదు

230399 శరీర ధర్మము

వేద విజ్ఞానం నిత్యజీవితం లో ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేటటువంటి సూత్రమే రామాయణము. ఈ మౌలికమైన సిద్ధాంతాలు మనము మర్చిపోవడం వల్లనే ఈ లోకహితమైన గ్రంధాలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. మన లక్ష్యము వేద విజ్ఞానాన్ని తిరిగి భారతదేశములో పున్నరుద్ధరీకరించుట

250399 రామనవమి విశిష్ఠత

మానవుడిగా జన్మ ఎత్తిన మనకు మనిషిగా కొన్ని బాద్యతలు వున్నాయి. సమాజంలో వున్నంతవరుకు సంఘానికి ఏ విధమైన ఇబందులు రాకుండా చూసుకోవడం. అదే ఋషిమయ జీవితం. అసలైనటువంటి మానవుడిగా ఏ బాధ్యతలు వున్నాయో అవి స్వీకరించటం. మన జీవితంలో ఏది జరిగినా రామాయణం లో వున్న ఏడు ఖాండలే జరుగుతాయి. అందుకే అవి మనము ఇపట్టికి చెప్పుకుంటున్నాము

070399 సక్రియ మౌనము

ఋషులు గురువులు మాట్లాడిన మాట్లాడకపోయినా వాళ్లెప్పుడు ఈ సైలెన్స్ లో నే వుంటారు. బాహ్యజీవితనికి సంబంధించిన ఈ నియమాలు ఈ మౌనానికి వర్తించవు. కాని ఈ మౌనం వల్లే బౌతిక జీవితం లో వున్న అన్ని నియమాలు పని చేస్తాయి, పదార్ధానికి వున్న నియమాలు ప్రాకృతిక శక్తులు ప్రాకృతిక శక్తుల లాగా పనిచేయటానికి కూడా కారణమూ ఆ మౌనమే . ఆ మౌనం వల్లే అనంతమైనటువంటి శక్తి కణములోకి ప్రవేశిస్తుంది.

ఏప్రిల్

060499 శ్రీం & క్లీం బీజ సాధన - 1

శ్రీం బీజ సాధన - సమయాన్ని దాటగలిగినప్పుడు ఈ సాధన ఫలిస్తుంది. ఆర్తో, జిజ్ఞాసో, జ్ఞాని, అర్ధార్ధీ- ఈ నాలుగు స్థాయిలు ఉంటాయి. ఐశ్వర్యవంతులని చూసే మనస్సు, వారిని మెచ్చుకునే మనస్సు తెచ్చుకోవాలి ముందు. భారతీయ అధ్యాత్మికతను ఐశ్వర్యమును కల్గి ఉండుట తప్పు అనే ఒక భ్రమలో ఉన్నారు, కానీ మన చుట్టు అనంతమైన సంపద ఉన్నది. గౌతమ ఋషిదగ్గర అనంతమైన సంపద ఉన్నది, ఆయన పొద్దున్న పంట నాటి మధ్యాహ్నము కోసేసావారు.

070499 శ్రీం & క్లీం బీజ సాధన - 2

సాధకులు ముందుగా కుటుంబము పట్ల బాధ్యత, సమాజము పట్ల బాధ్యత తెలుసుకోవాలి. స్వప్న స్ధితి మన వశంలోకి రావటమే శ్రీం బీజ సాధన, దానికి చెయ్యవలసినది జాగృత స్ధిని సద్వినియోగము చేసుకొనుట. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్ధిర: అనే శ్లోకానికి అద్భుతమైన వివరణనిచ్చారు. ఆత్మ సంయమన యోగములోని శ్లోకాల వివరణ. సూర్య కిరణ విజ్ఞానము నేర్చుకోవటనికే గాయత్రీ మంత్రము చేసుకోవాలి. ఆ సౌభాగ్య సూర్యోదయము మీలో జరగటానికి మీ సాధనలు ఉపయోగపడాలి.

070499 శ్రీం & క్లీం బీజ సాధన - 3

శ్రీం బీజ సాధన - శీత్కారీ ప్రాణాయామము - గాలి లోపలికి పీలుస్తున్నప్పుడూ శ్రీం అను శబ్ధాన్ని పీల్చాలి, వదిలేటప్పుడు శాంత స్ధితిలో గాలి బయటీకి వదలాలొ. మనము పంట బాగా పండటానికి ఎరువు వేస్తాము, ఎరువు వేసినప్పుడు పంట బాగా పండుతుంది, దానితో పాటూ కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి, మనము సాధన చేసినప్పుడు కూడా ఇదే జరుగుతుది. మనము కలుపు మొక్కల్ని జాగ్రత్తగా పీకి పారెయ్యాలి. చాల మంది సాధకులు ఈ ముఖ్యమైన విషయాన్ని అర్ధము చేసుకొనలేక ఆధ్యత్మిక మార్గములో తప్పుదోవలోకి వెళ్ళిపోతారు, అలా జరగకుండా మీ మానసిక స్ధితిని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. భోజనానికి ముందు అశ్వనీ ముద్ర వేసుకోవాలి, మినిమం 10 మాక్సిమం 21 అంతే. ఉడ్డియాన బంధము, జాలందర బంధము వివరణ. జల తత్వానికి ప్రాణానికి సంబంధం ఉంది, వాయువుకి విజ్ఞానమయ కోశానికి సంబంధం ఉంది.

080499 శ్రీం & క్లీం బీజ సాధన - 4

సూర్యుని మొదటి కిరణము - సంకల్పము - ఈ సంకల్ప శక్తినుండి ప్రజ్ఞలోకి మీరు ప్రవేశించాలి అంటే మీకు ప్రేమ ఉండాలి. అందుకే సూర్యుని రెండవ కిరణము ప్రజ్ఞ - ప్రేమ. సూర్య కిరణాల ద్వారానే మీరు వీటిని పట్టుకోగలరు. ఈ ఉపన్యాసాలను మళ్ళీ మళ్ళీ విని రాసుకుంటే కానీ మీకు నేణు అందిస్తున్న ఈ జ్ఞానము అర్ధము కాదు. శ్రీం బీజ సాధన, క్లీం బీజ సాధన అంటే మీకు ఈ జ్ఞానము లేకుండా ఆ బీజాలు మీలో అంకురించవు. ఏ జన్మ సంస్కారమో మీకు ఈ ఉపన్యాసాల ద్వారా మీకు అద్భుత జ్ఞానాన్ని పొందే అవకాశము దక్కింది అనే సత్యాన్ని తెలుసుకుని జాగ్రత్తగా వినండి.

100499 శ్రీం & క్లీం బీజ సాధన - 5

శ్రీ బీజ సాధన ద్వారా మనలో బీజాలు పడతాయి, కానీ వాటిని రక్షించాలి , జాగ్రత్తగా పెంచుకోవాలి. వాటికి తగిన మానసిక స్ధితిని ఎల్ల వేళలా ఉంచుకోవటం తెలియాలి. క్లీం బీజ సాధన కానీ శ్రీం బీజ సాధన కానీ మన మనోభూమిలో నాటాక క్లీం అంటే సంకల్పముగా నాటుతాము, సమయాన్ని సద్వినియొగము చేసుకుంటాము, వీటికి సంబంధించిన భావాలు మీకు అర్ధము కావాలి.

