జనవరి

180195 సీక్రెట్ డాక్ట్రిన్ 1

శ్రీకృష్ణుడు శరీరం వదిలనప్పట్టి నుండి సత్రయాగం జరుగుతోంది హిమాలయాలలో. ఆ ప్రదేశాన్ని శంబల అంటారు. ఈ సత్రయాగం జరుగుతున్న చోట వాళ్ళు ఏమి చేస్తున్నారు అంటె ఎక్కడెక్కడ మానవజాతి అస్త్ర విధ్యని మర్చి పోయెటటువంటి పరిస్థితి ఏర్పడుతుందొ అక్కడక్కడ ఒక మహా పురుషుడిని పుట్టించి ఈ విధ్య నాశన మయిపోకుండ చూస్తు వచ్చారు.

190195 సీక్రెట్ డాక్ట్రిన్ 2

ఆధ్యాత్మిక జగత్తులో జాగృదావస్థ కంటే నిద్రావస్థకి చాల ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. జాగృదావస్థ,స్వప్నావస్థ,నిద్రావస్థ స్థూల,సూక్ష్మ,కారణ శరీరములు. స్థూల జగత్తులొ ఏ ఇంద్రియాలను ఉపయోగించుకొంటామొ సూక్ష్మ జగత్తులొ కూడా ఆ ఇంద్రియాలను ఉపయోగించు కుంటాము. జాగరుకత లేకుండ చేసె దాన్ని మాయ అంటారు. ఆ జాగరుకతను సాధించటమె మన లక్ష్యం.

200195 సీక్రెట్ డాక్ట్రిన్ 3

నిద్రావస్థలొ నాటినటువంటి సంస్కారాలె జాగృదావస్థలొ ప్రతిభగా కనిపిస్తుంది. సంస్కార పరంగా వ్యాదులు వస్తాయి కాని భౌతిక పరంగా కాదు. సంస్కారాలను సంకేత రూపం లొ పట్టుకోగలం తప్ప మామూలుగా పట్టుకోలేము. శరీరం వదిలేటప్పుడు చివరి క్షణం లో ఎవరు ఏ విధమయినటువంటి ఆలోచనలు చేస్తారొ వాళ్ళు ఆ విధమయినటువంటి స్థాయిని పొందుతారు.

220195 సీక్రెట్ డాక్ట్రిన్ 4

మనం ఆధ్యాత్మిక సాధన లొ దెబ్బ ఎక్కడ తిన్నామంటె ధ్యానం చేస్తూ ధ్యానం చెయ్యటం లేదు,జపం చేస్తూ జపం చెయ్యటం లేదు,యోగ సాధన చేస్తూ ఆ సాధన అంటె ఏంటొ imitation మాత్రమె చేస్తున్నాం తప్ప artificiality ఉంది తప్ప originality లేదు. సాధన చేస్తూ సాధన యొక్క ఫలితాలు రాన్నివండి . ఫలితాలు రాకుండ ఫలితాలు వచ్చినట్లు ప్రవర్తించటం అది అడ్డుతగులుతుంది.

210195 సీక్రెట్ డాక్ట్రిన్ 5

ధర్మము శాశ్వతంగా ఉండేది సనాతనంగా ఉండేది నిత్య నూతనంగా ఉండేది. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే నిద్రాస్థితిని ఉపయోగించుకోవాలి. ఆ నిద్రాస్థితిని ఉపయోగించుకోవటానికే ఒకానొక సంకేతాన్ని మనం ఉపయోగించుకుంటు ఉంటాము దాన్ని ఋషుల భాషలొ దేవాలయం అన్నారు,ఈజిప్ట్ భాష లొ పిరమిడ్ అన్నారు,మేథమెటిక్స్ భాషలొ నంబర్ 7 అన్నారు.

230195 సీక్రెట్ డాక్ట్రిన్ 6

వైఖరి శ్వాస అంటే ఏమిటి? మధ్యమ శ్వాస అంటే ఏమిటి? పశ్యంతి శ్వాస అంటే ఏమిటి ? పరాశ్వాస అంటే ఏమిటి ? పరా శ్వాసను పట్టుకునె స్థాయిలొ ఉన్న మనుషులనే పరమ హంసలు అన్నారు. హంస కి శ్వాస కి తేడ లేదు. అందుచేత పమహంస స్థితి అంటే అర్ధం ఏమిటి అంటే శ్వాస యొక్క పరా స్థితిని పట్టుకున్నవారు.

240195 సీక్రెట్ డాక్ట్రిన్ 7

ఉఛ్ఛలోకాల నుండి ప్రేరణ వస్తే ప్రజ్ఞ అంటాము. మాములు భౌతిక జగత్తు నుండి వస్తే విజ్ఞానము అంటాము. ఇప్పుడు మనం విజ్ఞాన మయ కోశంలొ ఉన్నాము. నిద్ర పోయె ముందు శ్వాసను గమనిస్తు భృకటి మధ్యలొ ఎంత కాంతిని ఊహించు కోగలిగితె అంత కాంతిని చల్లగ ఉహించుకోండి.

