జులై

240791 గురుపౌర్ణమి

ఇప్పుడున్న ఆధ్యాత్మికత అధ్యాత్మికత కాదు. ఏ ధర్మము కూడ మిమ్మల్ని ఆధ్యాత్మికత వైపు తీసుకు వెళ్ళటం లేదు. చనిపోయిన వాళ్ళను బతికించటం ఆధ్యాత్మికత కాదు. నీకు చావు లేదు అని చెప్పగలగటం ఆధ్యాత్మికత. శారీరకమయినటువంటి ఆసనాల ద్వార మీరు అధ్యాత్మికతను పొందలేరు.

250791 గురుపౌర్ణమి

గురువు ఎప్పుడు అర్ధం కాడు శిష్యుడుకి. గురువు యొక్క గొప్పతనం ఏ శిష్యుడు ఎప్పుడు అర్ధం చేసుకోలెడు. గురువే స్వయంగ శిష్యుడుని వెతుక్కుంటాడు తప్ప శిష్యుడు గురువును వెతుక్కునే ప్రక్రియ అసలు లేనె లేదు

260791 గురుపౌర్ణమి

గురువు శిష్యుడు ఏమి ఇచ్చాడు అని చూడడు ఏ భావంతొ ఇచ్చాడు అని చూస్తాడు. శిష్యుడు తన సర్వస్వం ఇచ్చేస్తే గురువు తన సర్వస్వం ఇచ్చేస్తాడు. శిష్యుడు ఒక అడుగు ముందుకు వేస్తె గురువు 100 అదుగులు ముందుకు వేస్తాడు. గురువు కి ఇచ్చే దక్షిణ చాలా ముఖ్యమైనది. శిష్యుడు ఇచ్చిన దక్షిణకు ప్రతిఫలంగా గురువు శిష్యుడుకు 100 రెట్లు ఇస్తాడు

230791 పంచాగ్నివిద్య 1

హిమాలయాలలొ ఉన్న ఋషులకు అనంతమయిన శక్తి ఉన్నప్పటికీ కూడ వాళ్ళ కార్యక్రమాలకు ఆచరణ యోగ్యమయిన రూపు ఇవ్వలేక పోతున్నారు అంటే వాళ్ళకు స్థూల శరీరం లేదు కనుక. అందుకని వాళ్ళు స్థూల శరీర దారులతొ సంబంధం పెట్టుకుంటారు.వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మార్చకుండ ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగ మనుషులకు అవగాహన అయ్యే విధంగ చెప్పగలిగే వ్యక్తులను ఎన్నుకుంటారు. అలాంటి వారు వాళ్ళ ఇద్దరికి మధ్య వారధిగ పని చేస్తు గురువులాగ రూపొందుతూ ఉంటారు.

240791 పంచాగ్నివిద్య 2

గురువుకి పూర్తిగ అత్మ సమర్పణ చేసేసుకోవాలి. గురువుకి అత్మ సమర్పణ చేసుకున్నాక మన ఇంటికి మిగత ప్రపంచానికీ కావాల్సిన వనరులు సమకూర్చే బాధ్యత ఆయనదే. గురువు భౌతికంగ శిష్యులు దగ్గర ఉండడు. గురువు ఎప్పుడు సూక్ష్మ జగత్తులొ మార్గదర్శనం చెయ్యగలడు తప్ప స్థూల జగత్తులొ మర్గదర్శనం చెయ్యడు.

240791 పంచాగ్నివిద్య 3

" ప్రపంచంలో అపవిత్రం కాని వస్తువు అగ్ని. ఆ పవిత్రత అనే లక్షణాన్ని శుచి అనే లక్షణంతొ కూడ చెపుతాము. శుచి యొక్క పవిత్రత మీకు రావలంటే పసుపు రంగును ఎక్కువుగా ఉపయోగించుకోవాలి. పసుపు రంగు కల ఆలోచనలు మీకు రావాలి. పసుపు రంగు కల గుణాలు ఎక్కువ అయ్యాయొ లేదొ తెలియాలంటె మనలొ సూక్ష్మ దృష్టి ఎక్కువ అవ్వాలి. "

250791 పంచాగ్నివిద్య 4

"అగ్నిలో 3 రకాలు పావక, పవమాన, శుచి. పావక అగ్ని స్థూల జగత్తుకి సంబందించింది. పవమాన సూక్ష్మ జగత్తుకి సంబంధించినది, లేనిది మనం పొందటం పవమాన అగ్ని. శుచి లొ శిష్యుడు ప్రకృతి యొక్క నియమాలను ఉల్లఘించి గురువు యొక్క నియమాలలోకి వెళ్ళిపోతాడు."

270791 గురుస్పర్శ

"బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మీలొ ఉన్నా శాంతి చెదరకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. 3 సార్లు శాంతి మంత్రం చేస్తున్నపుడు భావ పూర్వకంగ చెయ్యండి. ఒకటి స్థూల జగత్తులో శాంతి. రెండు సూక్ష్మ జగత్తులో శాంతి. మూడు కారణ జగత్తులో శాంతి "

అక్టోబర్

151091 యోగసాధన

జగత్తును అంతా నడిపించే శక్తి ఒక్కటే ఉంది. ఆ శక్తి మీకు బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చాల ఆనందంగా స్వీకరించండి. శరీరానికి లొంగి పోకండి. కోరికలకు లొంగి పోకండి. భాధ్యతలకు పూర్తిగ లొంగిపోండి. మౌనం గ ఉండండి.