120499 శ్రీం & క్లీం బీజ సాధన - 6

ఎక్కడ ఎక్కడ పసుపు రంగు వాడతామో అక్కడ అక్కడ మనము వనరులను మన వద్దకు లాక్కొంటాము, శ్రీం బీజ సాధనలో మన లక్ష్యాన్ని పూర్తి చెయ్యటానికి ఒక ముహుర్తము ఉండాలి, పసుపు రంగుతో మన కర్మలను మార్చుకొనవచ్చు. కాలాన్ని అతిక్రమించే శక్తి అభ్యాసము వలన వస్తుంది. ఆర్తో, జిజ్ఞాసో, జ్ఞానీ, అర్ధార్ధీ వీళ్ళందరికీ ఉదారత్వము ఉంటుంది. శ్రీం బీజ సాధనకు కావలసిన ముఖ్య మానసిక స్ధితి ఉదారత్వము. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభా:.స్వప్న లోకంలో జరిగే అధ్యాత్మిక తరగతులకు మీరు అటెండ్ అవ్వదలచుకుంటే భువ: ఆలోచనలకు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి.

130499 శ్రీం & క్లీం బీజ సాధన - 7

సంవత్సరములో జరిగే ప్రతీ మార్పు మన ఒక శ్వాసలో మార్చుకోవచ్చు, వాయువులో ఉండే ప్రాణ శక్తి మన శరీరములో శ్వాసగా క్రిందకి వెళ్తే కృష్ణ పక్షము, పైకి వెళ్తే శుక్ల పక్షము. ఈ శరీరము వదులుతున్న శ్వాస ఎప్పుడూ పైకి లేస్తుందో అప్పుడు ఓం అనే శబ్ధము సహజముగా మూలాధారమునుండి పైకి లేస్తుందో,సూర్యకిరణ విజ్ఞనములో చెప్పబడిన ఆ యోగ శక్తి ఆజ్ఞా చక్రము నుండి సహస్రారమువరకు వెలుగుగా వెళ్ళినప్పుడు, శరీరములోని నవ ద్వారాలు మూసివెయ్యగలిగితే అది ఓం, శ్రీం, క్లీం సాధన ఫలితము.

060499 మహా యోగేశ్వరీదేవి యొక్క యోగమాయా శక్తి - శ్రీం బీజ సాధన

2000 లోపు నేను నాటవలసిన ఆధ్యాత్మిక బీజాలన్నిటిని నాటుతున్నాను, ఇప్పుడు ఈ పని జరగకపోతే మళ్ళీ 24 కోట్ల సంవత్సరాలవరకు మానవజాతికి మళ్ళీ ఈ అవకాశము రాదు. అందుకు నేను క్లీం బీజ సాధనలో సమయాన్ని సద్వినియోగము చేసుకొనుటగురుంచి చెప్తున్నాను. ఏ శక్తివల్ల శ్రీ కృష్ణుడు లాంటి జగద్గురువు మహయోగేశ్వరీ దేవి అనుగ్రహముతో దాటగలిగాడో ఆ మాహాయోగేశ్వరీ దేవిని మనము ఇప్పుడు మళ్ళీ మన హృదయములోకి దిఫుకుంటున్నాము. ఆవిడ మాహా మాయను దాటించగల సమర్ధురాలు. భగవద్గీత 18వ అధ్యాయములో భగవద్గీత 61, 62 శ్లొకములలో శ్రీం బీజ సాధనకు కావల్సిన వివరణ ఉంది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేఅర్జునతిష్ఠతి...యంత్రారూఢాని మాయయా. ఏ శక్తి వలన శ్రీ కృష్ణుడు మహా మాయా దాటగలిగాడో ఆవిడే యోగమాయ మహాయోగేశ్వరీదేవి. క్షమా, ధైర్యము, బుధ్ధి, స్మృతి, వాక్కు, సంపద, కీర్తి ఈ ఏడు శ్రీ కి 7 లక్షణాలు.

080499 సంకల్పము ప్రేమ

"భారతీయత అంటె వెలుగు కోసం తాపత్రయం. చెట్టుకు సూర్యుడు వైపు ఎదిగే లక్షణం ఉంది. అంటే అది ఆత్మ నిర్ణయాన్ని పాటిస్తుంది. ఆత్మ యొక్క నిర్ణయాన్ని పాటించె వాళ్ళే వెలుగు వైపుకు ప్రయాణిస్తారు. కుంటుబం యొక్క,సమాజం యొక్క నిర్ణయాలని కాకుండ ఆత్మ యొక్క నిర్ణయన్ని పాటించె వాళ్ళే వెలుగు వైపు ప్రయాణిస్తారు. "

250498 సిధ్ధిరాజు వార్షికోత్సవము

"భారతదేశము ముస్లిం పాలనలొ ఉన్నప్పుడు ముకుంద బ్రహ్మచారి అనే ఒక మహా యోగి భారత దేశములొ ఇతర మతముల యొక్క రాజ్యము ఉండకూడదు అని ప్రయత్నం చేసాడు. అతనే తిరిగి అక్బర్ గ పుట్టవలసి వచ్చింది. గురువుల ప్రణాళికను మనం అర్ధం చేసుకొని జీవించాలి. రెండవ ప్రపంచ యుద్దం ఆపే ప్రయత్నాలు భారతదేశంలోని కొన్ని ఆశ్రమాలలొ జరిపించబడినవి, కాని దాని యొక్క శుభ ఫలితాలు ప్రపంచం అంతా అనుభవించింది. "

110499 యూనివర్శిటీ ఆఫ్ సిరీస్

"సిరీస్ అనే నక్షత్రము లేకపోతే ధర్మము అనేది ఇంత పటిష్టంగా వుండి వుండేది కాదు , దాన్నే యమ అంటాము. నియామకం చేసేటటువంటి విద్య సిరీస్. ఈ యూనివర్సిటీ ఆఫ్ సిరీస్ అనేది కోట్ల కోట్ల సంవత్సరాలనుండి వుంది. గురుపరంపరకు మూలమైనటువంటి స్థానం అది. "

220599 మానవజాతికి సవాల్

గురువు చెప్పింది చేస్తాము అనేవాళ్ళకే దేవాలయాలలోకి ప్రవేశం వుంటుంది,దేవాలయమంటే వెలుతురు వున్నవాళ్ళకి.మానసిక స్థితిలో మార్పు తెచ్చుకోవాలి.

230599 సాధకులకు సూచనలు

ఆధ్యాత్మికత యొక్క సుస్పష్టమైన రూపాన్ని అర్ధం చేసుకున్న రూపాన్నిఇతరులకు అందించేటటువంటి ప్రక్రియ. మృత్యువు తర్వాత మన జీవితాలు ఏమవుతాయి అనేటటువంటి అవగాహనా తో జీవించే వ్యక్తి ధర్మానికి దగ్గరవుతాడు. అనుభూతిలోకి రానంతవరకు అది తెలిసినవాళ్ళు ఏం చెప్తే అది చేస్తాము.