250195 సీక్రెట్ డాక్ట్రిన్ 8

మన మనస్సులొ ఉన్నటువంటి కుంచితమైన ఆలోచనలు పనికి రానటువంటి రూపు దాల్చినటువంటి ఆలోచనలు ఈర్ష్యలు, ద్వేషాలు ఈ మూర్తీభవించిన ఆలోచనలన్ని కరిగించేసుకోగలిగితె అమృతత్వం చేసుకోగలిగితె ఒక ఆదర్శవంతమయిన మూర్తిని చేసుకోవచ్చు. శ్వాస ద్వార ఆలోచనలు మార్చుకోవచ్చు.

260195 సీక్రెట్ డాక్ట్రిన్ 9

సూర్యుడి నుండి పృద్వి మీదకు ఏడు కిరణాలు వస్తున్నాయి. ఆ ఏడు కిరణాల స్పందన మాత్రమె మన జీవితాలు. వైలెట్ నుండి రెడ్ వరకు ఆ ఏడు రంగులు లేక పోతే గుడ్డి వాళ్ళమె మనం. చీకటి వస్తుంది. ఒక తెలుపు కిరణం సప్త ఋషి మండలం నుండి వస్తుంది. సప్త ఋషి మండలంలొ ఏడు నక్షత్రాలు ఉన్నాయి. ఆ ఏడు నక్షత్రాలలొ ఏదొ ఒక నక్ష్రతం నుండి ఆ ఒక కిరణము సూర్యుడులో కి వస్తుంది.

270195 సీక్రెట్ డాక్ట్రిన్ 10

పంచతత్వ పూజ పృధ్వితత్వము సుగంధము. ఊదివత్తి యొక్క వాసన దృష్ఠి మూలాధారము మీద ఉంచుకోవాలి. స్వాధిష్టాన చక్రము యొక్క లింక్ రుచితొ ఉంది. ఒక గుటక వేసి దృష్ఠిని అక్కడ పెట్టి నాలుక మీద ఎటువంటి రుచులు వస్తున్నాయొ గమనిచంటం. ఇంకాస్త పైకి వెళ్తె అగ్ని తత్వము ఉంది. మీ హృదయంలొ మీ గురువును కాని ఇష్ట దైవాన్ని కాని చూడండి. ఇంకాస్త పైకి వెళితె శిరస్సు మీద హస్తమస్తక స్పర్శ వాయువు యొక్క తత్వము. ఇంకొంత పైకి వెళితే మీరు ఏ నామము అయితె చేస్తున్నారొ ఆ నామాన్ని ఉచ్చారణ చేస్తు ఉండడి.

280195 సీక్రెట్ డాక్ట్రిన్ 11

"ఒక ఆత్మ రక రకాల అనుభూతులను పొందటానికి మనం బట్టలు ఎలా మార్చు కుంటామో అలా మార్చు కుంటుంది. పునర్జన్మ అనేది నిజం. ఏ కర్మ సిద్ధాంతం అయితే ప్రకృతిలొ అమలులో ఉందొ అది నిజం .మనం బుద్ధిని మార్చలేము కాని కర్మను మార్చుకోవచ్చు. కర్మను మారిస్తె బుద్ధిని మార్చుకోవచ్చు."

290195 సీక్రెట్ డాక్ట్రిన్ 12

ఎలెక్ట్రిసిటీ ఒక శక్తి కాదు ఒక వ్యక్తి యొక్క పేరు. ఎలాంటి వ్యక్తి, కర్మ పలితాలను అదించేటటువంటి వ్యక్తి యొక్క పేరు. శ్వాస తీసుకునే టప్పుడు ఆలోచనలు కనుక కలప గలిగితె ఆ ఆలొచనలను సంస్కారంగ మర్చేయవచ్చు. శ్వాసతొ పాటు ఆలోచనలు కలపగలగటమే సంస్కారము.

300195 సీక్రెట్ డాక్ట్రిన్ 13

రామాయణం వాయువు యొక్క తత్వాన్ని చెపుతుంది. వాయువుని ఎన్ని రకాలుగ కొలవ వచ్చొ చెపుతుంది. శివ శక్తి వలన ప్రపంచంలోని అన్ని తలాలలోను కావలసినటువంటి అణువులు ఏర్పడతాయి. ఈ అణువు ఏర్పడినటువంటి వాటిని విష్ణు శక్తి కావలసిన స్వరూపాన్ని ఇస్తుంది. కావలసిన స్వరూపాన్ని ఇచ్చిన తరువాత చివరికి మానవ జన్మ వచ్చిన తరువాత కర్మగ బ్రాహ్మి శక్తి కిందకు దిగుతుంది.