మే

020599 మహా యోగేశ్వరీ దేవి అవతరణ - మంత్ర, యంత్ర & స్వరూపము

మహా యోగేశ్వరీ దేవి మనకు ఏడు యోగాలను నేర్పిస్తుంది. మొదటి యోగము - స్థూలము - సూక్ష్మము, రెండవది - కామము , మనస్సు, మూడవది - సరూప మనస్సు, అరూపా మనస్సు, నాల్గవది - స్థూల, కామ, మనస్సు బుధ్ధితో యోగముచెయ్యాలి. దానికి గాయత్రీ మంత్రము కావాలి, ఇవన్నీ మనము హ్రీం , శ్రీం, క్లీం తో చేస్తున్నాము. హ్రీం శ్రీం క్లీం సరూపా మనస్సులోనే ఉన్నాయి, క్లీం - కాలాన్ని సద్వినియోగము చేసుకుంటున్నాము, శ్రీం - వనరులను సద్వినియోగము చేసుకుంటున్నాము, హ్రీం - పరిణామ క్రమములో మనం ఉన్న స్ధితిని అర్ధంచేసుకునే ప్రయత్నము చేస్తున్నాము. ఇది అంతా దాటి బుధ్ధి లోకి అంటె ధియోయోనహ: ప్రచోదయాత్. ఆత్మ, అనుపాదక ఆది యోగాలలోకి ప్రవేశించటానికి మహాయోగేశ్వరీదేవి ఆయుధాలు, ముఖములు , శక్తులు ఉపయోగపడతాయి. అనుగ్రహమాలా మంత్రము ఆ మహాయోగేశ్వరీ స్వరూపముగా గుర్తించి జపించండి. ముందుగా ఋషులు ఏ దేవతనైనా దర్శించటానికి ఆత్మతలములోనుండి దర్శించి అందిస్తారు, అక్కడ విశుధ్ధి చక్రాన్ని ( అనగా ఆత్మతలము - సత్యము - వాక్కు సత్యము) వాడుకుంటారు. వాక్కు రూపములో మంత్రాన్ని అందిస్తారు. ఆ యోగ స్వరూపము సరూపా మనస్సులో మహాకాల చక్రవర్తీ యంత్రముగా రూపొందింది. అనుగ్రహ మాలా మంత్రము, మహాయోగ్వ్శ్వరీ దేవతను, మహాకాల చక్రవర్తీ యంత్రాన్ని కలిపి మీరు చేసుకుంటే స్థూల తలమునుండి ఆత్మ తలానికి మనము అతి తేలికగా చేరుకుంటాము. మంత్రము, యంత్రము స్వరూపము మూడూ గుర్తుంచుకోవాలి. ఆత్మ తలములో మంత్రము,

150599 కాకివాయి ఆశ్రమ కార్యక్రమాలు - మహాకాల చక్రవర్తీ యంత్రము

మహాకాల చక్రవర్తీ యంత్రము - ఆత్మ రాజ్యస్థాపన ఏ రెండు లక్షాలను గుర్తు పెట్తుకుని ఆశ్రమవాసులు పనిచెయ్యాలి. మీరు ఆ మహాకలచక్రవర్తీ ప్రతినిధులు.

150599 నా లక్ష్యము నా సందేశము

నేను ఏ ఆశ్రమానికి కట్టుబడి ఉండను, నాకు అంటూ కొన్ని ప్రత్యేక లక్ష్యాలు ఉన్నాయి, నేను వాటికోసము పనిచేస్తాను. మీరు నన్ను కాదు మీ లక్ష్యాలను పట్టుకోండి. నన్ను గుర్తించగలను అనే అపోహలో ఉండవద్దు, మీరు నన్ను గుర్తించలేరు, కానీ నా లక్ష్యాలను గుర్తించి పని చేస్తే నేను సంతోషిస్తాము

150599 కాకివాయి ఆశ్రమ నిర్మాణము

ఒక ఉడుత రామ కార్యానికి ఉపయోగపడినట్టు మనము గురు ప్రణాళికలో భాగస్వామ్యము వహించాలి. మౌనము యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. కాకివాయి ఆశ్రమనిర్మాణవివరములు కార్యకర్తలతో చర్చ.

150599 కాకివాయి - స్మర్తుగామి సిధ్ధక్షేత్రము

కాకివాయి - స్మర్తుగామి సిధ్ధక్షేత్రములో . అగ్ని దూతంపురోధధే - మన కోరికలను దేవతలకు అందచేసే అగ్నిని ఇక్కడ స్థాపింఛాను. మీరు ఏ దేవతకి , ఏ గురువుకి ఏమి చెప్పుకోవాలనుకున్నా ఈ శ్రీ హంసరామ ఆశ్రమములో , స్మర్తుగామి సిధక్షేత్రములో ఉన్న అగ్నికి చెప్పుకొండి. ఆయన తక్షణమే మీ కోరికను ఎవరికి తెలియచేయదలుచుకున్నరో వారికి చెప్పి దాని ఫలితాన్ని మరల మీకు అందేలా చేస్తాడూ.

జూన్

030699 పురుష సూక్తము - ఆహారము

తైత్తరీయ ఉపనిషత్ ఆనందవల్లీలో 7 వ శ్లోకము - "అన్నం న నింద్యాత్" - అన్నాన్ని మనము నిందించకూడదు. యదన్నేనా తొరోహతి. ఆ అన్నమే మనల్ని అమరత్వము వైపుకు తీసుకొని వెళ్తోంది. అన్నము ఎవరు అప్పుడు ఎక్కడ పెట్టినా కాదనకూడదు. ఆహారాము వడ్డించటానికి ముందుగానే వచ్చి భోజనానికి కూర్చోవాలి.

040699 పురుష సూక్తము

పురుష సూక్తముతో పురుషుడి యొక్క ఆవాహన చేస్తున్నాము, ఆవాహన చేసినప్పుడూ మనలో ఉన్న పురుషుడ్ని ఆవాహన చేసుకోవాలి కానీ బయట మీరు ఏమి చేసినా ఉపయోగములేదు. మనలో ఉన్న 6 చక్రములను అధిగమించి ఉన్న ఆ సహస్రార చక్రములోనికి నేను ప్రవేసించాలి. ఆ దేవతా శక్తి ఎప్పుడూ సహస్రార చక్రముకంటె కిందకి దిగదు, మనము ఆ స్ధితికి చేరాలి.

050699 పురుష సూక్తము

పురుష ఏ వేదగుం సర్వం - అన్నిటా ఉన్న ఆ చేతనత్వము, యద్భూతం యచ్చ భవ్యం- ఈ పురుషుడు భూత, భవిష్యత్ వర్తమానాలలో కూడా ఉన్నవాడు, ఉదామృతత్వశ్యేసానహ్ - అతను అమృతమూర్తిగనుక, చావుపుట్టుకలు లేనివాడు అంతటా వ్యాపించిఉన్నవాడుగనుక, యదన్నేనా తిరోహతి - ఆ అమృతత్వాన్ని మనము అన్నముద్వారా సాధిస్తాము అనే సత్యమును మనము జాగ్రత్తగా అర్ధము చేసుకోవాలి.

060699 పురుష సూక్తము

ఈ సృష్టి అంతా ఒక చక్రీయ గమనముపై ఆధారపడి నడుస్తోంది. ఈ చక్రీయ గమనాన్ని మనము యజ్ఞము అంటాము. పురుషేణ హవిషా - ఆ పురుషుడ్నే హవిస్సుగా దేవతలు సమర్పించారు. మన శరీరములో ఆద్యమునకు దగ్గరగా అనగా నెయ్యి గా పని చేసేవి మన ఆలోచనలు. మనయొక ఆలోచనలే రూపుదాలుస్తాయి. అదే ఆద్యము.

070699 పురుష సూక్తము

ప్రతి దేవాలయానికి ఒక స్థాన దేవత ఉంటుంది, సప్తర్షి ఆశ్రమానికి వచ్చేవారు వేణుగోపాల స్వామి వద్ద పెర్మిషన్ తీస్కొని రావాలి. అది చాలా ముఖ్యము. తిరుపతికి వెళ్ళినవారు ముందుగా వరదరాజస్వామిని దర్శించుకున్నట్టే సప్తర్షి ఆశ్రమము గుంటూరుకు వచ్చేవారు వేణుగోపాల స్వామిని దర్శించుకోవాలి.

080699 పురుష సూక్తము

పృధ్వీ అనే విశ్వవిద్యాలయములో నీలి రంగు ఉంటే అది ఆ విద్య ఏమిటి అనేది కృష్ణచేతనత్వము నేర్పింది. మానవులు ఎరుపు, కాషాయము, పసుపు మాత్రమే వాడుకోవటం వచ్చు. కాషాయ రంగును భారతీయులు స్పెషలైజ్ చేసారు. కాషాయరంగు అంటె యజ్ఞమయ జీవనము.

090699 పురుష సూక్తము

త్రయీ విద్య - ఋగ్వేదములోనుండి యజుర్వేదము, యజుర్వేదములో నుండి సామవేదము, మళ్ళీ సామవేదములో నుండీ ఋగ్వేదము ఈ చక్రీయగమనమును అర్ధము చేసుకోవాలి.

170699 మంత్ర పుష్పము

సకలైశ్వర్యాలతో భారతదేశము తులతూగడానికి కారణము ఓంకారము. జాగృత, స్వప్న సుషుప్తావస్థలకి అతీతం గా ఉన్నటువంటి దాన్ని మీరు పిలుస్తున్నారు ఆ ఆర్తి తెచ్చుకోవాలి .అదే సంపూర్ణ సృష్టిని నడిపిస్తోంది. మంత్ర పుష్పము మన యొక్క షట్చక్రాల గురించి చెప్తుంది. అందుకే దేవాలయాలలో అది చేస్తాము

170699 మంత్ర పుష్పము

ఓంకారము మొత్తము ప్రపంచానికి సిలబస్, ఆ మూడు అక్షరాలు మీరు అర్ధం చేసుకుంటే చాలు మీరు సర్వజ్ఞత్వము, సర్వ వ్యాపకత్వము సర్వాంతర్యామిత్వము వస్తుంది.

180699 మంత్ర పుష్పము

ఈ విద్యను మీరు నేర్చుకోవటానికి ౩ పదాలని బాగా అవగాహన చేసుకోవాలి ఉపాసన, సాధన, ఆరాధన. ఉపాసన అంటే ఏం నేర్చుకోబోతున్నామో దాన్ని గురించి అవగాహన వుండాలి. ఉపాసన చేయటానికి నువ్వు దగ్గరిగా నిశ్చింతగా కూర్చోవాలి. మన శరీరాన్ని మన మనస్సుని ఆ అఖండ గురుసత్తాకి సమర్పణ చేసుకోవాలి. ఈ ఓం కారము మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది

190699 మంత్ర పుష్పము

మంత్రజపాన్ని పెంచుకోవాలి, యజ్ఞ విధానంలో ఆఅగ్నిని ఉపాసించుకోవాలి ఓంకారం చెప్పగానే ఎలా అయితే మార్పు గమనిస్తారో అలానే యజ్ఞము దగ్గర కూర్చోగానే మీ యొక్క చేతనత్వములో మార్పు రావాలి.

200699 మంత్ర పుష్పము

ఆకాశం ఎక్కడ వుంది లోపల వుంది బయట వుంది."అనతమవ్యగుం మాకులం.." ఆకాశాతత్వము మనలో ఒకబింధువు దగ్గర నుంచి ప్రారంభమవుతుంది మన హృదయంలో దానే పేస్మేకర్ అంటాము. అది సంపూర్ణ జీవిత విధానాన్ని శాశిస్తుంది ఎంత అధ్బుతంగా మంత్రపుష్పం లో ఈ శ్లోకం లో మన శరీరం లో హృదయం గురించి చెప్తున్నారో చూడండి

220699 మంత్ర పుష్పము

పుష్పము లో మొట్టమొదట వుండేది సువాసన - ములధారము, పుష్పం లో మధువు వుంటుంది - స్వాదిష్టానము , దళాలు, రంగులు, ఆకారము - మణిపూరకము, ప్రతి పుష్పము కూడా చాలా మృదుత్వము వుంటుంది ఆ స్పర్శ - అనాహతము. ప్రతి పుష్పానికి పేరు వుంటుంది - విశుద్ధి. ప్రతి ప్రుష్పము ఏదో ఒక ఆనందాన్ని కలుగ చేస్తుంది - ఆజ్ఞ . పుష్పాల యొక్క ఈ లక్షణాలనిటిని తీసుకుని మంత్ర పుష్పము అంటాము.

జూలై

180799 కార్యకర్తలకు పిలుపు

గురుప్రణాళీకలో భాగస్వామ్యానికి అందరికీ ఇదే అహ్వానము. ఆ ఆత్మరాజ్య స్థాపన మనలో జరిగి మనము దేవ మానవులుగా మరి పృధ్విని స్వర్గంగా మార్చే ప్రాణాళిక, నియమాలు వివరించారు

ఆగస్ట్

020899నిరంతర గురు ధ్యానము

ఆధ్యాత్మికత సత్యాల గురుంచి చెప్పే విద్య, మతాల గురుంచి కాదు. ఋణానుబంధ రూపేణా పశు పత్నీ శుతాలయ అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ గురువు కూడా అర్హతకు మించిన ఫలితాలు ఇవ్వలేడు. అర్హత, పాత్రత పెంచుకోవటము మన చేతిలో ఉంది.ఆధ్యాత్మీక విద్య అంతా ఒక చిన్న ట్రిఖ్ మీద ఆధారపడి ఉంది, అది అహంకారము లేని స్ధితి .

030998 గాయత్రీ గీత మరియు స్మృతి

వామ పక్షానికి సంబంధిచిన తాంత్రిక శక్తి సావిత్రీ, జ్ఞాన పక్షానికి సంబంధిచిన శక్తి గాయత్రీ. మొదటి 8 అక్షరాలు స్థూల జగత్తులో మన జీవితము ఏ విధముగా ఉండాలి అనేది వివరిస్తుంది.

050998 గాయత్రీ హృదయం మౌనం

గాయత్రీ హృదయాన్ని హృదయంగమము చేసుకోండి, గాయత్రీ కవచము, గాయత్రీ మంత్రము వీటిని మంత్రాలు అని అనుకోకండి, ఇవి విశ్వామిత్ర చేతనత్వాన్ని ఇచ్చే శక్తి కలిగిన ఫార్ములాలు. అనంతమైన చేతనత్వములో ఉన్న బిందువు ఋషి. ఆ విశ్వామిత్రత్వము, మూడు లోకాలకు ఆధిపత్యాన్ని ఇచ్చే శక్తికి మీరు అర్హులు అవుతారు.

050998 సంధ్యా వందన విధానము

సంధ్యా వందన విధానమును వివరిస్తూ, విధి విధానాన్ని చేయించారు.

060899 మహా కాల చక్రవర్తీ యంత్రము

24 గంటలలో మన శ్వాస 21,600 సార్లు మన శరీరములో ఉన్న చక్రాలలో, గ్రహాలలో తిరుగుతూ ఉంటుంది. మహా కాల చక్రవర్తీ యంత్రములో మధ్య బొందువు లొ సూర్యుడు ఉంటాడు, దాని బయట ఉన్న అష్ట దళ పద్మములో 8 గ్రహాలు, మధ్యలొ ఉన్న సూర్యుడితో కలిపి 9 గ్రహాలు ఉన్నాయి, మన శరీరములో కూడా ఈ గ్రహాలు ఉన్నాయి, రాహువు కేతువు కూడా ఉన్నాయి. రాహువు కేతువులలో కూడా మన శ్వాస స్పందనలు గమనించగలిగితే మనము అమృతత్వాన్ని పొందుతాము. రాక్షసులు అయినప్పటికీ రాహు కేతువులు అమృతత్వాన్ని పొందారు. మహాకాల యంత్రాన్ని మీరు ధ్యానించండి.