310195 సీక్రెట్ డాక్ట్రిన్14

"బాహ్య జగత్తులో ఏమి కనిపిస్తుందో అంతర్జగత్తులో అదే ఉంది. మన ఆలోచన ఏ దిశలో వెళుతుందో మన శక్తి కూడ ఆ దిశలోనే వెళుతుంది. మీరు ఏది నాటుతారో దాన్నే కోసుకుంటారు. ఆలొచన కోరికగ మారుతుంది. కోరిక ప్రేరణగ మారుతుంది."

310195 సీక్రెట్ డాక్ట్రిన్ 15

ఆలొచనలకు అనుగుణమయిన బాహ్య వాతావరణము ఉండాలి. ఈ బాహ్య వాతావరణమునే భగవద్గీతలో పర్జన్యం అని చెప్పారు. ఇప్పుడు చాల చోట్ల వర్షాలు కురవటం లేదని, కావాల్సిన పరిస్థితులు లేవని అనుకుంటూ ఉంటాము. అందరూ సుఖంగ ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలని ఆలొచనలు పైన ఉంటే అవి కిందకు దిగుతాయి. అసలు ఇప్పుడు మన ఆలోచనలుసరిగ్గా ఉండటం లేదు అవే కిందకు దిగుతున్నాయి.

06111995 గాయత్రీ పరివార్

అసతోమ సద్గమయ అనే స్థితి. తమసోమ జ్యోతీర్గమయ అనే స్థితి, మృత్యోర్మ అమృతంగమయ అనే స్థితి అంటె ప్రుధ్వి తత్వము, జల తత్వము, అగ్ని తత్వము కలిపి విశిష్టమయి నటువంటి దివ్యత్వ మయినట్టి వాతావరణాన్ని భూమిపై దింపుతాము అనేటటువంటి దీక్ష ఏదయితొ వుందొ అదె గాయత్రి పరివార్ యొక్క దీక్ష అదె అందరి గురువుల యొక్క దీక్ష.

నవంబర్

అశ్వినీ దేవతలు మరియు శ్వాస

"సూర్య కిరణాలలో 3 రకాలయిన శక్తులు ఉన్నాయి.మొదటి శక్తి మట్టిని మాణిక్యంగ మార్చవచ్చు. రెండవది చనిపోయిన వ్యక్తిని బతికించవచ్చు. మూడవది ఒక స్థితిలొ ఉన్న పుష్పాన్ని ఇంకొక పుష్పంగ మార్చేయవచ్చు."

గాయత్రీ మంత్ర ఉపయోగము- విద్యారంభసంస్కారము

"సూర్య కిరణాలలో 3 రకాలయిన శక్తులు ఉన్నాయి.మొదటి శక్తి మట్టిని మాణిక్యంగ మార్చవచ్చు. రెండవది చనిపోయిన వ్యక్తిని బతికించవచ్చు. మూడవది ఒక స్థితిలొ ఉన్న పుష్పాన్ని ఇంకొక పుష్పంగ మార్చేయవచ్చు."

యుగసంధి పురశ్చరణ - సంస్కారములు

గాయత్రీ మంత్రార్ధము: నా యొక్క మనోవాక్కాయ కర్మలలో ఆ శ్రేష్ఠమైన సవితా తేజస్సును, అజ్ఞానాంధకారమును పోగొట్టె దివ్యమైన శక్తులను ధారణచేయుచున్నాను, అది మా బుధ్ధులను సన్మార్గము వైపుకు ప్రేరేపించుచున్నది.

మేధా యజ్ఞములు - వేటపాలెము

యజ్ఞముయొక్క పూర్ణాహుతి, తరువాత మేధా యజ్ఞములు - నరమేధము, గోమేధము & సర్వమేధము. వేదమూర్తి తపోనిష్ఠ, యుగద్రష్ఠ పండిత శ్రీరామ శర్మ ఆచార్య, పరమ వందనీయ మాతా భగవతీదేవి ప్రేమ సంరక్షణములో గాయత్రీ మాత యొక్క వరదానములతో ఇక నుండీ నా జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను నా గురువు స్థాయిలో ఉపయోగించుకుంటాను, ఏ రోజు ఈ పని చెయ్యలేకపోతే ఆ రోజు నిర్జల ఉపవాసము ఉంటాను అను దీక్షను అందరికీ ప్రదానము చేసారు. ఇంద్రియములను పూర్తిగా గురువుకు సమర్పణ చేస్కోవటమే గోమేధ యజ్ఞము

డిసెంబర్

031295 సంజీవినీవిద్య

"మొక్కుబడులు మొక్కడం వలన, కాకా పట్టడం వలన, స్తోత్రాలు చెయ్యడం వలన భగవంతుడు లొంగడు. చావు అనేది ఒక మిధ్య.చావు అనేది లేదు. జీర్ణించి పోయినట్టి బట్టలను మనం ఎలా గయితె వదిలేస్తామొ అలాగె పాత శరీరలను వదిలేసి కొత్త శరీరాలను మనం ధరిస్తూ ఉంటాము అని శ్లోకాలు వల్లె వెయ్యటం కాదు నిజంగ ధరించి చూపించగలగటం దేవాలయాలలో నేర్పబడుతుంది"