080899 మహా కాల చక్రవర్తీ యంత్ర ధ్యానము

కాలము యొక్క చక్రీయగమనముపై ఎవరికి కమాండ్ ఉందో వాళ్ళు మహా కాల చక్రవర్తులు. 432 అనే అంకెలు చాలా ముఖ్యము, ఈ అంకెలు మీరు ఉపయోగించుకోవటము నేర్చుకుంటారో వాళ్ళూ స్వరాజ్యము యొక్క అధినేతలు అవుతారు. ఒక మనిషికి తప్ప ఇక ఏ ప్రాణీకి కూడా అడ్మినిస్టేషన్ అవసరము లేదు, చతుర్దశ భువనాలు చక్రవర్తిత్వము పొందుతున్నాయి - అ చక్రములో వర్తిస్తున్నాయి.

110899 సూర్య గ్రహణ సాధన

మన శరీరమే దేవాలయము, దాంట్లో ఆ అఖండ గురుసత్తా యొక్క అద్భుత విన్యాసము యోగమాయ శక్తి తో జరుగుతూవుంటుంది.నిరంతరము నేను ఆత్మని అనేది గ్రహించాలి.

130899 వేదాలు ప్రకృతి నియమాలు

సృష్ఠి స్ధితి లయ - మూడింటిని తెలిసిన వ్యక్తినే మనము గురువు అంటాము. మానవ శరీరములో లేనటువంటిది ఏదీ ప్రకృతిలో ఉండదు.

230899 ఆత్మ రాజ్య స్థాపన

"సమస్త శక్తులు మానవ శరీరంలొ ఉన్నాయి. విత్తనాలలొ ప్రతి విత్తనము చెట్టు కాగలదు. మనం సర్వ శక్తి వంతులమె. మనం కృషి చేసి ఆ శక్తులను బయటకి తీసుకురావాలి. ప్రయత్నిస్తె ఏ విద్య అయిన వస్తుంది. అలాగే ఆధ్యాత్మిక విద్య కోసం ప్రయత్నం చేస్తె తప్పకుండ వస్తుంది. "

310899 గాయత్రీ స్మృతి

" స్త్రీకి అద్భుతమయిన నిర్మాణాత్మక శక్తి ఉంది. ఎలా కావాలంటె అలా బిడ్డను గర్భంలోనె నిర్మించగలదు. కాని స్త్రీకి అటువంటి మానసిక స్థితి ఉండాలి. ప్రహ్లాదుడు, అభిమన్యుడు తల్లి గర్బంలోనె అంతా నేర్చుకున్నారు. . గాయత్రి మంత్రంలొ 'వ' అనె అక్షరం ఇది చెపుతుంది. పురుషలలొ ఆలోచనల నిర్మాణము జరుగుతుంది. "

150899 సకల సమర్ధ సద్గురు స్పర్శ -1

మహాకాల యొక్క అగ్నిని తెలుసుకుంటూ ప్రకృతికి అనుగుణ్యం గా జీవించటం.మౌనం లో ఎపుడైతే ఆ సమర్ధ సద్గురువుని తలుచుకుంటారో ఆ స్పర్శని అనుభూతి చెందాలి. ఆ స్పర్శ మన జీవితాలని వ్యవస్తీకరణ చేస్తుంది.

150899 సకల సమర్ధ సద్గురు స్పర్శ -II

మన శరీరములోని కణ కణములో అనుభూతి చెందగలిగితే ఆ గురువు యొక్క స్పర్శ మనకు లభించినట్లే.గురువు యొక్క స్పర్శను మౌనంలోనే పట్టుకోగలము

300899 ఎస్ ఎస్ ఎస్ సాధన

భువి పై స్వర్గావతరణ అంటే మనుషులు దేవతలుగా మారాలి.మనల్ని మనం అర్ధం చేసుకోవడానికి ఈ ఓం –సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము ఉపయోగపడుతుంది.జ్ఞానము అదే టెక్నిక్ కూడా అదే.

310899 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

భూమి మీద స్వర్గావతరణకి మొదటి మెట్టు ముందు మీలో ఉన్న దైవీ లక్షణాలు అభివృధ్ధి చెందాలి. యతీనాం బ్రహ్మ భవతి సారధి. ఆ రధ సార్దధి పర్యవేక్షణలో మనము మన జీవితాలు కొనసాగించాలి. యోగస్థ కురు కర్మాణి - యోగ స్ధితిలో ఉండి కర్మలు చెయ్యి, స్వలాభాపేక్ష లేకుండా కర్మ చెయ్యలి. ఇంద్రియాలకు సుఖమునకు సంబంధించిన కోరిక ఉన్నది మనకి అంటె మనము యోగ మార్గములో లేము అని అర్ధము చేసుకోండి.

సెప్టెంబర్

010999 భూమిపై స్వర్గావతరణ

భూమిపై స్వర్గావతరణ వేద సంస్కృతి పునర్జాగరణ శాంతి, సుఖము అష్ట ఐశ్వర్యములతో కూడిన జీవితము ప్రతిమనిషికి అది లక్ష్యము. స్వ ఆత్మ రాజ్య స్థాపన - మారవలిసినది నువ్వు ఈ గవర్నమెంట్ నిన్ను మార్చలేదు కేవలము నియమాలు ఏర్పరచుకోవడం వల్లే జరుగుతుంది అనుకుంటే అసలు బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించేది కాదు. ఆ అనంత జ్ఞానాని మనము మర్చిపోయాము.

010999 భూమిపై స్వర్గావతరణ

మవజాతి భవితవ్యతకు చేయవలిసిన అతి సింపుల్ టెక్నిక్ ఓం కారము 21 సార్లు చేయాలి, ఎందుకు మన షట్చక్రాలలో వున్న మాలిన్యాలు పోవడం కోసం . భువిపైస్వర్గావతరణ అంటే మనం అమరులుగా మారటము. మన శరీరము ఓం కారానికి అనుగుణ్యంగా మారాలి.

120999 వినాయక నవరాత్రులు ఉపాసన

మనకి ఉన్న పరిస్ధితులు పరమాత్మయొక్క వరదానమే, ప్రతి పరిస్ధితి సంతోషమే, గమ్యము తెలిసిన వ్యక్తికి ఎప్పుడూ ఉత్సహము ఉంటుంది, నిరంతరము ఆశ, ప్రకృతి యొక్క నియమాల మీద ఆశ, ఈ పరిస్ధితులు సంతోషంగా భావిస్తే, ఈ పరిస్ధితిలో నేను ఉత్సాహముగా ఉంటేhttp://www.awgpsouth.org/audio_t. . సాధన చేస్తున్న సమయములో కాదు ప్రతి క్షణం సాధకుడూ ఈ నాలుగు మానసిక స్ధితిలను కలిగి ఉండాలి.

180999 పతంజలి యోగసూత్రములు

తత్ర స్ధితే యత్నో అభ్యాసహ: - ఏది నేర్చుకోవాలన్నా ప్రాక్టీస్ కావాలి, తత్వమసిhttp://www.awgpsouth.org/audio_tనేను అది అనేదాన్ని మాటి మాటికి గుర్తుచేసుకోవలను.క్లేశ కర్మ విపాకాశియైర అపరామృష్ట: పురుషవిశేషహ: ఈశ్వరహ: కు వివరణ.

180999 పతంజలి యోగ సూత్రములు

క్లేశ కర్మ విపాక ఆశయి అపరామృష్ఠ: పురుష విశేషహ: ఈశ్వర:
క్లేశములు - సత్వగుణముతో అధిగమించాలి, కర్మ విపాకము - పూర్వ జన్మలల్లో చేసినవో ఇప్పుడు చేసినవో అన్నీ కర్మలు వస్తూ ఉంటాయి, వాటిని అంటకుండా జీవించటమే యోగవిద్య మనకు నేర్పిస్తుంది.

190999 సమర్ధసద్గురు స్పర్శ ధ్యానము &సౌందర్య లహరి

సాధకుడు నిరంతరము అత్యుత స్ధితిలో ఉండాలి, బాహ్యజగత్తుళొ మీకు ఉన్న భయంకరమైన పరిస్ధితులు అన్నీ మీ నమ్మకాన్ని మరింత పటిష్ఠము చేసేందుకే అని గుర్తించండి.

190999 పతంజలి యోగసూత్రములు

పూర్వేషామపి గురు: కాలేనాచక: అనవచ్హేదాత్, తస్య వాచక: ప్రణవ: ,

260999 పతంజలి యోగసూత్రములు

వితర్క, విచార ఆనంద అస్మిత, అసంప్రజ్ఞాత:. అభావ, ప్రత్యయ ఆలంబనా వృత్తి నిద్రా.

190999 సౌందర్య లహరి

అఖండ మండలాకారములో కంటిన్యుయాస్ కనెక్షన్ వుంటుంది. ఈ విధమైనటువంటి జ్ఞానము ఓంకారము ఆ స్థితిలోనే వుంటూ పనులన్నీ చేసుకునేటటువంటి టెక్నిక్ తెలుసుకోవాలి

130999 వినాయక చవితి

మన మణిపూరక చక్రము నుంచి అగ్ని దీక్ష తీసుకోవాలి. ఒక చిన్న కణము నుంచి ఈ సంపూర్ణ సృష్టి సెకండ్ కి 18 కిలోమీటర్లు విప్పారుతుంది. శబ్ద బ్రహ్మకి నువ్వు లొంగితే వేదము యొక్క శబ్దానికి నువ్వు లొంగితే, ది ఫైనల్ వర్డ్. దృష్టి అక్కడ వుంటే చాలు.

అక్టోబరు

151099 చండీ కవచము అమృతత్వ సాధన

ఓం కారము నుంచి ౩ భాగాలూ ఏర్పడతాయి హ్రీం శ్రీం క్లీం. క్లీం మహాకాళిగా శ్రీం మహలక్ష్మి గా హ్రీం మహా సరస్వతి గా భావిస్తాము. మహాసరస్వతి చరిత్ర దుర్గాసప్తశతి లో మన బ్రెయిన్ యొక్క వర్ణనే.

141099 బర్త్ డే స్పీచ్

ఆ మౌన స్వరూపి అయిన గురువుకి నమస్కరిస్తూ ఆ శబ్ద స్వరూపాని గుర్తుచేసుకుందాం జగద్గురువుగా జగజ్జనన్నిగా. ఈ సంపూర్ణ సృష్టి ఉద్బవిస్తూవుంటుంది లయమవుతూ వుంటుంది.మ్ ఆ శాంత స్థితి . దీని నుంచి ప్రతి మానవుడు తనకు కావలిసినది తీసుకుంటూవుంటాడు. ఒక్క సంవత్సర కాలం లో భూమి మీద ఏ ప్రాణిగా పుట్టిన ఆ ప్రాణి యొక్క పరిణామక్రమము ఏంటి అనేది మానవుడు మాత్రమే తెలుసుకొనగలడు

201099 పదము పదార్ధముగా మారటము ఎలా ?

పదము పదార్ధముగా మారటము ఎలా ? జాగృతావస్థలో మనము ఏది కావాలన్నా ఏలా ఐతే వివరించి చెప్పి చెయ్యగలమో అలాగే స్వప్నావస్థలో కూడా చెయ్యగలగటమే యోగ విద్య.

241099 కాల చక్ర భ్రమణములో పదము పదార్ధముగా మారుట

కాల చక్ర భ్రమణములో పదము పదార్ధముగా మారుట - మంత్రజపములోని చక్రీయ భ్రమణాన్ని అర్ధము చేసుకుంటే ( జప మాల) ఆ మంత్రాధి దేవత మీకు సాక్షాత్కరిస్తుంది. మంత్రము యొక్క శబ్ధము పదార్ధముగా మారుతుంది. కాబట్టి మంత్రము ఆ దేవత యొక్క రూపమే. మీలో కూడా ప్రతి ఒక్కరికీ ఒక శబ్ధము ఉంది, ఉంటేనే మీకు రూపము ఏర్పడింది. అది లేకుండా మీకు రూపము ఏర్పడదు కదా! మంత దీక్షలో గురువులు ఆ శబ్ధాన్ని మీకు ఇస్తారు. సావర్ణిక మన్వంతరములో ఎడ్యుకేషన్ సిస్టం యొక్క ప్రధాని జ్వాలాకూల్ మహర్షి. ఈ శబ్ధ విజ్ఞానము నేను ఆయన రాసిన A Treatis On Cosmic Fire అనే పుస్తకాన్నుండి ఇస్తున్నాను.

201099 భగవద్గీత - స్వప్నములు

జాగృతావస్థలో మనము చేసే మంత్ర జపము ధ్యానములు మన సబ్ కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతుంది, అది స్వాప్నిక జగత్తులో పని చేస్తుంది. " యుక్తాహర విహారస్య యుక్త చేష్ఠశ్య కర్మసు, యుక్త స్వప్నావబోధశ్య http://www.awgpsouth.org/audio_t" ఆహరము

261099 సంకల్పము జ్ఞానము క్రియా శక్తి

ప్రేమ,సేవ,సంకల్పం –ఈ మూడు ఏ శరీరం పొందడాన్నికైన ఆధారం. ప్రేమ ఎక్కువ వునవాళ్ళు జ్ఞానము వైపుకు వెళ్తారు, ప్రేమ ఎక్కడవుంటుందో అక్కడ సేవ ఎక్కువ వుంటుంది.అంచేత ఆ మౌన స్థితి అఖండమండలాకారమైనటువంటి గురువు యొక్క స్థితిలో వుండాలి

261099 గురువులు ఋణానుబంధము

సూర్యుడుకి చంద్రుడికి మద్య కోణాలే సృష్టికి కారణము. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో ఎవరైతే మౌనంగా కూర్చుంటారో వాళ్ళందరికీ గురువులతో ఋణానుబంధం పెరిగిపోతుంది, అప్పుడు రోగనివారన,ఋణానుబంధం,అన్ని దేవతల యొక్కవరదానం కూడా లభిస్తాయి.కాన్ని అక్కడ నుంచి వచ్చాక వాళ్ళు పనులు చేయడం మొదలుపెట్టాలి.

261099 మహా కాల చక్రవర్తీ సామ్రాజ్య స్థాపన

మీ శరీరాన్ని మీరు అర్ధము చేస్కొనగలిగితే , స్వ-అద్యయనము చేస్కొనగలిగితే కాల చక్రభ్రమణమును ఆపగలరు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి

261099 సంకల్పము జ్ఞానము మహాకాల యంత్రము

ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ జ్ఞానము ఉంటుంది. పిల్లలకి జన్మని ఇవ్వకముందు స్త్రీకి పిల్లల పెంపకముపై ఎటువంటి అవగాహనా ఉండదు, కానీ పుట్టంగానే అన్ని విషయాలు పెద్దవాళ్ళని అడిగి కానీ చదివి కానీ తెలుసుకుని మరీ తన పిల్లవాడి మీద ఉన్న ప్రేమతో వాళ్ళకి అత్యుత్తమైన సౌకర్యాలను ఇవ్వటం నేర్చుకుంటుంది. ఎక్కడ ప్రేమ ఉంతూందో అక్కడ జ్ఞానము దానంతట అదే వస్తుంది.

291099 Padamu-padarhamu and sariramu vedamulu

ఒక వ్యక్తిని చూస్తే మనము వేదమును చూస్తున్నాము అని గుర్తుంచుకోవాలి, ఇది అక్షర సత్యము. మీ బ్రైన్ లో నాలుగు భాగాలు నాలుగు వేదాలుగా ఉన్నాయి. అన్ని నియమాలు ఉన్నాయి ప్రకృతిలో. వాటికి మీరు శబ్ధ రూపాన్ని ఇస్తున్నారు.

నవంబర్

011199 పరివ్రాజకుల శిక్షణ - యజ్ఞ ప్రాముఖ్యత

మన అంత:కరణాలలో 4 రకాల కోరికలు ఏర్పడతాయి. మనస్సులో, బుధ్ధిలో,అహంకారములో & చిత్తములో. బుధ్ధిని ప్రచోదన చేసేందుకు గురువు ధుని ఉపయోగించుకుంటారు. గురుసత్తాను అర్ధంచేసుకోగలిగితే ప్రవ్రాజకుల సగం పని ఐనట్లే.

011199 పరివ్రాజకుల శిక్షణ -గురుసత్తా ప్రాముఖ్యత

పరివ్రాజకుల స్ధితి అంటే నిత్య నూతన శాశ్వత సనాతన ధర్మాలను ఆచరిస్తూ అందరికీ ఈ ధర్మాలను గురుంచి అందించే బాధ్యతను స్వయంగా స్వీకరించినవారు. ఋషుల అనుగ్రహము మనపై ప్రేమ అనిర్వచనీయమైనది, అందువల్ల యజ్ఞవిద్యను దాని రహస్యాలను మనకు అందించారు.

071199 దీపావళి మెస్సేజ్

ఈ గురుచేతనత్వ పరంపర లో సులభమైన మార్గము అవగాహనా చేసుకోండి. నేను ఎక్కడ వున్నానో అక్కడ గురువు యొక్క అనుగ్రహము వలనే వున్నాను అనేటటువంటి భావాన్ని పటిష్టం చేసుకుని నిరంతర మౌనములో ఉండగలిగితే మీరు గురువులే, ఇదే సులభమైనటువంటి మార్గము. నిరంతరమూ మౌనము .శూన్యము , అమావాస్య చీకటి ఆ కంప్లీట్ డార్కనెస్ వచ్చినప్పుడు జ్యోతులు వెలుగుతాయి ఆ జ్యోతి ని వెలిగించటమే ఈ దీపావళి యొక్క ఉదేశ్యము

161199 ధ్యానము

ఈ గురుచేతనత్వము బ్రహ్మవిద్య భారతదేశము యొక్క ఆధ్యాత్మిక వారసత్వము అర్ధం చేసుకోవటానికి ఒకే ఒక్క పనిముట్టు వుంది . దానినే సమర్ధ సద్గురు స్పర్శ అంటాము. ఏదైనా ఒక్క విద్య మీరు ఉపయోగించుకోవాలి అంటే దానికి ఖచ్చితమైన పనిముట్లు కావాలి.

031199 ఋణానుబంధము గృహస్థాశ్రమము

గురువుల జీవితాలు చదివితే వారి సందేశము ఏమిటో మనకు అర్ధము అవుతుంది. మనుషులు ఎంత దిగజారారు అంటే గురువుల వద్దకు ఏ మంత్రులు ఏ సెలబ్రెటిశ్ వెళ్ళారూ అనేదాన్ని బట్టి ఆ గురువు స్థాయి నిర్ణయించే అతి నీచ మానసిక స్ధితికి దిగజారారు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్ర్హ్మ తత్వం - మౌనంలోకి వెళ్తేనే నిజమైన గురువుని పట్టుకోగలము అనే సత్యాన్ని అర్ధము చేసుకోండి.

081199 సర్వానందమయ చక్రము

అన్ని ఆనందాలకి కారణము శ్రీం ఆ బిందువు ఆ సర్వానందమయమే.ఆ బిందువు నాసికారంధ్రాలలోంచి కుండలిని శక్తి లోపలకి వెళ్ళింది ,మనము ఏది చేయాలనుకున్న ఇది వుండాలి.నేను అనేటటువంటి బిందువు మనలో జాగ్రుతమవ్వాలి.

161199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము - మన లక్ష్యములు

మన ఇంద్రియాల సామర్ధ్యమునకు దివ్య అనే ఒక్క పదము జోడిచంటము కోసము పని చెయ్యాలి. మనము తీసుకున్న ఆహారానికి తగ్గ పని మనము చేసినట్లే ధ్యానము చేసినవాళ్ళ జీవితము దానికి తగిన విధముగా మన జీవితములో మార్పు తెచ్చుకుని తీరవలసిందే.

181199 తంత్ర విద్య

same as 081199 సర్వానందమయ చక్రము

281199 సమర్ధ సద్గురు స్పర్శ ధ్యానము

క్లేశ కర్మ విపాకశయైర పరామృష్ఠ: పురుష విశేష: ఈశ్వర: - ఇది ఈశ్వరునికి డెఫినిషన్

301199 వాక్శక్తి ఉపయోగము

వాక్శక్తి ఉపయోగము - పరనింద పనికిరాదు, సాధకుడు తనని తాను పొగుడుకోకూడదు. ఇది వాక్శక్తి సంపాదించేందుకు ప్రధమ మెట్టు.

301199 విశ్వ ప్రణాళిక

భగవ్ద్గీత యొక్క మొత్తము సారము ముందు మీకు ఏది తెలుసో అది పరిపూర్ణముగా చెయ్యాలి. ఆధ్యత్మిక జగత్తులో చేస్తూ ఉంటే మార్గదర్శనము లభిస్తూ ఉంటుంది. నాకు పూర్తిగా జ్ఞానము వచ్చేవరకు పని మొదలుపెట్టము అనే మూర్ఖత్వాన్ని కార్యకర్తలు వదులుకోవాలి, గురువు చెప్పింది చేస్తే చాలు

డిసెంబర్

031299 Institution నుండి intuition కు

ప్రతి గురువు ఒక అలోచనా విధానమునకు మూర్తీభవించిన రూపము, ఏ గురువు దేనికి సంబంధించిన మూర్తి రూపము అనేది వాళ్ళ జీవిత చరిత్ర చదివితే మీకు అర్ధము అవుతుంది. స్కూళ్ళల్లో కాలేజీలలో మనము చదివే చదువు బయటినుండీ వస్తోంది, అధ్యాత్మిక సాధన వలన విద్య మీకు లోపలినుండీ వస్తుంది. విశ్వపరిణామ క్రమము చాలా స్పీడ్ తో ముందుకు వెడుతోంది, మీరు కూడా దానికి తగ్గ స్పీడ్ లో ముందుకు వెళ్తేనే మీరు ఈ పరిస్ధితులను తట్టుకోగలరు.

011299 సంధ్యావందనము

సంధ్యావందనము ద్వారా బ్రాహ్మీ, వైష్ణవీ శాంభవీ శక్తులను సాధకులు ఎలా ఉపయోగించుకోవాలి?

061299 గురు గీత

ద్వాపరయుగములో అందరికీ ఇచ్చా మృత్యువు ఉండేది. మార్గశిరమాసము అన్ని మాసములకు శిరస్సు వంటిది, సాధకులకు కావ్లసిన మార్గదర్శనము లభిస్తుంది. గురువుకుకి కృతజ్ఞత ఎలా తెలపాలి అనేది గురుగీత తెలియచేస్తుంది.

071299 దత్త శ్లోక అగ్ని

నమస్తే యోగి రాజేంద్ర దత్తత్రేయ దయానిధే స్మృతి దేహిమాం రక్షా భక్తితే దేహిమే ధృడాం.

061299 ఋణానుబంధము

ప్రపంచానికి ఆధునిక శాస్త్రవేత్తలు అందించినటువంటి అద్భుతమైన విజ్ఞానము వుంది. తల్లి తండ్రి గురువు మధ్య ఋణానుబంధం ఎలా పెంపొందించుకోవాలి,ఏ విధంగా గురువు తల్లి తండ్రి మరియు పిల్లల మధ్య సవ్యమైన ఋణానుబంధం పెంచుకుంటాడు?

061299 సమర్పణ

నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అనేటటువంటి వాగ్దానము మీ అంతరంగం లో వున్న వ్యక్తికి ఇవ్వాలి,గురువుతో ఋణానుబంధం పెంచుకున్న వ్యక్తులందరు గురువుల్ని మించిపోయారు. పరిపూర్ణ సమర్పనే గురువు యొక్క అనుగ్రహానికి సూత్రము.

081299 కరిష్యే వచనం తవ

ఆధ్యాత్మిక జీవితము గురువుల జీవితము మనం ఎలా జీవించాలి అనేది ఈ మార్గశిర మాసం లొ నేర్చుకోవాలి. అలా చేస్తున్నప్పుడు కష్టాలే గురువుల అనుగ్రహము అని గుర్తించాలి.

091299 మండ్యూక ఉపనిషత్ శాంతి మంత్రము

ఋషి చేతనత్వములోకి గురువుల చేతనత్వము లోకి తేలికగా ప్రవేశించే మార్గము ఉపనిషత్ . ఇది అధర్వణ వేదానికి సంబందించిన్నది.ఇది మండ్యూక అనే చేతనత్వానికి సంబంధించింది. 33 దేవతా శక్తులని మనము, మాకు ఏది జరిగినా అది మన మంచికే, ప్రతి పనికిరానిది పనికివచ్చేదానికి బలము అనేటటువంటి మానసిక స్థితిని ఇవ్వమని ప్రాదిస్తున్నాము.

101299 మాండ్యూకోపనిషద్- Master & their Time periods

కాలము అనేది ఎవరి పరిణామ క్రమాన్ని బట్టి వారికి ఉంటుంది అని తెలుసుకోండి. మన అఖండ గురుసత్తాలో ఉన్న గురు పరంపర అద్భుతమైన గురు పరంపర అని తెలుసుకోండి. మాస్టర్ సి వి వి అమరత్వముయొక్క సందేశాన్ని హెలీస్ తోక చుక్క నుంచి, ఇతర లోకాల నుంచి వచ్చిన సాధనా విశేషాలను మనకు అందించారు. లాహిరీ మాహాశయులుకు ఇది ద్వాపర యుగము, పండిత శ్రీ రామ శర్మ ఆచార్య - సత్య యుగము, ఇల్ల ఒక్కొక్క గురువు ఎక్కువ తక్కువ కాదు వారి సాధనను బట్టి వారు ఏ యుగములో జీవించారు అనేది మీరు అర్ధము చేసుకోవాలి. కాలాతీత స్ధితి నేర్చుకోండి.

111299 మాండ్యూకోపనిషద్ - 6th Slokas1

మాండ్యూకోపనిషద్ - 6th Slokas1

111299 మాండ్యూకోపనిషద్ - 6th Sloka 2

మాండ్యూకోపనిషద్ - 6th Sloka 2

111299 విశ్వప్రణాళికలో భాగస్వామ్యం

రోజూ నాలుగు గంటలు విశ్వప్రణాళికలో భాగస్వామ్యం పొందేందుకు మీకు నచ్చిన పనిని ఎన్నుకుని ఆ పనిని శ్రధ్ధగా చెయ్యండి. మీరు అఖండ గురుసత్తాలోని గురువుల అంత ఎదగలేకపోవచ్చు, కానీ కనీసం చిరుదివ్వెలలాగా అన్న మారండి. సాధన తప్పక చెయ్యాలి.

111299 మండ్యూక ఉపనిషత్

శబ్దాని ఉపయోగించుకునేవాడే “అయం ఆత్మ బ్రహ్మ:”, ఎవడైతే ఈ అనుభూతులని తెలుసుకున్తున్నాడో వాడే బ్రహ్మ అంటున్నాము ఇది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం లో వివిధ డైమన్షన్స్ వున్నాయి అవి ఓంకారం యొక్క భిన్న రూపాలే “ఓంకారం సోయం ఆత్మ చతుశ్పాడ్” 4 భాగాలుగా వుంటుంది. మీరు కూడా త్రిలోకసంచారులు కావటానికి మాండ్యూకోపనిషత్ అర్ధము చేసుకోవాలి.

111299 మండ్యూక ఉపనిషత్

అంత: ప్రజ్ఞ, బహిర్ ప్రజ్ఞ : అంత: ప్రజ్ఞ అనేదాన్ని ఎవరికి వారే అనుభవించగలరు. తేజసుడిలో ఉండే జ్ఞానాన్ని బహిర్ ప్రజ్ఞకు అందచేస్తున్నాము. అంత: ప్రజ్ఞను ఉపయోగించుకోవటము అత్యంత సులభము.

131299 మండ్యూక ఉపనిషత్

మనము రంగు, రూపము మార్చటానికి ఈ జగత్తులో చాలా కష్ఠము, కానీ తేజసుడి ప్రజ్ఞతో ఏ పరిస్ధితిని ఐనా క్షణ క్షణానికి మార్చుకోవచ్చు.

131299 మండ్యూక ఉపనిషత్

దైవీయ ప్రణాళిక వల్ల నాకు రాబోఏ కష్టాలు నాకు రాకు కాక, బౌతికమైన కష్టాలు, ప్రాకృతిక కస్ఠాలు అన్నీ తొలగిపోతాయి, ఈ శాంతి పాఠము ద్వారా

281299 దత్తాత్రేయుని ఆయుధాలు

దత్తాత్రేయుని ఆయుధాలు ఉపయోగించుకున్నప్పుడే సాధనమలో ముందుకు వెళ్ళగలము. దేవాలయములో దేవతలు పలకాలంటే మన శరీరము అనే దేవాలయము గురుంచి, దేవాలయమూలోని ఆయుధాలు ఎలా ఉపయోగించుకోవాలో ఆశ్రమాలలో తెలుసుకోవాలి.

281299 దేవాలయములు - అష్ఠవసువులు - శరీరము

దేవతా శక్తి ఒక్కటే, కానీ అది ఒకొక్క పరికరములో ఒకే కరెంటు ప్రవహిస్తున్నా ఒక్కో వస్తువులో విద్యుత్తు ఒక్కొక్కలా పని చేస్తుంది, భగవంతుడిలో మనలోను పని చేసే చేతనత్వము ఒక్కటే అని తెలుసుకుంటే మీరు తక్షణమే దేవతలుగా మారగలరు.

281299 దేవాలతల ఆయుధాల ఉపయోగము

ద్వాదశ రాసులలో 9 గ్రహాల యొక్క గమనము, 27 నక్షత్రాలు ఒక్కొక్కరాశిలో ఎలా ఉంటాయో, పంచాగము ఎలా ఉంటుందొ మీరు అర్ధము చేసుకుంటే 108 పూసల మాలను జపములో మీరు ఉపయోగించుకోగలుగుతారు.

281299 దేవాలయాలను ఎలా ఉపయోగించుకొవాలి?

అగ్ని అంటే సమ దృష్ఠి, నిజముగా పక్కడావాడు సుఖముగా ఉంటే ఆనందించే స్ధితి. పక్కవాడు ఆనందముగా ఉంటె మనము ఆనందముగా ఉండే స్ధితిని ఎప్పుడూ అలవరచుకోవాలి. కలశములో మనము జలము పెడతాము, జలము యొక్క తత్వము ఏది వేసినా అంకురింపచేస్తుంది. బీజాలు జలమువలననే అంకురిస్తాయి. మీలోని సుసంస్కారములు ప్రోదిచేసుకునేందుకు జల తత్వాన్ని ఉపయోగించుకోండి.